Car Features: కారు లోపల డోర్ పైన హ్యాండిల్స్ ఎందుకుంటాయి? స్టీరింగ్ ఒక వైపునకే ఎందుకుంటుంది? కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

|

Jun 07, 2024 | 3:55 PM

అన్ని కార్లలోనూ తప్పనిసరిగా ఒకటి మాత్రం మీరు గమనిస్తారు. ఒక ఫీచర్ అని అనొచ్చు. అదేంటంటే.. కారు లోపల.. డోర్‌కి పైన ఒక హ్యాండిల్ ఉంటుంది. దీనిని మీరూ చూసే ఉంటారు. ఇది కారు మోడల్ తో సంబంధం లేకుండా.. వాటి ధరలతో సంబంధం లేకుండా అన్నింట్లోనూ అందుబాటులో ఉంటుంది. ఇది అసలు ఎందుకుంటుంది? దాని వల్ల ప్రయోజనం ఏమిటి? తెలుసుకుందాం రండి..

Car Features: కారు లోపల డోర్ పైన హ్యాండిల్స్ ఎందుకుంటాయి? స్టీరింగ్ ఒక వైపునకే ఎందుకుంటుంది? కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Handle On Car Ceiling
Follow us on

ఇటీవల కాలంలో కాస్త ఆర్థికంగా స్థిరపడిన ప్రతి ఒక్కరూ సొంత కారును కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ కారు అనేది అత్యంత సౌకర్యవంతమైన రవాణా సాధనంగా గుర్తుంపుతెచ్చుకుంది. మార్కెట్లో రకరకాల కార్లు, అనేక ఫీచర్లతో కూడినా కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రజలు వారి బడ్జెట్ కు అనుగుణంగా కార్లను కొనుగోలు చేస్తుంటారు. ధర ఎక్కువ పెడితే అత్యాధునిక ఫీచర్లు వస్తాయి. అయితే ధర తక్కువ అయితే కాస్త ఫీచర్లు, సౌకర్యాలు తగ్గుతాయి. అయితే అన్ని కార్లలోనూ తప్పనిసరిగా ఒకటి మాత్రం మీరు గమనిస్తారు. ఒక ఫీచర్ అని అనొచ్చు. అదేంటంటే.. కారు లోపల.. డోర్‌కి పైన ఒక హ్యాండిల్ ఉంటుంది. దీనిని మీరూ చూసే ఉంటారు. ఇది కారు మోడల్ తో సంబంధం లేకుండా.. వాటి ధరలతో సంబంధం లేకుండా అన్నింట్లోనూ అందుబాటులో ఉంటుంది. ఇది అసలు ఎందుకుంటుంది? దాని వల్ల ప్రయోజనం ఏమిటి? తెలుసుకుందాం రండి..

డోర్ పైన్ హ్యాండిల్స్ ఎందుకు..

మీరు కారులో హాయిగా కూర్చున్నప్పుడు.. ఒక పక్కన డోర్ కి పైన కనిపించే హ్యాండిల్స్ చూసే ఉంటారు. మీరు ఎప్పుడైనా అసలు అవి అక్కడే ఎందుకు పెట్టారా అని ఆలోచించారా? వాస్తవానికి మనలో చాలా మంది కారు వేగంగా నడుస్తున్నప్పుడు లేదా డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ నొక్కినప్పుడు పట్టుకోవడానికి దీనిని ఉపయోగిస్తారు. అందుకోసమే దీనిని ఉంచారని భావిస్తారు. అయితే ఈ హ్యాండిల్స్ నిజమైన పనితీరు ఇప్పటికీ చాలా మందికి తెలియదు.

హ్యాండిల్స్ ఎందుకంటే..

నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. ఈ హ్యాండిల్స్ ఎందుకు కారులో ఉంచుతారంటే.. ఎలాంటా సహాయం లేకుండా కారులో నుంచి బయటకు రాలేని వ్యక్తుల కోసం ఇన్‌స్టాల్ చేస్తారు. డోర్‌ల పైన ఉంచిన ఈ హ్యాండిల్స్ సహాయంతో, ప్రజలు సులభంగా కారులో ప్రవేశించవచ్చు. అలాగే దానిని పట్టుకుని బయటకు రావచ్చు. ఈ హ్యాండిల్స్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి ప్రధాన కారణం వికలాంగులు, వృద్ధులు, గర్భిణులకు సహాయం చేయడమే. అలాగే ఎవరైనా వీల్ చైర్ లో వస్తే సులువుగా పట్టుకుని లోపలికి వెళ్లొచ్చు.

స్టీరింగ్ అక్కడే ఎందుకు ఉంది?

ఇవి కాకుండా, కార్లు ప్రయాణీకుల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేసే ఇతర సౌకర్యాలను కలిగి ఉంటాయి. వాస్తవానికి కారులో ఉంచిన ప్రతిదానికీ ఒక నిర్దిష్ట కారణం ఉంటుంది. అలాంటి ఒక విషయం స్టీరింగ్ ప్లేస్మెంట్. ఇది మీ మనస్సును కొన్నిసార్లు ఆశ్చర్యపరిచి ఉండవచ్చు, ఇది మధ్యలో కాకుండా పక్కన ఎందుకు ఉంచారు అని.

కారు ఎడమ లేదా కుడి వైపున దాని ప్లేస్‌మెంట్ వెనుక ఉన్న అసలు కారణం డ్రైవర్‌కు దూరాన్ని గమనించడంలో సహాయపడటం. దీని ద్వారా, డ్రైవర్ కొద్దిగా ఎడ్జ్ తీసుకొని, మొత్తం కారును లేన్ నుంచి బయటకు తీయకుండా తదుపరి వాహనానికి ముందు ఏ వాహనం కదులుతుందో తెలుసుకుంటాడు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..