Zomato: జొమాటోకు బిగ్‌ షాక్‌.. రూ.184 కోట్లకుపైగా పన్ను, పెనాల్టీ నోటీసులు జారీ చేసిన ఆదాయపన్ను శాఖ

|

Apr 02, 2024 | 7:44 PM

ప్రముఖ ఆన్‌లైన్‌ పుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటోకు ఐటీ బిగ్‌ షాక్‌ ఇచ్చింది. ఏకంగా రూ.184 కోట్లకుపైగా సర్వీస్ టాక్స్ డిమాండ్, పెనాల్టీ ఆర్డర్‌ నోటీసులను ఆదాయ పన్ను శాఖ పంపించింది. సర్వీస్‌ ట్యాక్స్‌, పెనాల్టీ కలిపి రూ.184 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై స్పందించిన జొమాటో అప్పీల్‌కు వెళతామని పేర్కొంది. సోమవారం అర్ధరాత్రి సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది..

Zomato: జొమాటోకు బిగ్‌ షాక్‌.. రూ.184 కోట్లకుపైగా పన్ను, పెనాల్టీ నోటీసులు జారీ చేసిన ఆదాయపన్ను శాఖ
Zomato
Follow us on

ఢిల్లీ, ఏప్రిల్ 2: ప్రముఖ ఆన్‌లైన్‌ పుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటోకు ఐటీ బిగ్‌ షాక్‌ ఇచ్చింది. ఏకంగా రూ.184 కోట్లకుపైగా సర్వీస్ టాక్స్ డిమాండ్, పెనాల్టీ ఆర్డర్‌ నోటీసులను ఆదాయ పన్ను శాఖ పంపించింది. సర్వీస్‌ ట్యాక్స్‌, పెనాల్టీ కలిపి రూ.184 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై స్పందించిన జొమాటో అప్పీల్‌కు వెళతామని పేర్కొంది. సోమవారం అర్ధరాత్రి సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.

అక్టోబరు 2014 నుంచి జూన్ 2017 వరకు సర్వీస్‌ ట్యాక్స్‌ చెల్లించనందుకు గానూ డిమాండ్ ఆర్డర్ పంపినట్లు ఐటీ పేర్కొంది. విదేశీ అనుబంధ సంస్థలు, కంపెనీ బ్రాంచ్‌లు దేశం వెలుపల ఉన్న తమ కస్టమర్‌లకు చేసిన కొన్ని విక్రయాలకు సర్వీస్‌ ట్యాక్స్‌ చెల్లించలేదని కారణంగా ఢిల్లీ సెంట్రల్‌ ట్యాక్స్‌ కమిషనర్‌ ఏప్రిల్‌ 1న పంపిన డిమాండ్‌ నోటీసు పంపించినట్లు కంపెనీ తెలిపింది. ఇది వరకే పంపిన షోకాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా ఆరోపణలకు సంబంధించి ఆధారాలతో సహా తగిన పత్రాలు, న్యాయపరమైన పూర్వాపరాలతో పాటు వివరణ ఇచ్చినట్లు కంపెనీ పేర్కొంది. అయితే తాము అందించిన ఆధారాలను అధికారులు పరిగణనలోకి తీసుకోలేదని జొమాటో కంపెనీ పేర్కొంది. ఏప్రిల్ 1న ఢిల్లీ సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ (అడ్జుడికేషన్) జారీ చేసిన ఉత్తర్వులు తమకు అందినట్లు కంపెనీ తెలిపింది.

అక్టోబరు 2014 నుండి జూన్ 2017 కాలానికి సంబంధించి ఈ ఆర్డర్‌ను అందుకున్నట్లు జొమాటో వెల్లడించింది. జరిమానాగా రూ. 92,09,90,306 సర్వీస్‌ ట్యాక్స్‌ కింద రూ92,09,90,306.. మొత్తం కలిపి రూ.184 కోట్లకు డిమాండ్‌ అందుకున్నట్లు జొమాటో పేర్కొంది. దీనిపై అప్పీల్‌కు వెళతామని కంపెనీ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.