
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. మే నెల ప్రారంభం అవడంతోనే పన్ను చెల్లింపు దారుల్లో హడావుడి ఆరంభం అవుతుంది. ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తుంటారు. వాస్తవానికి జూలై 31 వరకూ ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి సమయం ఉంది. కానీ ట్యాక్స్ పేయర్స్ వీలైనంత త్వరగా ప్రక్రియ ప్రారంభించి ముగించడం మేలు. ఎందుకంటే పన్ను చెల్లింపు దారులు అన్ని రకాల లెక్కలు, క్లయిట్ సెటిల్మెంట్స్, అకౌంటింగ్ పే స్లిప్స్, డిడక్షన్స్ వంటివి సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఈ హడావుడిలో పడి పన్ను చెల్లింపు దారులు ప్రాథమిక విషయాన్ని మర్చిపోతుంటారు. అదే ఇన్ కమ్ ట్యాక్స్ ఫైలింగ్ లో మొదటి స్టెప్.. ప్రీ వ్యాలిడేటింగ్ బ్యాంక్ అకౌంట్. అంటే మీ బ్యాంకు ఖాతాను ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ తో ధ్రువీకరించుకోవడం. చాలా మంది దీనిని మరచిపోయి తమ హార్డ్ నగదును కోల్పోతారు.
ఐటీఆర్ ఫైలింగ్ చేసే ముందే పన్ను చెల్లింపుదారులు తమ బ్యాంకు ఖాతాలను ప్రీ వ్యాలిడేట్ చేయించుకోవాలి. ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నుంచి ట్యాక్స్ రిఫండ్ కాక ముందే దీనిని పూర్తి చేయాలి. ఇది చాలా ప్రాధాన్యమైనది. అది ఎలా చేయాలి? అందుకు ఏమి కావాలి? చూద్దాం రండి..
ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత వ్యాలిడేషన్ స్టేటస్ మీ రిజిస్టర్డ్ ఈ మెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్ కు వస్తుంది. ఈ స్టేటస్ 10 నుంచి 12 రోజుల్లో పూర్తి స్థాయిలో అప్ డేట్ అవుతుంది. పన్ను చెల్లింపు దారులు ఈ ప్రీ వ్యాలిడేషన్ స్టేటస్ ను ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ సైట్ లోకి లాగిన్ అయ్యి మై బ్యాంక్ అకౌంట్ సెక్షన్ లోకి వళ్లి కూడా చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..