పెరిగిన టెక్నాలజీ కారణంగా బ్యాంకింగ్ రంగంలో కీలకమైన మార్పులు సంభవించాయి. ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత డిజిటల్ పేమెంట్లు ఎక్కువయ్యాయి. అయితే రోజువారీ నగదు అకౌంట్ క్రెడిట్ అయ్యే వారు ఆదాయపు పన్ను నిబంధనలు తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే బ్యాంకు అకౌంట్ నిర్వహణలో మనం చేసే కొన్ని తప్పులు పెద్ద మొత్తంలో ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుందని గమనించాలని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ అనే రెండు రంగాల్లో ఆదాయపు పన్ను నిబంధనల ద్వారా విధించిన వివిధ పరిమితులను అర్థం చేసుకోవడం చాలా కీలకం. ముఖ్యంగా బ్యాంక్ ఖాతా రకాన్ని బట్టి డిపాజిట్ విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. అలాగే పొదుపు ఖాతాలలో నగదు డిపాజిట్ పరిమితికి సంబంధించిన పరిమితులు కూడా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అధికారిక మార్గదర్శకాల ప్రకారం మీ సేవింగ్స్ ఖాతాలో ఉంచిన నగదు మొత్తం, నిర్దిష్ట పరిమితిని మించి ఉంటే ఆదాయపు పన్ను మినహాయింపులకు వర్తిస్తుంది.
పన్ను అధికారులు నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాల్సిన బాధ్యత లేకుండా ఉండాలంటే నగదును నిర్దిష్ట వ్యవధిలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా పరిమితులకు లోబడే చేయాలని గుర్తుంచుకోవాలి. మనీలాండరింగ్, పన్ను ఎగవేత, ఆర్థిక కార్యకలాపాల సంభావ్యతను అరికట్టడంతోపాటు నగదు లావాదేవీల ప్రవాహాన్ని నియంత్రించడమే పరిమితిని నిర్ణయించడం వెనుక కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సేవింగ్స్ ఖాతాలో రోజువారీ ఎంత నగదు డిపాజిట్ చేయవచ్చు? ఎంత మేర నగదుకు పన్ను విధిస్తారో? వంటి వివరాలను ఓ సారి తెలుసుకుందాం.
మీరు మీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో రోజుకు గరిష్టంగా రూ. 1 లక్ష వరకు జమ చేయవచ్చని గమనించడం ముఖ్యం. అయితే ఎప్పుడో ఒకసారి చేస్తే పరిమితి ఒక రోజులో రూ. 2.5 లక్షల వరకు దాటవచ్చు. వార్షిక పరిమితి విషయానికొస్తే పొదుపు ఖాతాలో గరిష్టంగా రూ. 10 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. 10 లక్షల లోపు నగదు ఉంటే ఐటీ శాఖకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ మార్గదర్శకాల ప్రకారం ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు డిపాజిట్లు రూ. 10 లక్షలు దాటితే దానిని తప్పనిసరిగా రిపోర్ట్ చేయడం తప్పనిసరి.
పొదుపు ఖాతా డబ్బుపై నేరుగా పన్ను విధించరు కానీ మీరు బ్యాంకు నుండి స్వీకరించే వడ్డీపై విధిస్తారని గుర్తుంచుకోవాలి. తమ ఖాతాదారులను బ్యాంకులో డిపాజిట్ చేసేలా ప్రోత్సహించేందుకు ఖాతాలో ఉంచిన డబ్బుకు బ్యాంకు కొంత వడ్డీని చెల్లిస్తుంది. మీరు బ్యాంక్ నుంచి స్వీకరించే వడ్డీ ఐటీఆర్ ఫారమ్‌లలో లాభం కింద వస్తుంది కాబట్టి పన్ను విధిస్తారు. అయితే దీనికి కూడా ఒక పరిమితి ఉంది. బ్యాంకు డిపాజిట్ల నుంచి పొందిన వడ్డీ రూ.10,000 కంటే ఎక్కువ ఉంటేనే పన్ను వసూలు చేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..