Auto Sweep Facility: మీ సేవింగ్స్ ఖతా నుంచే డబుల్ వడ్డీ వచ్చే టెక్నిక్.. పూర్తి వివరాలు ఇవి..
ఆటో స్వీప్ ఫెసిలిటీ తో అకౌంట్‌లో డబ్బులపై మీకు ఇంకా ఎక్కువ వడ్డీ వచ్చేందుకు అవకాశం ఉంది. అయితే ఆ దీన్ని సరిగ్గా అర్థం చేసుకొని వాడుకోవాలి. సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ రెండింటినీ కలిపితే అదే ఆటో స్వీప్ ఫెసిలిటీ అవుతుంది.
బ్యాంక్ సేవింగ్స్ ఖాతా అందరికీ తెలిసిందే.. అలాగే ఫిక్స్ డ్ డిపాజిట్(ఎఫ్ డీ) ఖాతా గురించి కూడా చాలా మందికి తెలుసు. సురక్షిత పొదుపు పథకాల్లో దీనికి అగ్రస్థానం ఉంటుంది. అయితే ఈ రెండింటిని కలిపి కూడా వినియోగించుకోవచ్చని చాలా మందికి తెలియదు. అదేంటి రెండింటిని ఒకే ఖాతాలో ఎలా చేయగలం అనికుంటున్నారా? చేయొచ్చండి.. దానిని ఆటో స్వీప్ ఫెసిలిటీ అంటారు. అదెలా పనిచేస్తుందో చూద్దాం..
ఏంటీ ఆటో స్వీప్..
సేవింగ్స్ ఖాతాలో ఉండే డబ్బుకు బ్యాంకులు 3 నుంచి 4 శాతం వరకు వడ్డీ మాత్రమే ఇస్తాయి. అయితే ఆటో స్వీప్ ఫెసిలిటీ తో అకౌంట్‌లో డబ్బులపై మీకు ఇంకా ఎక్కువ వడ్డీ వచ్చేందుకు అవకాశం ఉంది. అయితే ఆ దీన్ని సరిగ్గా అర్థం చేసుకొని వాడుకోవాలి. సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ రెండింటినీ కలిపితే అదే ఆటో స్వీప్ ఫెసిలిటీ అవుతుంది. ఆటో స్వీప్ అకౌంట్ ఫెసిలిటీతో మీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఫిక్స్‌డ్ డిపాజిట్‌తో లింక్ అవుతుంది.
ఎలా పనిచేస్తుంది?
బ్యాంక్ ఆటో స్వీప్ అకౌంట్ లో సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలోని డబ్బులు ఒక నిర్ణీత లిమిట్ దాటిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆ లిమిట్‌కు పైన ఉన్న డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌లోకి వెళ్లిపోతాయి. ఆ లిమిట్‌ను మీరే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌లో ఎంత మేరకు డబ్బులు ఉండాలనే అంశాన్ని ముందుగానే నిర్ణయించుకోవాలి. లిమిట్ సెట్ చేసుకోవాలి. మీ అకౌంట్‌లోని డబ్బులు ఈ లిమిట్‌ను దాటితే అప్పుడు ఆ డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లోకి వెళ్లిపోతాయి. ఆటో స్వీప్ అకౌంట్‌లో ఒక ప్రతికూలత కూడా ఉంది. సేవింగ్స్ ఖాతాలోని డబ్బులను ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్‌లోకి డబ్బులను సాధారణంగా తీసుకోవడం కుదరదు. నిర్ణీత గడువు లేదా మెచ్యూరిటీ వరకు ఆగాల్సిందే. అయితే ఆటో స్వీప్ ఫెసిలిటీలో ఫిక్స్‌డ్ డిపాజిట్‌లోని డబ్బులు కూడా అవసరం అయితే తీసుకోవచ్చు. అయితే ఇలా చేస్తే మీకు తక్కువ వడ్డీనే వస్తుంది. తరుచుగా డబ్బులు విత్‌డ్రా చేయాల్సి వస్తే మాత్రం ఆటో స్వీప్ ఫెసిలిటీకి దూరంగా ఉండటం మంచిది.
ఈ ఉదాహరణ చూడండి..
ఉదాహరణకు మీ అకౌంట్‌లో రూ.1 లక్ష ఉన్నాయనుకోండి, అందులో మీరు రూ.20,000 మాత్రమే వాడుకోవాలనుకుంటే మిగతా రూ.80,000 ఆటో స్వీప్ ఫెసిలిటీ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్‌లోకి మళ్లించొచ్చు. అప్పుడు మీ అకౌంట్ రూ.20,000 మాత్రమే ఉంటాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లోకి వెళ్లిన డబ్బుపై మీకు ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ఇలా మీరు రూ.25,000 నుంచి రూ.1 లక్ష వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లోకి మళ్లించొచ్చు.
రకాలివి..
ఆటో స్వీప్ రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి Last In First Out (Lifo). అంటే దీర్ఘకాలం ఎఫ్‌డీలో డబ్బులు జమ చేసేవారికి ఉపయోగపడే పద్ధతి ఇది. వారికి ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ఒకవేళ మీరు తరచూ డబ్బులు తీస్తూ ఉంటే First In First Out (Fifo) ఎంచుకోవాలి. అందుకే ఆటో స్వీప్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఈ ఫెసిలిటీ ఎంచుకోవడం మంచిది.
ఏయే బ్యాంకులు..
బ్యాంకులు ఒక్కో పేరుతో ఈ ఆటో స్వీప్ అకౌంట్ సౌకర్యాన్ని అందిస్తూ ఉంటాయి. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సేవింగ్స్ ప్లస్ అకౌంట్ పేరుతో ఈ తరహా సేవలు అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ సహా పలు బ్యాంకుల ఈ సర్వీసులు ఆఫర్ చేస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..