AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office Time Deposit: ఆ పోస్టాఫీస్ పథకంతో పెట్టుబడిపై భరోసా.. బ్యాంకుల కంటే అధిక వడ్డీ మీ సొంతం

ప్రజలను పొదుపు మార్గం పట్టించేందుకు మొదట్లో ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలను ప్రారంభించింది. రిస్క్ లేకుండా నిర్ణీత ఆదాయం వస్తుందనే ధీమాతో చాలా మంది ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టారు. అయితే కొంత మంది ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలని ఆశపడుతూ ఉంటారు. వారికి అనుగుణంగా పోస్ట్ ఆఫీస్‌లో పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాట్ పథకం అందుబాటులో ఉంది. ముఖ్యంగా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు మాదిరే ఉంటుంది.

Post Office Time Deposit: ఆ పోస్టాఫీస్ పథకంతో పెట్టుబడిపై భరోసా.. బ్యాంకుల కంటే అధిక వడ్డీ మీ సొంతం
Post Office
Nikhil
|

Updated on: Jul 14, 2024 | 5:30 PM

Share

భారతదేశంలో చాలా మంది ప్రజలు మధ్య తరగతి, దిగువ మధ్య తరగతికి చెందిన వారే ఉంటారు. రోజువారీ అవసరాలకు తప్ప పొదుపు గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే వీరిని పొదుపు మార్గం పట్టించేందుకు మొదట్లో ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలను ప్రారంభించింది. రిస్క్ లేకుండా నిర్ణీత ఆదాయం వస్తుందనే ధీమాతో చాలా మంది ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టారు. అయితే కొంత మంది ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలని ఆశపడుతూ ఉంటారు. వారికి అనుగుణంగా పోస్ట్ ఆఫీస్‌లో పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాట్ పథకం అందుబాటులో ఉంది. ముఖ్యంగా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు మాదిరే ఉంటుంది. అయితే పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్‌లోని నిధులు ప్రభుత్వం పూర్తిగా బీమా చేస్తుంది. అందువల్ల రాబడులకు నిర్ణీత హామీ ఇస్తాయి. ఈ నేపథ్యంలో పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

2024 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లపై వడ్డీ రేటు ఐదు సంవత్సరాల కాలానికి 7.5 శాతంగా ఉంది. పీఓటీడీ పథకం కింద సీనియర్ సిటిజన్‌లకు అనేక బ్యాంకుల్లా కాకుండా సాధారణ పౌరుల కంటే ఎక్కువ రేట్లు అందించరు. వడ్డీ వార్షికంగా చెల్లిస్తారు. కానీ త్రైమాసికంలో లెక్కిస్తారు. సంబంధిత పోస్ట్ ఆఫీస్‌లో పాస్‌బుక్‌తో సూచించిన దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడం ద్వారా ఈ డిపాజిట్లను ముందస్తుగా మూసివేయవచ్చు. ఐదేళ్ల ఖాతాలో డిపాజిట్ నాలుగు సంవత్సరాల తర్వాత ముందస్తుగా ఉపసంహరించుకుంటే పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా రేటుపై 4 శాతం వడ్డీ చెల్లిస్తారు. గతంలో డిపాజిట్ తేదీ నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల కాల డిపాజిట్ ఖాతా మూసేస్తే మూడేళ్ల కాల డిపాజిట్ ఖాతాలకు వర్తించే రేటును ఉపయోగించి వడ్డీ లెక్కించేవారు.

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు 

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలోని నిధులకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీజీఐసీ) ద్వారా రూ. 5 లక్షల వరకు హామీ ఇస్తారు. కనీస పెట్టుబడి బ్యాంకులను బట్టి మారుతూ ఉంటుంది. బ్యాంకును బట్టి వడ్డీ రేటు కూడా మారుతుంది. హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వంటి బ్యాంకులు ఐదేళ్లలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఐదేళ్లలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎస్‌బీఐ 6.5 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. కెనరా బ్యాంక్ సాధారణ పౌరులకు ఐదు సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 6.70 శాతం అందిస్తుంది. అయితే ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో ఐదేళ్ల ఎఫ్‌డీల కంటే ఐదేళ్ల పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్లలో పెట్టుబడి పెడితే ఎక్కువ వడ్డీ వస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..