Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Payments: త్వరలో ‘హలో! యూపీఐ’.. మీ సొంత భాషలోనే అందుబాటులోకి.. కమాండ్ ఇస్తే చాలు.. ఈజీగా లావాదేవీలు..

ప్రభుత్వం ఈ యూపీఐ లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు ఓ సంచలనాత్మక ఫీచర్ ను తీసుకొచ్చేందుకు ప్రణాళిక చేస్తోంది. ప్రస్తుతం అంతా వాయిస్ కమాండ్ ఆధారంగానే ఎక్కువ పనులు స్మార్ట్ ఫోన్లలో జరుగుతున్నాయి కదా.. దానిని మరో లెవెల్ కు తీసుకెళ్లేలా.. ఓ కొత్త ఫీచర్ ను పరిచయం చేయనుంది. అదేంటి అంటే మీ లావాదేవీని మీ సొంత భాషలోనే చెప్పి పూర్తి చేసేలా కొత్తగా సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేస్తోంది. అందుకోసం ఏఐ మద్దతు గల భాషా అనువాద ప్లాట్ ఫారం ‘భాషిణి’ని తీసుకొస్తోంది.

UPI Payments: త్వరలో ‘హలో! యూపీఐ’.. మీ సొంత భాషలోనే అందుబాటులోకి.. కమాండ్ ఇస్తే చాలు.. ఈజీగా లావాదేవీలు..
Upi Payment
Follow us
Madhu

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 15, 2023 | 6:17 PM

బ్యాంకింగ్ రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. డిజిటల్ బాటలో శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యూపీఐ) రాకతో వీధి వ్యాపారుల దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకూ అందిరికీ డిజిటల్ లావాదేవీలు చేరువయ్యాయి. విరివిగా ఖర్చు పెట్టడానికి, ప్రతి రూపాయి ప్రభుత్వానికి లెక్క తెలియడానికి ఇది ఉపకరిస్తుంది. కాగా ఇప్పుడు ప్రభుత్వం ఈ యూపీఐ లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు ఓ సంచలనాత్మక ఫీచర్ ను తీసుకొచ్చేందుకు ప్రణాళిక చేస్తోంది. ప్రస్తుతం అంతా వాయిస్ కమాండ్ ఆధారంగానే ఎక్కువ పనులు స్మార్ట్ ఫోన్లలో జరుగుతున్నాయి కదా.. దానిని మరో లెవెల్ కు తీసుకెళ్లేలా.. ఓ కొత్త ఫీచర్ ను పరిచయం చేయనుంది. అదేంటి అంటే మీ లావాదేవీని మీ సొంత భాషలోనే చెప్పి పూర్తి చేసేలా కొత్తగా సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేస్తోంది. అందుకోసం ఏఐ మద్దతు గల భాషా అనువాద ప్లాట్ ఫారం ‘భాషిణి’ని తీసుకొస్తోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఈ వాయిస్ ఆధారిత సేవలను పరిచయం చేయడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

కొత్త ఫీచర్ తో ఏం చేయొచ్చు..

కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు వాయిస్ కమాండ్‌ల ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్‌లను తనిఖీ చేయడం, బీ2బీ బదిలీలు, విద్యుత్ చెల్లింపులు, ఫాస్టాగ్ రీఛార్జ్‌లతో సహా పలు లావాదేవీలను సులభంగా నిర్వహించవచ్చు.

భాషిణి కి సీఈఓ అయిన అమితాబ్ నాగ్ ఈ ప్లాట్‌ఫారమ్ గురించి మాట్లాడుతూ తాము ఆర్థిక లావాదేవీల్లో డిజిటల్ మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నామన్నారు. అందుకు భాష అంతరం కాకూడదని భావించి ఈ ప్రత్యేమైన టూల్ ని ఆవిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఏ భాషలో అయిన డిజిటల్ లావాదేవీలు చేసేలా, అస్సలు చదువుకోని వారు కూడా వీటిని సులభంగా చేసుకొనేలా కొత్త భాషిణిని తీసుకొస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా పీఎం కిసాన్ యోజన, ఎన్‌పీసీఐ, రైతు బాట్ వంటి కార్యక్రమాల ప్రాముఖ్యత నేపథ్యంలో ఈ ఫీచర్ తీసుకొస్తున్నామన్నారు.

ఇవి కూడా చదవండి

హలో యూపీఐ..

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ ఈ ఫీచర్ గురించి ప్రకటను సెప్టెంబర్లో చేశారు. హలో! యూపీఐ పేరిట భాష ఆధారిత యూపీఐ లావాదేవీలను తీసుకొస్తున్నట్లు చెప్పారు.

భాషిణి అంటే ఏమిటి?

ఇది వాయిస్ ఆధారిత ఫీచర్. భారతీయ భాషలలో ఇంటర్నెట్, డిజిటల్ సేవలకు సులభమైన ప్రాప్యతను అందించడానికి మన దేశంలోనే రూపొందించిన ఏఐ- ఆధారిత భాషా అనువాద వేదిక. అంతేకాకుండా, భారతీయ ఎంఎస్ఎఈలు , స్టార్టప్‌లు, ఆవిష్కర్తల ఉపయోగం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) వనరులను బహిరంగంగా అందుబాటులో ఉంచడానికి భాషిణి కృషి చేస్తుంది .

న్యూఢిల్లీలో జరిగిన 18వ జీ20 సమ్మిట్ సందర్భంగా, డిజిటల్ ఇండియా ఎక్స్‌పీరియన్స్ జోన్ మన దేశ డిజిటల్ పరివర్తన విజయాన్ని ప్రదర్శించింది. భాషిణి ఎగ్జిబిట్‌లో, ప్లాట్‌ఫారమ్ కు సంబంధించిన అధునాతన సామర్థ్యాలను హైలైట్ చేస్తూ బహుళ భారతీయ భాషలు, ఆరు యూఎన్ భాషలలో నిజ-సమయ ప్రసంగం నుంచి ప్రసంగం అనువాదం చేసి చూపించింది.

ప్రధాని మోదీ ప్రశంసలు..

ఈ ఏఐ-ఆధారిత భాషా అనువాద ప్లాట్‌ఫారమ్‌ను ప్రధాని మోదీ స్వయంగా ప్రశంసించారు, డిజిటల్ చేరికను ప్రోత్సహించడానికి, భాషా అవరోధాలతో సంబంధం లేకుండా సాంకేతికత ప్రయోజనాలను ప్రతి భారతీయుడికి అందించడానికి ఇది దోహదపడుతందని కొనియాడారు. యూపీపఐ చెల్లింపుల్లో భాషిణి అనుసంధానంతో మరింత సమగ్రమైన డిజిటల్ భవిష్యత్తు సాధ్యమవుతుందని.. ప్రతి ఒక్కరికీ మరింత దగ్గరవుతుందని ప్రకటించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?