Wedding Insurance: పెళ్లికి కూడా బీమా ఉంటుందని మీకు తెలుసా.? వివాహం క్యాన్సిల్‌ అయితే డబ్బులు క్లైమ్‌ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు..

| Edited By: Narender Vaitla

Feb 19, 2023 | 11:32 AM

మన దేశంలో పెళ్లి అనేది జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. తమ పిల్లల పెళ్లి కోసం తల్లిదండ్రులంతా వాళ్లు పుట్టినప్పటి నుంచే ఎంతో కొంత సొమ్మును దాచటం ప్రారంభిస్తారు.

Wedding Insurance: పెళ్లికి కూడా బీమా ఉంటుందని మీకు తెలుసా.? వివాహం క్యాన్సిల్‌ అయితే డబ్బులు క్లైమ్‌ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు..
Wedding
Follow us on

మన దేశంలో పెళ్లి అనేది జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. తమ పిల్లల పెళ్లి కోసం తల్లిదండ్రులంతా వాళ్లు పుట్టినప్పటి నుంచే ఎంతో కొంత సొమ్మును దాచటం ప్రారంభిస్తారు. తమ ఆస్తులను తాకట్టు పెట్టి అయినా సరే తమ పిల్లల పెళ్లిళ్లు చేసేందుకు వెనుకాడరు. తమ జీవితాంతం దాచుకున్న సొమ్మును పెళ్లిలో ఖర్చు పెట్టడం గమనిస్తూనే ఉంటాము అంతటి ప్రాధాన్యత ఉన్న పెళ్లి ఘట్టాన్ని అనుకోని కష్టాలు అవాంతరాలు వచ్చి ఆగిపోయినట్లయితే పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది. ఆ నష్టం ఎంతవరకు అంతే ఊహకు కూడా అందలేనిదని చెప్పవచ్చు. జీవితాంతం దాచుకున్న సొమ్ము ప్రమాదం కారణంగానో లేదా మరేదైనా అవాంతరం కారణంగానో నిలిచిపోతే ఆ నష్టాన్ని పూరించటం అంత సులభం కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే వివాహ బీమా అనేది తెరపైకి వచ్చింది. మనదేశంలో పెళ్లిళ్లను ఇన్సూరెన్స్ చేయించడం అనేది ఒక కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పెళ్లిళ్లు ఖరీదైన వ్యవహారం అనే చెప్పాలి. దీంతో వివాహ బీమా ధోరణి పెరిగింది. దేశంలో వివాహ వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయి. భారతదేశంలో కరోనా మొదటి , రెండవ వేవ్ సమయంలో, చాలా మంది తమ వివాహాలను రద్దు చేసుకున్నారు. దీని ప్రభావాన్ని వధువు తల్లిదండ్రులు భరించవలసి వచ్చింది. ఇరు కుటుంబాలకు ఖర్చుతో కూడిన వ్యవహారం ఇది. అలాంటి నష్టాలను నివారించేందుకు బీమా కంపెనీలు వివాహ బీమా సేవలను ప్రారంభించాయి. వివాహ బీమా ఏ సందర్భంలో కవర్ అవుతుందో ఇఫ్పుడు తెలుసుకుందాం.

పెళ్లిళ్లకు విపరీతంగా ఖర్చు పెట్టడం సహజమే, జీవితాంతం పొదుపు చేసిన డబ్బును పెళ్లి కోసం ఖర్చు చేయడానికి వెనుకాడరు. మీడియా నివేదికల ప్రకారం, ఫిబ్రవరి 2023 నాటికి, భారతదేశంలో వివాహాల కోసం ఖర్చు దాదాపు రూ. 3.75 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.పెళ్లికి ముందే పెళ్లి రద్దు అయితే లక్షలాది రూపాయల నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులను తొలగించేందుకు బీమా కంపెనీలు వివాహ బీమాను ప్రారంభించాయి.

ఇందులో, వివాహంలో నష్టపోయినప్పుడు, వివాహం రద్దు అయినప్పుడు, వస్తువులు దొంగిలించబడినప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినా, పాలసీదారునికి కలిగిన నష్టాన్ని బీమా కంపెనీ భర్తీ చేస్తుంది.

వివాహ బీమా అంటే ఏమిటి:

భారతదేశంలో ప్రతి సంవత్సరం 1 నుండి 1.5 కోట్ల వివాహాలు జరుగుతున్నాయి. దీంతో పాటు దేశంలో ఈ పెళ్లిళ్ల కోసం 3, 4 లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. పెళ్లిళ్లకు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. చాలా నెలల ముందుగానే వివాహ వేదిక, షాపింగ్ మొదలైన వాటికి సంబంధించిన అన్ని సన్నాహాలు ప్రారంభమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి క్యాన్సిల్ అయితే లక్షలు, కొన్నిసార్లు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. అటువంటి ఇబ్బందులు, అత్యవసర పరిస్థితుల్లో, వివాహ బీమా చాలా సహాయకారిగా ఉంటుంది.

ప్రీమియం ఎంత చెల్లించాలి:

వివాహ బీమా పాలసీని కొనుగోలు చేసే వ్యక్తి మొత్తం వివాహ బడ్జెట్ ఆధారంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ప్రస్తుతం భారత్‌లో వెడ్డింగ్ ఇన్సూరెన్స్ ట్రెండ్ ఇఫ్పుడే ప్రారంభం అయ్యింది. అయితే భవిష్యత్తులో ఇది బాగా పాపులర్ అవుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వివాహ బీమాలో, పాలసీ కొనుగోలుదారు మొత్తం వివాహ బడ్జెట్‌లో 1 నుండి 1.5 శాతం వరకు చెల్లించాలి. మీ పెళ్లి ధర రూ. 20 లక్షలు అయితే, మీరు బీమా ప్రీమియం రూ. 30,000 చెల్లించాలి. తరువాత, ఏదైనా రకమైన అత్యవసర పరిస్థితుల్లో, మీరు మీ నష్టానికి పరిహారం పొందవచ్చు.

మీకు వివాహ బీమా పాలసీని దేశంలోని అనేక బీమా కంపెనీలు అందిస్తున్నాయి. బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్, ఫ్యూచర్ జనరల్ ఇన్సూరెన్స్, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో, ఐసిఐసిఐ లాంబార్డ్ వంటి అనేక బీమా కంపెనీలు వినియోగదారులకు వివాహ బీమా సేవలను అందిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..