Apple iPhone 13: ఐఫోన్ 13‌ కొనాలని భావిస్తున్నారా? ఎగిరి గంతేసే భారీ డిస్కౌంట్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్..

దిగ్గజ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ మొబైల్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ఇందులో భాగంగా వివిధ బ్రాండ్ల ఫోన్లతో పాటు.. యాపిల్ ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఇస్తోంది.

Apple iPhone 13: ఐఫోన్ 13‌ కొనాలని భావిస్తున్నారా? ఎగిరి గంతేసే భారీ డిస్కౌంట్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్..
Apple Iphone 13

Updated on: Nov 15, 2022 | 1:56 PM

దిగ్గజ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ మొబైల్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ఇందులో భాగంగా వివిధ బ్రాండ్ల ఫోన్లతో పాటు.. యాపిల్ ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఇ-రిటైలర్ సైట్‌లోని బ్యానర్ ప్రకారం.. iPhone 13 రూ. 65,999కి అందుబాటులో ఉంది. అయితే, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కలిపి ఈ హ్యాండ్‌సెట్‌ను రూ. 40,000 లతో సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

బ్యాంక్ ఆఫర్స్..

యాపిల్ ఐఫోన్ 13 బేస్ మోడల్ 128GB. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 65,999 గా ఉంది. అయితే, ఆన్‌లైన్ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తోంది. దాదాపు 10 శాతం వరకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ఇస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, EMI లావాదేవీలపై రూ. 1,000 వరకు తగ్గింపు ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లకు 5% ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఎక్స్ఛేంజ్ ఆఫర్లు..

ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కింద యాపిల్ ఐఫోన్ 13పై రూ. 17,500 వరకు భారీ తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ మీ ఫోన్‌ను బట్టి ఉంటుంది. మీ వద్ద పాత ఐఫోన్ 11 ఉంటే.. రూ. 12,000 ఎక్స్ఛేంజ్ ధరను పొందవచ్చు. అలాగే, ఐఫోన్ 12 ను ఎక్స్ఛేంజ్ పెడితే.. రూ. 16,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. ఇవే కాదు.. మీ వద్ద ఉన్న ఏదైనా పాత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ కింద పెట్టొచ్చు.

ఇవి కూడా చదవండి

ఇలా బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్స్ అన్ని కలిపి ఐఫోన్ 13ని రూ. 50,000 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చన్నమాట. కాగా, యాపిల్ ఐఫోన్13 A15 బయోనిక్ చిప్‌సెట్‌తో పని చేస్తుంది. ఇది ఐఫోన్ 14 మాదిరిగానే ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటినీ XDR స్క్రీన్‌తో వస్తుంది. బ్యాటరీ లైఫ్ కూడా అద్భుతంగా ఉంది. ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్, బ్యాక్ కెమెరా 12 మెగా పిక్సెల్‌ డ్యూయల్ కెమరాతో వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..