Fact Check: ఇటీవలి కాలంలో చాలా మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ‘అనుమానాస్పద కార్యకలాపాల కారణంగా మీ ఎస్‌బీఐ ఖాతా త్వరలోని తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది’ అనే మెసేజ్ వస్తోంది. ఈ నేపథ్యంలో సదరు బ్యాంక్ కస్టమర్లలో కొంత ఆందోళన నెలకొంది. అసలు ఈ మెసేజ్ నిజం కాదని, ఓ ఫేక్ వార్త మాత్రమేనని ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెకర్ PIB ఫాక్ట్ చెక్ పేర్కొంది. ఈ మేరకు ‘అనుమానాస్పద కార్యకలాపం కారణంగా మీ ఖాతా తాత్కాలికంగా లాక్ చేయబడిందని ఎస్‌బీఐ అన్నట్లుగా ఫేక్ మెసేజ్ పేర్కొంది. అవి వాస్తవం కాదు. మీ బ్యాంకింగ్ వివరాలను షేర్ చేయమని అడిగే ఇమెయిల్‌లు/SMSలకు ఎప్పుడూ స్పందించవద్దు. అటువంటి మెసేజ్‌లను వెంటనే report.phishing@sbi.co.inలో రిపోర్ట్ చేయండి’ అని పీబీఐ ఫ్యాక్ట్ చెక్ తన ట్వీట్‌లో తెలిపింది. మరోవైపు కస్టమర్ ఐడెంటిఫికేషన్ కోసం ఎప్పుడూ ఇమెయిల్/SMS పంపించడం లేదా ఫోన్ కాల్స్ చేయడం వంటివి చేయమని SBI ఇప్పటికే పలుమార్లు పేర్కొంది.
A #Fake message impersonating @TheOfficialSBI claims that recipient’s account has been temporarily locked due to suspicious activity#PIBFactCheck
ఇవి కూడా చదవండి✖️Never respond to emails/SMS asking to share your banking details
✔️Report such messages immediately on report.phishing@sbi.co.in pic.twitter.com/9SMIRdEXZA
— PIB Fact Check (@PIBFactCheck) May 16, 2023
మీ బ్యాంకింగ్ వివరాలను షేర్ చేయమని అడిగే ఇమెయిల్‌లు/SMSలకు స్పందించినట్లయితే మీరు పూర్తిగా మోసపోతారు. ఎందుకంటే.. ఆ లింకులపై క్లిక్ చేయడం ద్వారా మీ బ్యాంక్ ఖాతాలోని మొత్తం డబ్బు, , వ్యక్తిగత డేటాను కోల్పోయే ప్రమాదం ఉంది. మీ ఫోన్ లేదా ఇమెయిల్-ఐడిలో స్కామర్ పంపిన ఏదైనా లింక్‌ని క్లిక్ చేయడం ద్వారా స్కామర్‌లకు మీ ఖాతాను యాక్సెస్ చేయడానికి అవసరమైన డేటా, అవకాశం లభిస్తుంది.
మీకు ఎప్పుడైనా బ్యాంక్ మెసేజ్ వచ్చినట్లయితే వెంటనే.. అది నిజమైనదేనా కాదా అని సదరు బ్యాంక్ కస్టమర్ కేర్‌ని సంప్రదించండి. ఒక వేళ మీకు వచ్చిన మెసేజ్ ఫేక్ అని మీకు తెలిసినట్లయితే.. వాటికి స్పందించకండి. ఇంకా అలాంటి మెసేజ్‌లపై వెంటనే report.phishing@sbi.co.inలో రిపోర్ట్ చేయండి. లేదా 1930కి కూడా కాల్ చేసి కంప్లెయింట్ చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..