Seema Patil: ఆమె జీతం రూ.100 కోట్లు.. ట్రెండింగ్ కంపెనీలకు రోల్‌మోడల్.. జీరోధా కంపెనీ డైరెక్టర్

|

Jun 10, 2021 | 2:00 PM

Seema Patil Salary: ఒకప్పుడు ఐదంకెల జీతం.. అనగానే చాలా మంది నోరెళ్లబెట్టుకునే వారు. గొప్పగా చెప్పుకొనేవారు. అదంతా పాత ట్రెండ్.. ఇప్పుడు కోట్లలో జీతాలు.. అదేనండి పదెంకల జీతం..

Seema Patil: ఆమె జీతం రూ.100 కోట్లు.. ట్రెండింగ్ కంపెనీలకు రోల్‌మోడల్.. జీరోధా కంపెనీ డైరెక్టర్
Nithin Kamath And Wife Seema Patil
Follow us on

Seema Patil Salary: ఒకప్పుడు ఐదంకెల జీతం.. అనగానే చాలా మంది నోరెళ్లబెట్టుకునే వారు. గొప్పగా చెప్పుకొనేవారు. అదంతా పాత ట్రెండ్.. ఇప్పుడు కోట్లలో జీతాలు.. అదేనండి పదెంకల జీతం.. అందుకోవడం ఇప్పుడు నయా ట్రెండ్‌. కొమ్ములు తిరిగిన కంపెనీలతో పోటీ పడుతూ స్టార్టప్‌ల చరిత్రలోనే తొలిసారిగా వందకోట్ల (రూ.100 కోట్లు) జీతాన్ని అందుకుంటున్న మహిళగా వార్తల్లోకెక్కారు జీరోధా డైరెక్టర్‌ సీమా పాటిల్‌. ఇప్పుడు దేశంలో ఎక్కువ సాలరీ అందుకుంటున్న మహిళల్లో ఆమె కూడా ఒకరుగా మారారు. దేశంలోనే అతిపెద్ద రిటైల్ బ్రోకరేజ్ సంస్థ జీరోధాకి సీమా పాటిల్ ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్నారు.

జీరోధా సంస్థను సీమా పాటిల్ భర్త నితిన్ కామత్, ఆయన సోదరుడు నిఖిల్ కామత్ కలిసి 2010లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ స్టార్టప్ ట్రెండింగ్ కంపెనీకి అరకోటి వినియోగదారులున్నారు. ఈ బ్రోకరేజ్ కంపెనీ మునుపెన్నడూ లేనంతగా యువతని ట్రేడిండ్ వైపు ఆకర్షించింది. కంపెనీ అభివృద్ధిలో సీమా తొలి నుంచి కీలక పాత్ర పోషిస్తూ డైరెక్టర్‌గా ఇంత జీతాన్ని అందుకుంటున్నారు. అయితే.. వార్షిక వేతనంలో భాగంగా వీరు ముగ్గురు నెలకు రూ.4.17 కోట్లు బేసిక్‌ శాలరీగా పొందుతున్నారు. ఇతర అలవెన్సులు, ప్రోత్సాహకాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు అన్నీ కలుపుకొని ముగ్గురు రూ.300 కోట్ల వరకు పారితోషికం అందుకోనున్నారు.

జీరోధా వల్ల అందరూ ట్రేడింగ్‌లో సులభంగానే అడుగుపెడుతున్నారని సీమాపాటిల్ చెబుతున్నారు. ట్రేడింగ్‌ ఛార్జీల్లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లని అందివ్వడంతోపాటు.. సాంకేతిక సాయంతో సులభంగా, తేలిగ్గా వాడుకోగలగడం జీరోధా యాప్‌ ప్రత్యేకత. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌లో ఆరేళ్లు పని చేసిన అనుభవం జీరోధాని ముందుకు నడిపించడంలో సీమా పాటిల్‌కు ఉపయోగపడింది.

దిగ్గజ ఐటీ కంపెనీల సీఈఓల వార్షిక వేతనంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. జీరోధా కంపెనీ 2019-2020 ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్ల ఆదాయంతో పాటు రూ.442 కోట్ల లాభాల్ని ఆర్జించింది. అయితే.. సన్‌టీవీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్న కావేరీ కళానిధి దేశంలో అత్యధికంగా రూ.88కోట్ల జీతాన్ని తీసుకునేవారు. ఇప్పుడామెని అధిగమించి సీమా ఏడాదికి 100 కోట్ల రూపాయల జీతాన్ని అందుకుంటూ వార్తల్లో నిలిచారు.

Also Read;

Credit Score Check: మీ క్రెడిట్ స్కోర్ తక్కువుందా.? అయినా లోన్ పొందవచ్చు.. ఎలాగో తెలుసుకోండి.!

PM Awas Yojana: గుడ్‏న్యూస్ చెప్పిన కేంద్రం.. 3.61 లక్షల మందికి ఇళ్ళ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. ఆ జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేయండిలా..