Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Royal Enfield Bikes: కేవలం రూ. 80 వేలకే రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 350 బైక్.. గోల్డెన్ ఛాన్స్ అస్సలు వదులుకోకండి..

రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనడం చాలా మందికి కల. ముఖ్యంగా బడ్జెట్ తక్కువగా ఉన్న వారికి కానీ మీరు కంపెనీకి చెందిన బైక్‌ను 80 వేలకే తీసుకోవచ్చు.

Royal Enfield Bikes: కేవలం రూ. 80 వేలకే రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 350 బైక్.. గోల్డెన్ ఛాన్స్ అస్సలు వదులుకోకండి..
Royal Enfield Thunderbird 350
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 26, 2023 | 1:58 PM

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఇప్పుడు చాలా ఖరీదైనదిగా మారింది. కంపెనీ చౌకైన బైక్ కూడా మీకు దాదాపు రూ. 1,80వేలకి అందుబాటులోకి రాబోతోంది. కంపెనీ బైక్ కొనడం చాలా మందికి కల లాంటిది. అయితే, బడ్జెట్ తక్కువగా ఉన్న వారికి ఇది అస్సలు కాకపోవచ్చు. కానీ మీరు కంపెనీకి చెందిన బైక్‌ను రూ. 80 వేలకే కొనేసేయవచ్చు. థండర్‌బర్డ్ కంపెనీ ఫేమస్ బైక్‌లలో ఒకటి. ఇది నేటి తరం యువను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ బైక్‌ను తొలిసారిగా 2002లో భారత్ మార్కెట్‌లో వచ్చింది. ఇది భారతీయ మార్కెట్లో 2020లో నిలిపివేయబడినప్పటికీ. ఈ బైక్ 350సీసీ ఇంజన్‌తో వస్తుంది. మీరు కేవలం రూ. 80వేలతో ఈ బైక్‌ని ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఇది ఖచ్చితంగా సాధ్యమే.

వాస్తవానికి మీరు ఈ ధరకు ఆన్‌లైన్ వెబ్‌సైట్ OLXలో ఈ బైక్‌ని పొందుతారు. 2014 మోడల్ Thunderbird 350 ఇక్కడ రూ. 80వేలకి విక్రయించబడుతోంది. విశేషమేమిటంటే ఈ బైక్ కేవలం 24వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఈ బైక్ యజమాని గుర్గావ్‌లో నివసిస్తున్నాడు. మేము 25 జనవరి 2023న వెబ్‌సైట్‌లో దాని ప్రకటనను చూశాం.

థండర్‌బర్డ్ 350 టియర్‌డ్రాప్ ఆకారపు ఇంధన ట్యాంక్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్యూయల్ గేజ్‌తో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను పొందుతుంది. ఇది కాకుండా, మోటార్‌సైకిల్‌లో LED టెయిల్ లైట్ ఇవ్వబడింది. ఇంజన్ గురించి చెప్పాలంటే, ఇది 350cc సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్ ఇంజన్‌ని పొందుతుంది. ఇది 5,250rpm వద్ద 19.8 bhp శక్తిని, 4,000rpm వద్ద 28Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. థండర్‌బర్డ్ 350 ఐదు విభిన్న రంగుల్లో వచ్చేది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం