Xiaomi SU7: భారత్‌లో ఎలక్ట్రిక్‌ కారును ప్రదర్శించిన షావోమీ.. వామ్మో ఏంటీ ఫీచర్స్‌ అసలు..

చైనాకు చెందిన ఈ టెక్‌ దిగ్గజం ఇప్పటికే ఆ దేశంలో తన తొలి ఎలక్ట్రిక్ సెడాన్‌ కారును ఆవిష్కరించింది. ఇంకా అధికారికంగా ఈ కారును లాంచ్‌ చేయకపోయినప్పటికీ కారులో ఉన్న ఫీచర్లను తెలుపుతూ ప్రదర్శనలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా షావోమీ భారత్‌లో 10 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఎలక్ట్రిక్‌ కారును ఆవిష్కరించింది....

Xiaomi SU7: భారత్‌లో ఎలక్ట్రిక్‌ కారును ప్రదర్శించిన షావోమీ.. వామ్మో ఏంటీ ఫీచర్స్‌ అసలు..
Xiaomi Su7

Updated on: Jul 13, 2024 | 5:27 PM

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. పర్యావారణ సంరక్షణ విషయంలో ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వడం, పెట్రోల్‌.. డీజిల్ ధరల నుంచి ఉపశమనం లభించడం వంటి చర్యల ద్వారా విద్యుత్ వాహనలకు గిరాకీ ఎక్కువుతోంది. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని దిగ్గజ ఆటో మొబైల్ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఎలక్ట్రాకిన్‌ దిగ్గజం షావోమీ సైతం ఓ ఎలక్ట్రిక్‌ కారును తీసుకొస్తున్న విషయం తెలిసిందే.

చైనాకు చెందిన ఈ టెక్‌ దిగ్గజం ఇప్పటికే ఆ దేశంలో తన తొలి ఎలక్ట్రిక్ సెడాన్‌ కారును ఆవిష్కరించింది. ఇంకా అధికారికంగా ఈ కారును లాంచ్‌ చేయకపోయినప్పటికీ కారులో ఉన్న ఫీచర్లను తెలుపుతూ ప్రదర్శనలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా షావోమీ భారత్‌లో 10 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఎలక్ట్రిక్‌ కారును ఆవిష్కరించింది. అధునాతన ఫీచర్లుతో కూడిన ఈ కారు యూజర్లను ఆకట్టుకుంటోంది. ఫీచర్లతో పాటు లుక్‌ కూడా ఔరా అనిపించేలా ఉంది. ఇంతకి ఈ కారులో ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

షావోమీ ఈ కారును పూర్తి స్థాయి హై పెర్ఫార్మెన్స్ ఎకో సిస్టమ్ సెడాన్‌గా డెవలప్‌ చేసింది. ఈ కారులో ఇ మోటార్, సీటీబీ ఇంటిగ్రేటెడ్ బ్యాటరీ, షియోమి డై కాస్టింగ్, షియోమి పైలట్ అటానమస్ డ్రైవింగ్, స్మార్ట్ క్యాబిన్ వంటివి ప్రత్యేకంగా డెవలప్‌ చేశారు. ఇందులో భాగంగా కంపెనీకి చెంది సుమారు 3400 మంది ఇంజనీర్లు, 1000 మంది టెక్నికల్ సిబ్బంది కృషి చేశారు. ఇక ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే ఈ కారు గరిష్టంగా 673 హెచ్‌పి పవర్, 838 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది.

ఈ కారు కేవలం 2.78 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. షావోమీ కారు గరిష్టంగా 265 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇక ఈ కారును ఒక్కసారి ఫుల్‌ చార్జ్‌ చేస్తే ఏకంగా 800 కిలోమీటర్లు దూసుకెళ్లొచ్చు. ఈ కారులో 56 ఇంచెస్ హెడ్ అప్ డిస్‌ప్లే, రొటేటింగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 16.1 ఇంచెస్ 3కే అల్ట్రా క్లియర్ కంట్రోల్ స్క్రీన్, మూవింగ్ డ్యాష్‌బోర్డ్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..