Job Mela Hyderabad: మంగళవారం హైదరాబాద్‌లో మెగా జాబ్‌ మేళ.. పాల్గొననున్న 40 కంపెనీలు.. పూర్తివివరాలు..

|

Feb 08, 2022 | 6:22 AM

Job Mela Hyderabad: కరోనా (Coroan) పరిస్థితుల నుంచి సమాజం క్రమంగా బయటపడుతోంది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా మందకొడిగా సాగిన ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రస్తుతం వేగవంతమైంది. కంపెనీలు సైతం ఉద్యోగులను నియమించుకోవడానికి..

Job Mela Hyderabad: మంగళవారం హైదరాబాద్‌లో మెగా జాబ్‌ మేళ.. పాల్గొననున్న 40 కంపెనీలు.. పూర్తివివరాలు..
Follow us on

Job Mela Hyderabad: కరోనా (Coroan) పరిస్థితుల నుంచి సమాజం క్రమంగా బయటపడుతోంది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా మందకొడిగా సాగిన ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రస్తుతం వేగవంతమైంది. కంపెనీలు సైతం ఉద్యోగులను నియమించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందులో భాగంగానే జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో మేగా జాబ్‌ మేళా జరగనుంది. ఫిబ్రవరి 8 (మంగళవారం) హైదరాబాద్‌లోని మాసబ్‌ ట్యాంక్‌లో ఉన్న ఖాజా మ్యాన్షన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఈ జాబ్‌ మేళా జరగనుంది. మంగళవారం ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

ఈ జాబ్‌మేళాలో ఏకంగా 40 కంపెనీలు పాల్గొననున్నాయి. ఎక్స్‌పీరియన్స్‌ ఉన్నవారితో పాటు ఫ్రెషర్స్‌ కూడా ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావొచ్చని అధికారులు తెలిపారు. ఈ జాబ్‌ మేళాలో పదో తరగతి నుంచి ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేసిన వారు హాజరుకావొచ్చు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ జరిగే ప్రదేశానికి రెజ్యూమ్‌తో పాటు విద్యార్హత జిరాక్స్‌ కాపీలు, ఫోటోలు, అనుభవం ఉన్న వారు వాటి సంబంధిత సర్టిఫికేట్లతో హాజరుకావాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం 8374315052 నెంబర్‌ను సంప్రదించాలి.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌లోని మౌలానా అజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ శుక్రవారం తొలిసారి ఆన్‌లైలో ఉర్దూ జాబ్‌మేళాను నిర్వహించింది. ఈ జాబ్‌మేళాలో దేశవ్యాప్తంగా సుమారు 2500 మంది అభ్యర్థులు రిజిస్టర్‌ చేసుకున్నారు. 50కిపైగా కంపెనీలు ఈ జాబ్‌మేళాలో పాల్గొన్నాయి.

Also Read: Rakul Preet Singh : బాలీవుడ్ లో బిజీగా మారిపోయిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్

Lata Mangeshkar: ఆ మధుర గానం మూగబోయింది.. భారత కోకిల లతా మంగేష్కర్‌ ఇకలేరు..

ఇలా కూడా సిక్సర్ బాదొచ్చా !! వైర‌ల్ అవుతోన్న వీడియో