Medical Needs: కరోనా మహమ్మారి నేపథ్యంలో, వైద్య అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డబ్బు సమస్యను ఎదుర్కోకుండా ఉండటానికి ఈపీఎఫ్ఓ (EPFO) ఒక ప్రత్యేక సదుపాయాన్ని ప్రారంభించింది. దీని కింద, ఇప్పుడు మీరు మీ పిఎఫ్ ఖాతా నుండి గంటలోపు 1 లక్ష రూపాయలను సులభంగా ఉపసంహరించుకోవచ్చు. ఈ సౌకర్యం ద్వారా, ఏ వ్యక్తి అయినా పిఎఫ్ ఖాతా నుండి తన డబ్బును ఉపసంహరించుకోవచ్చు. ఇంతకు ముందూ మెడికల్ అవసరాల కోసం పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు తీసుకునే వెసులుబాటు ఉంది. కానీ, దానికోసం మీరు ముందుగా మెడికల్ బిల్లులు జమ చేయాల్సి వచ్చేది. అంటే, మీరు వైద్య అవసరాల కోసం డబ్బు ఖర్చు చేసిన తరువాత ఆ బిల్లులను ఈపీఎఫ్ఓకు సమర్పించడం ద్వారా డబ్బును తీసుకునే అవకాశం ఉండేది. తాజాగా చెబుతున్న విధానంలో అటువంటి బిల్లులు ఏమీ జమచేయాయాల్సిన అవసరం ఉండదు. కేవలం మీరు మెడికల్ అవసరాల కోసం డబ్బు కావాలని దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. మీ డబ్బు మీ బ్యాంక్ ఎకౌంట్ కు బదిలీ అయిపోతుంది.
పీఎఫ్ నుంచి మెడికల్ అవసరాల కోసం డబ్బు తీసుకోవడం ఇలా..
ఆన్‌లైన్ క్లెయిమ్ కోసం కొన్ని షరతులు
ముఖ్యమైన విషయం..
ఎంతో ముఖ్యం అయితే తప్ప పిఎఫ్ ఫండ్ నుండి డబ్బును ఉపసంహరించుకోవద్దు. మనీ మేనేజ్మెంట్ నిపుణులు ఈ విషయాన్ని చాలా బలంగా చెబుతున్నారు. ఎందుకంటే పీఎఫ్ ఖాతాలో మీ సొమ్ము 8.5% చొప్పున వడ్డీని పొందుతోంది. ఈ సమయంలో పిఎఫ్ నుండి పెద్ద మొత్తాన్ని ఉపసంహరించుకుంటే, అది రిటైర్మెంట్ ఫండ్‌పై పెద్ద ప్రభావం చూపుతుంది.
Also Read: SBI Customers : ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త..! ఆన్‌లైన్ బ్యాంకింగ్ గురించి సరికొత్త ప్రకటన..
LIC: అదిరిపోయే ఎల్‌ఐసీ పాలసీ.. ఈ ప్లాన్ తీసుకుంటే ప్రతియేటా 12 వేల వరకు పొందవచ్చు.. ఎలాగంటే..!