Women: ఆ కారణంతో మహిళలు ఉద్యోగం మానేస్తున్నారు.. నౌకరీ.కామ్‌ నివేదికలో ఆసక్తికర విషయాలు

|

Aug 25, 2024 | 6:49 AM

అయితే ఎంత ముందంజలో ఉన్న మహిళలు ఇప్పటికీ ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తున్నారు. దీంతో ఉద్యోగం చేయడం మహిళలకు సవాలుగా మారుతోందని ప్రముఖ జాబ్‌ పోర్టల్ నౌకరీ డాట్‌ కామ్‌ నివేదికలో వెల్లడైంది. అటు ఇంటి పని, ఇటు ఆఫీసు పని మధ్య మహిళలు సమన్వయం సాధించలేకపోతున్నారని...

Women: ఆ కారణంతో మహిళలు ఉద్యోగం మానేస్తున్నారు.. నౌకరీ.కామ్‌ నివేదికలో ఆసక్తికర విషయాలు
Women Employees
Follow us on

‘ఉద్యోగం పురుష లక్షణం’.. ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఉద్యోగం మనిషి లక్షణం అనే రోజులు వచ్చేశాయ్‌. మహిళలు సైతం పురుషులతో సమానంగా, ఆ మాటకొస్తే పురుషులతో పోల్చితే ముందజంలో ఉంటున్నారు. ఉద్యోగాల్లో ఉన్నతంగా రాణిస్తూ పురుషుల కంటే ఎక్కువ జీతాలను తీసుకుంటున్నారు. దాదాపు అన్ని రంగాల్లో మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు.

అయితే ఎంత ముందంజలో ఉన్న మహిళలు ఇప్పటికీ ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తున్నారు. దీంతో ఉద్యోగం చేయడం మహిళలకు సవాలుగా మారుతోందని ప్రముఖ జాబ్‌ పోర్టల్ నౌకరీ డాట్‌ కామ్‌ నివేదికలో వెల్లడైంది. అటు ఇంటి పని, ఇటు ఆఫీసు పని మధ్య మహిళలు సమన్వయం సాధించలేకపోతున్నారని ఇందులో తేలింది. సర్వేలో భాగంగా ఉద్యోగం చేస్తున్న కొందరు మహిళలను పరిగణలోకి తీసుకున్నారు.

ఈ సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 39 శాతం మంది మహిళలు ఇల్లు-ఉద్యోగ బాధ్యతలను సమన్వయం చేసుకోలేక తాము ఉద్యోగాన్ని వీడుతున్నామని వాపోయారు. ఒకవేళ ఉద్యోగంలో చేరినా.. పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరలేకపోతున్న వారి సంఖ్య 49 శాతంగా ఉంది. దీనికి ప్రధాన కారణం అనుకూలమైన పనివేళలలు లేకపోవడమే కారణమని వారు చెబుతున్నారు. ఇక కుటుంబ బాధ్యతలను నిర్వహించడం వల్ల ఉద్యోగంలో కొనసాగడం కష్టంగా ఉందని 35 శాతం మంది తెలిపారు.

స్కిల్స్‌ ఒకేలా ఉన్నా.. పురుషులతో పోల్చితే తమకు గ్రోత్‌ అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని 24 శాతం మంది మహిళలు అభిప్రాయపడ్డారు. అయితే 13 శాతం మంది పురుషులు మాత్రం మహిళలకే అధిక అవకాశాలుంటున్నాయని పేర్కొనడం గమనార్హం. కాగా 3 శాతం మంది ఈ వాదనను సమర్థించారు. ఈ విషయమై నౌకరీ.కామ్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ పవన్ గోయల్ మాట్లాడుతూ.. 73% మంది మహిళలు పని ప్రదేశంలో లింగ సమానత్వం ఉంటోందని తెలిపారన్నారు. దీంతో మహిళలకు సమాన అవకాశాలు ఉంటున్నాయని స్పష్టమైందన్నారు. అలాగే 31% మంది మహిళలు తాము తక్కువ జీతానికే పనిచేస్తున్నామని చెప్పారన్నారు. కానీ, 53% మంది వేతనంలో ఎలాంటి తేడాలూ ఉండటం లేదని వెల్లడించినట్లు చెప్పుకొచ్చారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..