ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లాయిడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్(సీఎల్‌ఏఎస్) ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 400 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 400 సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ 2019, 2020, 2021/ ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ టైర్ 1 పరీక్ష అర్హత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 27 ఏళ్లు మించకూడదు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను స్క్రూటినీ, ప్రిలిమినరీ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన వారికి నెలకు రూ. 15,000 స్టైపెండ్‌గా అందిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 14-01-2023తో ముగియనుంది.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..