Gold Price Today: మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. అదే బాటలో వెండి
భారత బులియన్ మార్కెట్‌లో పెరుగుదల కొనసాగుతోంది. ఈ వారం కూడా దాదాపు ప్రతిరోజూ మార్కెట్‌లో పెరుగుదల ఉంది. కాగా, ఆదివారం కూడా బంగారం ధర పెరిగింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో దేశీయంగా 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.67,600 ఉండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.73,750కి చేరుకుంది. వెండి కిలో ధర రూ.95,500 వద్ద ట్రేడవుతోంది. అయితే భారతీయ సాంప్రదాయంలో..
భారత బులియన్ మార్కెట్‌లో పెరుగుదల కొనసాగుతోంది. ఈ వారం కూడా దాదాపు ప్రతిరోజూ మార్కెట్‌లో పెరుగుదల ఉంది. కాగా, ఆదివారం కూడా బంగారం ధర పెరిగింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో దేశీయంగా 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.67,600 ఉండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.73,750కి చేరుకుంది. వెండి కిలో ధర రూ.95,500 వద్ద ట్రేడవుతోంది. అయితే భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రతి రోజు బంగారం కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ఇక పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల సందర్భంగా బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి.
ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
- దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,989 వద్ద కొనసాగుతోంది.
- ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,958 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,190 వద్ద ఉంది.
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,024 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,263 ఉంది.
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,024 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,263 ఉంది.
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,958 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,699 ఉంది.
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,424 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,699 ఉంది.
- ఇక దేశంలో కిలో వెండి ధర రూ.95,500 వద్ద కొనసాగుతోంది.
24 క్యారెట్ల బంగారం
24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. స్వచ్ఛమైన బంగారం లేదా 24 క్యారెట్ బంగారం 99.9 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది. అలాగే దానిలో ఏ ఇతర లోహాన్ని కలపరు. 24 క్యారెట్ల బంగారాన్ని బంగారు నాణేలు, కడ్డీల తయారీకి ఉపయోగిస్తారు. బంగారం కోసం ఇతర విభిన్న స్వచ్ఛతలు ఉన్నాయి. వీటిని 24 క్యారెట్‌లతో పోల్చి కొలుస్తారు.
22 క్యారెట్ల బంగారం
ఆభరణాల తయారీకి 22 క్యారెట్ల బంగారం మంచిది. ఇది 22 భాగాలు బంగారం, రెండు భాగాలు వెండి, నికెల్ లేదా ఏదైనా ఇతర లోహం. ఇతర లోహాలను కలపడం ద్వారా బంగారం గట్టిపడుతుంది. అలాగే ఆభరణాలకు అనుకూలంగా ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం 91.67 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి