
Harvard Report: కళాశాల డిగ్రీని ఎంచుకోవడం అనేది జీవితాన్ని ప్రభావితం చేసే కీలకమైన నిర్ణయం. ఉన్నత విద్య అభ్యసించేందుకు దేశంలో రకరకాల కళాశాలలు ఉన్నాయి. అయితే కొన్ని కళాశాలల సర్టిఫికేట్లు ఎంతో విలువైనవిగా ఉంటే.. కొన్ని కళాశాలల డిగ్రీ సర్టిఫికేట్లకు పెద్దగా విలువ ఉండదని ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. హార్వర్డ్ ఆర్థికవేత్తల కొత్త పరిశోధన ప్రకారం.. అన్ని కళాశాల డిగ్రీలు శాశ్వత ఆర్థిక రాబడిని అందించవని స్పష్టం చేసింది.
హార్వర్డ్ కార్మిక ఆర్థికవేత్త డేవిడ్ జె డెమింగ్, పరిశోధకుడు కదీమ్ నోరే తమ 2020 అధ్యయనంలో కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, వ్యాపారం వంటి సాంప్రదాయ అనువర్తిత డిగ్రీలపై రాబడి కాలక్రమేణా త్వరగా తగ్గుతుందని వెల్లడించారు. అయితే ఈ కళాశాలల్లో డిగ్రీ చేసినా ఆ సర్టిఫికేట్లపై మీరు ఏదైనా ఉద్యోగం చేసినట్లయితే పెద్దగా వేతనాలు అందవు.
పరిశ్రమలో వేగంగా మార్పులు రావడంతో మార్కెట్ విలువను కాపాడుకోవడానికి నైపుణ్యాలను నిరంతరం పెంచుకోవడం తప్పనిసరి కావడంతో ఒకప్పుడు బంగారు ప్రమాణాలుగా పరిగణించే డిగ్రీలు ఇప్పుడు వాటి విలువను కోల్పోతున్నాయని వారి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఉన్నత వ్యాపార డిగ్రీలు కూడా దీనికి అతీతం కాదు. 2025 ప్రారంభంలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్, ఇతర ఐవీ లీగ్ కెరీర్ సెంటర్ల నివేదికలు అగ్రశ్రేణి MBA గ్రాడ్యుయేట్లు ఉన్నత స్థాయి పదవులను పొందేందుకు ఇబ్బంది పడుతున్నారని గమనించాయి. ఇది ప్రతిష్ట కూడా ఇకపై ప్లేస్‌మెంట్ లేదా జీతం హామీ ఇవ్వదు అనేదానికి సంకేతం.
ఉదాహరణకు, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ డిగ్రీలను తీసుకోండి. 1990ల నుండి 2000ల ప్రారంభ దశలో ఈ రంగాల్లో డిగ్రీలు అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలకు దారితీసేవి. కానీ 2025 నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సాఫ్ట్‌వేర్ కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయి. ఇది సాంప్రదాయంగా లాభదాయకంగా భావించిన రంగాల్లో కూడా ఉద్యోగ భద్రత తగ్గిపోతున్నదని సూచిస్తుంది.
తాజా హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం.. ఈ కింది డిగ్రీలు తమ దీర్ఘకాలిక మార్కెట్ విలువను కోల్పోతున్నాయి.
మార్కెట్లో విలువ తగ్గుతున్న 10 డిగ్రీలు ఇవే..
భవిష్యత్తు కోసం విద్యార్థులు ఏమి ఎంచుకోవాలి?
హార్వర్డ్ పరిశోధన ప్రకారం.. డిగ్రీ మాత్రమే ఇకపైనా విజయానికి హామీ కాదు. భవిష్యత్తు కెరీర్ విజయానికి అనుకూలత, మల్టిపుల్ నైపుణ్యాలు, నిరంతర అభ్యాసం అత్యవసరం. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను సృజనాత్మకత, సమస్య పరిష్కారం, సామాజిక మేధస్సుతో కలపడం నేర్చుకోవాలి.
ఇది కూడా చదవండి: Auto News: దేశ ప్రజల మనస్సు దోచుకున్న బైక్‌లు.. కేవలం రూ.75వేలలోనే.. మైలేజీ మాత్రం అదుర్స్!