Satya Nadella: మైక్రోసాఫ్ట్‌ ఎర్రర్‌పై స్పందించిన సీఈవో సత్యనాదెళ్ల

శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ (Microsoft) సర్వర్లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా ఉంది. సర్వర్లలో లోపం కారణంగా ప్రపంచమే ఆగిపోయేలా చేసింది. బ్యాంకుల నుండి విమానయాన సంస్థల వరకు సేవలకు అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా ఇండిగో, అకాసా ఎయిర్‌లైన్స్, స్పైస్‌జెట్‌తో సహా అనేక విమానయాన సంస్థలు తమ విమానాలను గ్రౌండ్ చేయవలసి వచ్చింది...

Satya Nadella: మైక్రోసాఫ్ట్‌ ఎర్రర్‌పై స్పందించిన సీఈవో సత్యనాదెళ్ల
Ceo Satya Nadella
Follow us
Subhash Goud

|

Updated on: Jul 20, 2024 | 8:41 AM

శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ (Microsoft) సర్వర్లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా ఉంది. సర్వర్లలో లోపం కారణంగా ప్రపంచమే ఆగిపోయేలా చేసింది. బ్యాంకుల నుండి విమానయాన సంస్థల వరకు సేవలకు అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా ఇండిగో, అకాసా ఎయిర్‌లైన్స్, స్పైస్‌జెట్‌తో సహా అనేక విమానయాన సంస్థలు తమ విమానాలను గ్రౌండ్ చేయవలసి వచ్చింది. విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీంతో బ్యాంకులు, స్టాక్ ఎక్స్ఛేంజీల పనితీరుపైనా ప్రభావం పడింది. చాలా మంది విండోస్ వినియోగదారులు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) ఎర్రర్‌ను చూస్తున్నారు.

సర్వర్లలో అంతరాయం ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో సేవలు నిలిచిపోయాయి. దీంతో పలు కంపెనీల విమానాలు ఎగరలేకపోతున్నాయి. టికెట్ బుకింగ్ నుండి చెక్-ఇన్ వరకు సమస్యలు ఉన్నాయి. భారతదేశంలోని అనేక విమానాశ్రయాలు కూడా సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నాయి. అయితే సమస్య పరిష్కారం అయినా ఇంకా పూర్తి స్థాయిలో విండోస్‌ సిస్టమ్స్‌లో బ్లూ స్క్రీన్ ఎర్రర్‌ సమస్య తొలగలేదు. దేశవ్యాప్తంగా 200కిపైగా విమానాల రద్దు అయ్యాయి. ఇండిగో 192 విమానాలను రద్దు చేసింది. అలాగే అమెరికా, ఆస్ట్రేలియాలో ఇంకా ఇబ్బందులు తొలగలేదు. అమెరికా, డల్లాస్‌, చికాగోలో విమానాలు 18 గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌ వినియోగదారులు తీవ్ర కష్టాలను ఎదుర్కొన్నారు. ఔటేజ్‌ సమస్యతో 77 శతం విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

ఇదిలా ఉండగా, దీనిపై మైక్రోసాఫ్ట్‌ CEO సత్యనాదెళ్ల స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ సిస్టమ్స్‌పై ప్రభావం కనిపించిందని, ఈ సమస్య పరిష్కారం కోసం క్రౌడ్‌ స్ట్రైక్‌తో కలిసి పనిచేస్తున్నామని అన్నారు. ప్రపంచ చరిత్రలోనే ఇది అతిపెద్ద సంక్షోభమని వ్యాఖ్యానించారు. త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు. శని, ఆదివారాలు కావడంతో సర్వర్లపై తక్కువ ఒత్తిడి ఉందని, సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. వినియోగదారులకు క్లౌడ్‌ స్ట్రెక్‌ సీఈవో క్షమాపణలు చెప్పారు. ఔటేజ్‌ సమస్యేనని, సైబర్‌ అటాక్‌ కాదని ప్రకటించారు. ఇదిలా ఉంటే మైక్రోసాఫ్ట్‌ కంపెనీకి కొత్త చిక్కులు వస్తున్నాయి. జరిగిన నష్టాలపై పలు కంపెనీలు దావా వేయనున్నట్లు తెలుస్తోంది.