EPFO Interest Credit: మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఆన్‌లైన్ క్విజ్‌లో ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు

ఇటీవల ఈపీఓఫ్ఓ 'ఎక్స్' ప్లాట్‌ఫారమ్‌లో దాని సోషల్ మీడియా ఫాలోవర్ల కోసం ఒక క్విజ్‌ని నిర్వహించింది. ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందించడం ద్వారా యూజర్లను పాల్గొనేలా ప్రేరేపించింది. ఈ నేపథ్యంలో కొంతమంది సబ్‌స్క్రైబర్‌లు ప్రశ్నలకు సమాధానమివ్వడానికి బదులు ఎఫ్‌వై 2023-24కి వడ్డీ ఎప్పుడు క్రెడిట్ చేస్తుందని ఈపీఎఫ్ఓను ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు.

EPFO Interest Credit: మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఆన్‌లైన్ క్విజ్‌లో ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
Epfo

Updated on: Apr 26, 2024 | 3:30 PM

భారతదేశంలో ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓ వయస్సు వచ్చాక ఉద్యోగస్తులు కచ్చితంగా పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. అయితే పదవీ విరమణ తర్వాత ఉద్యోగుల జీవనానికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో కంపెనీతో పాటు ఉద్యోగి కంట్రిబ్యూషన్ ద్వారా పింఛన్ ఇచ్చే విధానాన్ని శ్రీకారం చుట్టారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మన పింఛన్ విధానాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఇటీవల ఈపీఓఫ్ఓ ‘ఎక్స్’ ప్లాట్‌ఫారమ్‌లో దాని సోషల్ మీడియా ఫాలోవర్ల కోసం ఒక క్విజ్‌ని నిర్వహించింది. ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందించడం ద్వారా యూజర్లను పాల్గొనేలా ప్రేరేపించింది. ఈ నేపథ్యంలో కొంతమంది సబ్‌స్క్రైబర్‌లు ప్రశ్నలకు సమాధానమివ్వడానికి బదులు ఎఫ్‌వై 2023-24కి వడ్డీ ఎప్పుడు క్రెడిట్ చేస్తుందని ఈపీఎఫ్ఓను ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు. ఈ ప్రక్రియ పైప్‌లైన్‌లో ఉందని త్వరలో చూపించవచ్చని ఏజెన్సీ ప్రతిస్పందించింది. 

ఈపీఎఫ్ఓ వడ్డీని ఎప్పుడు జమ చేసినా వడ్డీని కోల్పోకుండానే అది కూడబెట్టి పూర్తిగా చెల్లిస్తామని స్పష్టం చేశారు. అలాగే కొంతమంది యూజర్లు పాస్‌బుక్ పోర్టల్ సరిగ్గా పని చేయడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో తనిఖీ సేవలను మెరుగుపరుస్తామని ఈపీఎఫ్ఓ తెలిపింది. అలాగే ఈపీఎఫ్ఓ అనేక సందేహాలను నివృత్తి చేసింది. ఈపీఎఫ్ఓ వడ్డీ తనిఖీ చేయడానికి, ఉమాంగ్ యాప్‌ని ఉపయోగించడం, ఈపీఎఫ్ మెంబర్ ఈ-సేవా పోర్టల్‌ని సందర్శించడం, 7738299899కి ఎస్ఎంఎస్ పంపడం, 9966044425కు మిస్డ్ కాల్ ఇవ్వడం వడ్డీ జమ స్థితితో పాటు బ్యాలెన్స్‌ను తనిఖీ చేయవచ్చు. 

ఇవి కూడా చదవండి
  • ఉమంగ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • మీ మొబైల్ ఫోన్‌లో పాస్‌బుక్‌ని యాక్సెస్ చేయడానికి మీ వివరాలను నమోదు చేసుకోవాలి.
  • ఈపీఎఫ్ వెబ్‌సైట్‌కు వెళ్లి,’ఉద్యోగుల కోసం’ విభాగానికి సెలెక్ట్ చేసుకోవాలి.
  • అనంతరం సేవలు విభాగానికి వెళ్లి, ‘సభ్యుని పాస్‌బుక్’ క్లిక్ చేయాలి.
  • సిస్టమ్ ఇప్పుడు సైన్ ఇన్ చేయడానికి మిమ్మల్ని యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నంబర్), పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేయాలి. ఏకీకృత సభ్యుల పోర్టల్‌లో నమోదు చేసుకున్న 6 గంటల తర్వాత పాస్‌బుక్ అందుబాటులో ఉంటుంది.
  • అలాగే ఎస్ఎంఎస్ ద్వారా సేవను పొందేందుకు “EPFOHO UAN” అని టైప్ చేసి 7738299899 ఎస్ఎంఎస్ పంపితే మన పీఎఫ్ బ్యాలెన్స్ మెసేజ్ ద్వారా అందుతుంది. 
  • అలాగే 9966044425 నెంబర్‌కు మిస్‌డ్ కాల్ ద్వారా కూడా ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్‌ను తనిఖీ చేయవచ్చు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..