NEET 2021 Exam: త్వరలో నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్.. కీలక ప్రకటన చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ..

NEET 2021 Exam: దేశ వ్యాప్తంగా 558 ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 83,275 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ..

NEET 2021 Exam: త్వరలో నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్.. కీలక ప్రకటన చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ..
Mbbs Seats

Updated on: Jul 24, 2021 | 2:18 PM

NEET 2021 Exam: దేశ వ్యాప్తంగా 558 ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 83,275 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. మరికొద్ది రోజుల్లో నీట్ పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో కేంద్రం ఈ ప్రకటన చేసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో 5,240 ఎంబీబీఎస్ సీట్లు, 2,237 పీజీ సీట్లు ఉన్నట్లు ప్రకటించింది. 289 ప్రభుత్వ కాలేజీల్లో మొత్తం 43,435 ఎంబీబీఎస్ సీట్లున్నాయని కేంద్రం పేర్కొంది. 269 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 39,840 ఎంబీబీఎస్ సీట్లున్నాయన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో ఉన్న మొత్తం సీట్లలో 15 శాతం(6,515) సీట్లు అన్ని రాష్ట్రాలు నేషనల్ పూల్‌కి ఇస్తాయని కేంద్రం ప్రకటించింది. ఈ సీట్లను జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కేటాయించడం జరుగుతుంది.

తెలంగాణలో 34 ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 5,240 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వాటిలో 11 ప్రభుత్వ కాలేజీల్లో 1,790 సీట్లు, 23 ప్రైవేట్ కాలేజీల్లో 3,450 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇక ప్రభుత్వంలోని సీట్లల్లో 15 శాతం అంటే 268 సీట్లు నేషనల్ పూల్ లోకి వెళ్తాయి. ప్రైవేట్ కాలేజీల్లోని సీట్లల్లో 50 శాతం కన్వీనర్ కోటాకింద భర్తీ చేస్తారు. మిగిలిన 35 శాతం బీ కేటగిరీ కింద నిర్ణీత ఫీజుతో భర్తీ చేశారు. 15 శాతం సీట్లను ఎన్ఆర్ఎస్ఐ కోటా కింద తమకు ఇష్టమైన వారికి ప్రైవేట్ యాజమాన్యాలు కేటాయించుకోవడానికి వెలుసుబాటు ఉంది.

Also read:

Pubg Effect: చదువుకుంటారని స్మార్ట్ ఫోన్ ఇస్తే కొంప కొల్లేరు చేశారు.. తల్లికి తెలియకుండా..

Huzurabad By Election: హుజూరాబాద్‌లో ఈటెల రాజేందర్‌దే గెలుపు.. సంచలన కామెంట్స్ చేసిన బండి సంజయ్..

V Hanumantha Rao: ఆ విషయాలపై ఇప్పుడేం మాట్లాడను.. క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత..