Shubhanshu Shukla: రోదసీ యాత్రలో శుభాంశు శుక్లా ఎంత సంపాదిస్తారు? ఆసక్తికర విషయాలు

Shubhanshu Shukla: అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్‌’ ఈ మిషన్‌ను చేపట్టింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ .. ఇస్రో , అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), యూరప్‌ అంతరిక్ష సంస్థలు ఇందులో కీలకపాత్ర పోషించాయి. శుభాంశు శుక్లాతో..

Shubhanshu Shukla: రోదసీ యాత్రలో శుభాంశు శుక్లా ఎంత సంపాదిస్తారు? ఆసక్తికర విషయాలు

Updated on: Jun 25, 2025 | 1:39 PM

శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలోకి దూసుకెళ్లిన రెండో భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమయ్యింది. రోదసీలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. శుభాంశు శుక్లా లిసి మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని యాక్సియం-4 ) నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌సెంటర్‌లో చేపట్టిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. కొద్ది క్షణాల తర్వాత రాకెట్‌ నుంచి క్యాప్సుల్‌ విడిపోయి ఐఎస్‌ఎస్‌ దిశగా ప్రయాణం చేసింది. ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ పలు దఫాలుగా వాయిదా వచ్చింది. ఇవాళ మాత్రం అన్ని అడ్డంకులను అధిగమించి ప్రయోగం విజయవంతమయ్యింది. శుభాంశు శుక్లా స్పేస్‌లో అడుగుపెట్టగానే జైహింద్‌ .. జై భారత్‌ అన్న సందేశాన్ని పంపించారు. ఈ యాత్రలో ఆయన తన వెంట జాతీయ జెండాను తీసుకెళ్లారు.

అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్‌’ ఈ మిషన్‌ను చేపట్టింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ .. ఇస్రో , అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), యూరప్‌ అంతరిక్ష సంస్థలు ఇందులో కీలకపాత్ర పోషించాయి. శుభాంశు శుక్లాతో పాటు మిషన్‌ కమాండర్‌ పెగ్గీ విట్సన్‌ (అమెరికా), స్పెషలిస్టులు టిబర్‌ కపు (హంగరీ), స్లావోస్జ్‌ ఉజ్నాన్స్‌కీ- విస్నియెస్కీ (పోలండ్‌) రోదసిలోకి వెళ్లారు. ఈ ప్రయోగంలో శుభాంశు మిషన్‌ పైలట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతరిక్షంలో ఆయన్ను ‘శుక్స్‌’గా పిలుస్తారు.

28 గంటల ప్రయాణం తర్వాత..

28 గంటల ప్రయాణం తర్వాత భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) చేరుకుంటారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) వీరి వ్యోమనౌక ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం అవుతుంది. ఐఎస్‌ఎస్‌లో శుభాంశు బృందం 14 రోజుల పాటు ఉంటుంది. పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో అక్కడినుంచి ముచ్చటిస్తారు.

శుభాంశు శుక్లాకు జీతం ఉంటుందా?

అయితే శుభాంశు శుక్లాకు ఎటువంటి జీతం జతచేయనప్పటికీ, శుక్లా ప్రయాణం భారతదేశ అంతరిక్ష భవిష్యత్తులో అధిక విలువైన పెట్టుబడి. ఇది దేశానికి అధునాతన అంతరిక్ష విమాన శిక్షణ, అంతర్జాతీయ సహకారం, అంతరిక్ష పరిశోధనలకు తన విలువైన సేవలు అందించనున్నారు. ఈ మిషన్‌తో 1984లో అంతరిక్షంలోకి ప్రయాణించిన రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ భారతీయుడు శుక్లా.

అంతరిక్షంలో ఎన్నో ప్రయోగాలు:

భారత్‌ గగన్‌యాన్‌కు శుభాంశు అంతరిక్ష యాత్ర ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఐఎస్‌ఎస్‌లో శుభాంశు.. ఇస్రో తరఫున ఏడు ప్రయోగాలు నిర్వహిస్తారు. దీర్ఘకాల రోదసి యాత్రల సమయంలో పోషకాహారం, జీవనాధార వ్యవస్థల విషయంలో ముందడుగు వేయడానికి ఉద్దేశించిన ప్రయోగం కూడా ఇందులో ఉంది. రోదసీలో ఎముకలు, కండరాలు, గుండె, రక్తనాళాలు, రోగనిరోధక వ్యవస్థపై ప్రభావాన్ని శోధిస్తారు. నాసా నిర్వహించే ఐదు ఉమ్మడి అధ్యయనాల్లో శుభాంశు పాల్గొంటారు. మొత్తం మీద యాక్సియం-4 వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహిస్తారు. తద్వారా ఐఎస్‌ఎస్‌లో ఒకే మిషన్‌లో అత్యధిక సంఖ్యలో ప్రయోగాలు చేపట్టినట్లవుతుంది.

ఆక్సియం-4 మిషన్ కోసం భారతదేశం రూ.548 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ మొత్తం శుక్లా అంతరిక్షంలో నిర్వహిస్తున్న శిక్షణ, లాంచ్ లాజిస్టిక్స్, ప్రయాణం, పరిశోధనలను కవర్ చేస్తుంది. ఈ మిషన్‌లో ఆయన ఉనికిని 2027లో జరగనున్న భారతదేశం యొక్క మానవ అంతరిక్ష ప్రయాణ కార్యక్రమం గగన్‌యాన్ వైపు ఒక మెట్టుగా భావిస్తారు. అయితే భారతదేశంలో వ్యోమగాముల జీతాలు సైనిక గ్రేడ్‌లకు అనుగుణంగా ఉంటాయి. గ్రూప్‌ కెప్టెన్‌గా,శుభాంశు శుక్లా ఇస్రో జూనియర్‌ ఉద్యోగుల కంటే ఎక్కువగా సంపాదిస్తారు. కానీ ఇప్పటి వరకు తన తోటి వారికంటే తక్కువే ఉందని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Jio Plans: మొబైల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. జియోలో అత్యంత చౌకైన ప్లాన్స్‌ గురించి తెలుసా..?

NASA తన పౌర వ్యోమగాములకు US ప్రభుత్వ జనరల్ సర్వీస్ (GS) జీత స్కేల్ ప్రకారం చెల్లిస్తుంది. ఈ స్కేల్ GS-12 నుండి GS-14 వరకు ఉంటుంది. స్పేస్‌క్రూ 2022 నివేదిక నుండి వచ్చిన డేటా ప్రకారం..

  • GS-13 గ్రేడ్ : సంవత్సరానికి $81,216 నుండి $105,579. అంటే నెలకు దాదాపు $8,798 (సుమారు రూ. 7.5 లక్షలు) గంటకు $50.59.
  • GS-14 గ్రేడ్: సంవత్సరానికి $95,973 నుండి $124,764. అంటే, నెలకు $10,397 (సుమారు రూ. 8.8 లక్షలు) మరియు గంటకు $59.78.
  • GS-15 గ్రేడ్: చాలా అనుభవజ్ఞులైన వ్యోమగాములకు సంవత్సరానికి $146,757 (సుమారు రూ. 1.25 కోట్లు) వరకు సంపాదించవచ్చు.
  • NASA వెబ్‌సైట్ ప్రకారం ఒక వ్యోమగామి సగటు వార్షిక జీతం $1,52,258 (సుమారు రూ. 1.3 కోట్లు). కానీ శుభాన్షు శుక్లా లాగా ఆ వ్యోమగామి మిలిటరీకి చెందినవారైతే, అతనికి పన్ను రహిత ఆదాయం, గృహ భత్యం, పెన్షన్ వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అంతరిక్షంలో మిషన్ సమయంలో ప్రత్యేక బోనస్ లేదు.

ఇది కూడా చదవండి: Dangerous Malware: వామ్మో.. మొబైల్‌లో కొత్త మల్వేర్‌.. క్షణాల్లోనే బ్యాంకు అకౌంట్‌ ఖాళీ.. దీని గురించి తెలిస్తే నిద్ర కూడా పట్టదు!

984లో సోవియట్‌ యూనియన్‌కు చెందిన ఇంటర్‌కాస్మోస్‌ కార్యక్రమం కింద సోయుజ్‌ టి-11 వ్యోమనౌకలో రాకేశ్‌శర్మ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. ఆ తర్వాత శుభాంశు శుక్లా మళ్లీ రోదసీ లోకి దూసుకెళ్లారు.

ఇది కూడా చదవండి: చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్లా.. నింగిలోకి దూసుకెళ్లిన ఆక్సియం-4 మిషన్

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి