ఓ మై గాడ్.! కారు కొన్నంత ఈజీగా విమానాన్ని కొనేయొచ్చు.. ఎలాగో తెల్సా

|

Oct 15, 2024 | 7:00 PM

విమానంలో ప్రయాణించడం సామాన్యుడి కల. అయితే ఇప్పుడు అందులో ప్రయాణించడమే కాదు.. దీన్ని కొనడం అనే కల కూడా నిజమవుతుంది. సెకండ్ హ్యాండ్ విమానాలను కొనగలిగేంత డబ్బు మీ దగ్గర ఉంటే.. ఆ కల నిజమైనట్టే.. ఎలాగని అంటారా.? ఈ స్టోరీ చదివేయండి.

ఓ మై గాడ్.! కారు కొన్నంత ఈజీగా విమానాన్ని కొనేయొచ్చు.. ఎలాగో తెల్సా
Aeroplane
Follow us on

విమాన ప్రయాణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.! ప్రతి ఒక్కరూ విమానంలో ప్రయాణించాలని కోరుకుంటారు. విమానంలో ప్రయాణించాలని అనుకోవడం ప్రతీ ఒక్కరి కల. అయితే ఆ విమానాన్ని కొనడం పేద, మధ్యతరగతి వాళ్లకు కలగానే ఉంటుంది. అయితే మీకో విషయం తెల్సా.? బైకులు, కార్ల మాదిరిగా విమానాలు సెకండ్ హ్యాండ్‌లో దొరుకుతాయి. కొనగలిగేంత డబ్బు మీ దగ్గర ఉంటే.. విమానం మీ సొంతమే.. ఇవి ఎక్కడో కాదు.. మన ఇండియాలోనే అమ్ముతారు. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

బ్రోకరేజ్, ఆన్‌లైన్ మార్కెట్స్, వేలం పాట ద్వారా మీరు అనేక విమానాలను సెకండ్ హ్యాండ్‌లో కొనుగోలు చేయవచ్చు. ఉపయోగించిన విమానాన్ని కొనుగోలు చేసేటప్పుడు, మెయింటెనెన్స్ హిస్టరీ, ఎయిర్‌ వర్తినెస్, ఏవైనా మార్పులు చేశారా.? అనే అంశాలను మాత్రం కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. దేశంలో ఉపయోగించిన విమానాల ధర అనేక అంశాల బట్టి మారవచ్చు. ఓ ప్రైవేట్ జెట్ సెకండ్ హ్యాండ్ ధర రూ. 25 లక్షల నుంచి రూ. 4 కోట్ల వరకు ఉంటుంది. ఆయా విమానయాన సంస్థల వెబ్ సైట్ ద్వారా తక్కువ ధరలకు సెస్నా లేదా పైపర్ విమానాలను సులభంగా కొనుగోలు చేయవచ్చు. ప్రాంతీయ జెట్‌లు తక్కువ దూరం ప్రయాణం చేసేందుకు రూపొందించబడ్డాయి. ఇందులో 100 కంటే తక్కువ మంది కూర్చోవచ్చు. 8 కోట్ల నుంచి 40 కోట్ల రూపాయలకు సెకండ్ హ్యాండ్‌లో రీజినల్ ఫ్లైట్స్‌ను కొనుగోలు చేయవచ్చు. బొంబార్డియర్ క్యూ400 నుంచి ఎంబ్రేయర్ ఈ175 లాంటి విమానాలు ఈ జాబితాలోకి వస్తాయి.

నారో-బాడీ జెట్‌లు అంటే 100 నుంచి 200 మంది కూర్చునే చిన్న, వాణిజ్య విమానాల ధర రూ.40 కోట్ల నుంచి రూ.240 కోట్ల వరకు ఉంటుంది. వైడ్-బాడీ ఎయిర్‌క్రాఫ్ట్ ఇవి పెద్ద విమానాలు. ఈ విమానాలు సుదూర ప్రయాణం కోసం రూపొందించబడినవి. ఒక దేశం నుంచి మరొక దేశానికి ఒకేసారి అనేక మంది ప్రయాణీకులను, సరుకులను తీసుకెళ్లగలవు. ఇందులో బోయింగ్ 777, ఎయిర్‌బస్ A330 వంటి విమానాలు ఉన్నాయి. మీరు దేశంలోని అనేక రిసోర్సెస్ నుంచి సెకండ్ హ్యాండ్ విమానాలను కొనుగోలు చేయవచ్చు. ఏవియేషన్ బ్రోకర్లు, ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లు, ఏవియేషన్ వేలం, ఎయిర్‌క్రాఫ్ట్ తయారీదారులు, విమానాశ్రయాలు, FBOలు(ఫిక్స్‌డ్ బేస్ ఆపరేటర్లు) నుంచి ఈ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఒంటరిగా చూడటమే బెటర్.! ఓటీటీలో రచ్చ రచ్చ.. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..