EPF withdrawal: పీఎఫ్ ఖాతాదారులకు అద్భుతమైన అవకాశం. కోవిడ్ సంక్షోభం నుంచి నెమ్మదిగా కోలుకుంటన్న మనకు ఇదో పెద్ద వార్త. అవసరం కోసం డబ్బులను తీసుకోవాలని అనుకుంటున్నవారు.. కేవలం గంటలోపు మీ బ్యాంక్ ఖాతాలోకి PF డబ్బులను జమ చేసుకునేందుకు ఛాన్స్ ఉంది. దీపావళికి ముందు EPFO ఉద్యోగుల భవిష్య నిధి (PF) ఖాతాకు వడ్డీని బదిలీ చేస్తోంది. మీరు పండుగకు ముందు మీ PF డబ్బును విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే ఈ వార్త మీ కోసమే. పీఎఫ్ అడ్వాన్స్ ఎలా పొందాలో తెలుసుకుందాం. ఈ సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న మనకు అవసర గంటలోపు మీ బ్యాంక్ ఖాతాలో PF డబ్బును జమ చేసుకోవచ్చు.
భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న సామాజిక భద్రతా సంస్థ అయిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) ని ఉపసంహరించుకునే / బదిలీ చేసే అవకాశం ఉంది. భారతదేశంలోని రెగ్యులర్ కార్మికులందరూ ప్రతి నెలా వారి ప్రాథమిక జీతంలో 12 శాతంతో నిధికి సహకరించాలి. ఉద్యోగి యూనిట్ అందించిన సహకారం, దానిపై వడ్డీ కార్మికుని EPF ఖాతాకు జమ చేయబడుతుంది. నిర్దిష్ట పరిస్థితుల్లో ఉపసంహరించుకోవచ్చు.
ఈ ఫండ్ భారతదేశంలోని ఉద్యోగులకు పొదుపు, పెన్షన్ బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఉద్యోగి పదవీ విరమణ సమయంలో తన EPF ఖాతా నుండి పూర్తి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అనారోగ్యం, వివాహం, విపత్తు, ఇంటి పునరుద్ధరణ వంటి కొన్ని సందర్భాల్లో పాక్షిక ఉపసంహరణ కోసం EPFO ద్వారా కేటాయింపులు చేయబడ్డాయి.
EPF నుండి ఆన్‌లైన్‌లో డబ్బు బదిలీ చేయడం ఎలా?
అంతే చాలా ఈజీగా జమలో ఉన్న డబ్బులు మీ ఖాతాలోకి వచ్చి చేరుతాయి. ఇలా చేయాలంటే మాత్రం అన్ని పత్రాలు సరిగ్గా ఉండాలి.
ఇవి కూడా చదవండి: Odisha – Andhra: ఆంధ్రాలోనే ఉంటాం.. తెగేసిన చెప్పిన కొటియా ప్రజలు.. విజయనగరంలో గిరిజనులకు సన్మానం