OLA electric: ఆ పోస్టుతో ఓలా స్టాక్ ధరలు ఢమాల్.. సోషల్ మీడియాలో పోస్టుల యుద్ధం

|

Oct 09, 2024 | 5:59 PM

దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఆదరణ పెరుగుతోంది. వాటిని వినియోగించడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. నేడు ద్విచక్ర వాహనం కనీస అవసరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజలు ముందుగా ఇ-స్కూటర్లను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వివిధ కంపెనీలు అనేక రకాల ఫీచర్లతో ఇ-స్కూటర్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. వాటిలో ఓలా కంపెనీ స్కూటర్లు కూడా కొనుగోళ్లలో దూసుకుపోతున్నాయి.

OLA electric: ఆ పోస్టుతో ఓలా స్టాక్ ధరలు ఢమాల్.. సోషల్ మీడియాలో పోస్టుల యుద్ధం
Bhavish Aggarwal And Kunal Kamra
Follow us on

దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఆదరణ పెరుగుతోంది. వాటిని వినియోగించడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. నేడు ద్విచక్ర వాహనం కనీస అవసరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజలు ముందుగా ఇ-స్కూటర్లను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వివిధ కంపెనీలు అనేక రకాల ఫీచర్లతో ఇ-స్కూటర్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. వాటిలో ఓలా కంపెనీ స్కూటర్లు కూడా కొనుగోళ్లలో దూసుకుపోతున్నాయి. అయితే ఈ స్కూటర్ల సర్వీసింగ్ కు సంబంధించి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. కొనుగోలుదారులు కూడా సోషల్ మీడియా లో ఓలా స్కూటర్ల సమస్యలపై పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. దీని కారణంగా ఓలా కంపెనీ షేర్ల ధరలు పడిపోయాయి. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్, హాస్య నటుడు కునాల్ కమ్రా మధ్య ఈ వివాదం జరిగింది.

వివాదస్పద ఫోటో

హాస్య నటుడు కునాల్ కమ్రాతో ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ తో జరిగిన వివాదం చర్చనీయాంశమైంది. కునాల్ కమ్రా ఇటీవల సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డీలర్ షిప్ వెలువల దుమ్మతో నిండి ఉన్న స్కూటర్ల ఫోటో ఇది. అవన్నీ సర్వీసింగ్ కోసం అక్కడకు వచ్చాయి. దీనిపై ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ స్పందించారు. వీరిద్దరి మధ్య పోస్టుల యుద్ధం నడిచింది. డబ్బులు తీసుకుని కమ్రా ఈ పోస్టు చేశారని భవీష్ ఆరోపించారు. తన షోరూమ్ కు వచ్చి సహాయం చేయాలని, దానికి డబ్బులు కూడా చెల్లిస్తామని వ్యాఖ్యానించారు. దీనిపై కమ్రా కూడా ఘాటుగా స్పందించారు. అనేక మంది చిన్న వ్యాపారులు, కార్మికులు ద్విచక్ర వాహనాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. రోజుల తరబడి సర్వీసింగ్ స్టేషన్లలో వాహనాలు ఉండిపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. దీనిపై భవీష్ స్పందిస్తూ తమ కస్టమర్లకు అందే సర్వీస్ విషయంలో జాప్యం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేవలం కుర్చీలో కూర్చుని విమర్శలు చేయడం సరికాదని, అసలు సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలని హితవు పలికారు.

స్టాక్ ధర పతనం

కునాల్ కమ్రా కు 2.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నాయి. ఓలా సర్వీసింగ్ సెంటర్లతో ఇప్పటికే కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కమ్రా చేసిన పోస్టుతో వారు ఆ కంపెనీపై మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓలాకు దేశంలోని ఇ-స్కూటర్ మార్కెట్ లో దాదాపు 27 శాతం వాటా ఉంది. అయినా ఆగస్టులో స్టాక్ మార్కెట్ ప్రారంభం నుంచి దాని ధరలో 43 శాతం క్షీణత నమోదైంది. సర్వీసు పరంగా కస్టమర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులే దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. దాదాపు ఐదు నెలలుగా ఓలా స్టాక్ ధర తగ్గుతూ పోతోంది. ఇటవల కునాల్ కమ్రా, భవీష్ అగర్వాల్ మధ్య జరిగిన పోస్టుల యుద్దంతో మరింత తగ్గిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..