Indian Railways: రైలులో ‘ఎం’ కోడ్ కోచ్ అంటే ఏంటో తెలుసా? దానిలోని ప్రత్యేకతలేమిటంటే..

|

Aug 17, 2024 | 4:17 PM

‘ఎం’ కోడ్ తో ఉండే కోచ్ అంటే ఏసీ-3 టైర్ కోచ్ లపై M1, M2 గా రాసి ఉంటాయి. 2021లో, ఏసీ-3 అంటే 3A కేటగిరీ కోచ్ ను మరిన్ని మెరుగైన సౌకర్యాలతో తీసుకొచ్చింది.. ఈ కోచ్‌ని ‘ఎం’ కోడ్ తో పిలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కొన్ని రైళ్లలో మాత్రమే ఈ సౌకర్యం కల్పించారు. అన్ని రైళ్లలో ఈ ‘ఎం’ కోడ్ కోచ్ లు అందుబాటులో లేవు.

Indian Railways: రైలులో ‘ఎం’ కోడ్ కోచ్ అంటే ఏంటో తెలుసా? దానిలోని ప్రత్యేకతలేమిటంటే..
Ac 3 Tire Economy Coach
Follow us on

భారతీయ రైల్వే అన్ని తరగతుల వారికీ అనువైన ప్రయాణాన్ని అందిస్తుంది. పేద, మధ్య తరగతి, ఉన్నత వర్గాలు ఇలా ఎవరైనా ఒకే రైలులో వివిధ రకాల సౌకర్యాలతో కూడిన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. అందుకోసం రైల్వే ప్రత్యేక కోచ్ లను ఏర్పాటు చేస్తుంది. ఎవరి బడ్జెట్ స్థాయి, వారికి అవసరమైన సౌకర్యాలను బట్టి టికెట్లను ఆయా కోచ్ లలో బుక్ చేసుకునే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పిస్తుంది. సాధారణంగా ఒక రైలులో పదుల సంఖ్యో బోగీలు ఉంటాయి. వాటిల్లో అనేక రకాల కోచ్ లు ఉంటాయి. ఒక్కో కోచ్ ఒక్కో రకంగా ఉంటుంది, అన్ని కోచ్ లు ఒకేలా ఉండవు. వాటిలో ఉండే సౌకర్యాలను బట్టి వివిధ కోడ్ లతో వాటిని గుర్తిస్తారు. సాధారణంగా మనకు తెలిసిన కోచ్ ల గురించి చూస్తే.. జనరల్ బోగీ, సెకండ్ క్లాస్, థర్డ్ ఏసీ, ఫస్ట్ ఏసీ, ప్యాంట్రీ కోచ్ వంటివి మనకు కనిపిస్తాయి. వీటిని మనం SL, 1A, 2A, 3A, 2S, CC కేటగిరీలుగా మనం చూసి ఉంటాం. ఇవేకాక మరో కోచ్ కూడా ఒకటి ఉంటుంది. అది ఏసీ-3 ఎకానమీ క్లాస్. ఈ కోచ్ లనే ‘ఎం’ కోడ్ అని పేరు పెట్టారు. వీటిల్లో ఏసీ-3 టైర్ కన్నా కూడా ఎక్కువ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో వీటి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

‘ఎం’ కోచ్ ని ఇలా గుర్తించాలి..

‘ఎం’ కోడ్ తో ఉండే కోచ్ అంటే ఏసీ-3 టైర్ కోచ్ లపై M1, M2 గా రాసి ఉంటాయి. 2021లో, ఏసీ-3 అంటే 3A కేటగిరీ కోచ్ ను మరిన్ని మెరుగైన సౌకర్యాలతో తీసుకొచ్చింది.. ఈ కోచ్‌ని ‘ఎం’ కోడ్ తో పిలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కొన్ని రైళ్లలో మాత్రమే ఈ సౌకర్యం కల్పించారు. అన్ని రైళ్లలో ఈ ‘ఎం’ కోడ్ కోచ్ లు అందుబాటులో లేవు.

‘ఎం’ కోచ్ ఏంటో తెలుసుకోండి..

ఏసీ-3 ఎకానమీ కోచ్‌లు.. పాత ఏసీ-3 టైర్ కోచ్ లకు అప్ గ్రేడెట్ వెర్షన్. వీటిల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. ఈ కోచ్‌ల రూపకల్పన కూడా మునుపటితో పోలిస్తే మెరుగుపడింది. ఏసీ-3 ఎకానమీ కోచ్‌లో, ప్రతి సీటులోని ప్రయాణికునికి విడిగా ఏసీ డక్ ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. దీంతో పాటు ప్రతి సీటుకు బాటిల్ స్టాండ్, రీడింగ్ లైట్, ఛార్జింగ్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులకు చాలా సౌకర్యాలు ఉంటాయి. ఏసీ-3లో 72 సీట్లు ఉన్నాయి. ఏసీ-3 ఎకానమీలో మరో 11 సీట్లు అదనంగా ఇస్తారు. దీని వల్ల ఈ కోచ్ లో మొత్తం సీట్లు 83 సీట్లు ఉంటాయి.

రెండింటీకీ తేడా ఏంటి అంటే..

ఏసీ-3 ఎకానమీ క్లాస్ కూడా ఏసీ-3 టైర్ లాంటి కోచ్. దీనిలో ఏసీ-3 టైర్‌లో అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలతో పాటు కొన్ని అదనపు సౌకర్యాలను కలిగి ఉంది. అయితే ఏసీ-3 టైర్ కోచ్‌లను కలిగి ఉండే రైలో ఏసీ-3 ఎకానమీ కోచ్‌లు ఉండవు. ఏసీ-3 కొత్త కోచ్‌లకే ఏసీ-3 ఎకానమీ అని పేరు పెట్టారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..