Gold Purchase Scheme: అత్యధిక రాబడినిచ్చే ‘జీపీఎస్’.. ఎఫ్‌డీ కంటే ఎక్కువ ఇస్తుందా? పూర్తి వివరాలు

|

Feb 28, 2024 | 6:23 AM

సాధారణంగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఆస్తిని కొనుగోలు చేయడం లేదా మ్యూచువల్‌ ఫండ్లు, బ్యాంక్‌ డిపాజిట్లు వంటి ఆప్షన్ల వైపు ఎక్కువగా చూస్తారు. అక్కడే పెట్టుబడికి రక్షణ ఉంటుందని భావిస్తారు. అయితే ఇటీవల బంగారు కొనుగోలు పథకాలు(జీపీఎస్: గోల్డ్ పర్చేస్ స్కీమ్) కూడా ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టాలంటే దానిలో అన్ని అంశాలనూ తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.

Gold Purchase Scheme: అత్యధిక రాబడినిచ్చే ‘జీపీఎస్’.. ఎఫ్‌డీ కంటే ఎక్కువ ఇస్తుందా? పూర్తి వివరాలు
Gold
Follow us on

మనం జీవితంలో తప్పని సరిగా నేర్చుకోవాల్సింది పొదుపు. సంపాదించిన దానిలో కొంత పొదుపు చేసుకుంటే చివరి దశలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. సాధారణంగా బ్యాంకులనే అందరూ విశ్వసిస్తారు. వాటిలో డిపాజిట్ చేయడం వల్ల సొమ్ముకు భద్రత ఉంటుందని నమ్ముతారు. ముఖ్యంగా బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేస్తారు. అయితే అంతకు మించిన ఆప్షన్లు చాలానే ఉన్నాయి. పెట్టుబడి పెట్టాలి అని నిర్ణయం తీసుకున్న సమయంలో దేనిలో అయితే అధిక రాబడులు వస్తాయో ముందు అంచనా వేసుకోవాలి. అలాగే భద్రత గురించి ఆలోచించాలి. ఆ తర్వాత పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. సాధారణంగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఆస్తిని కొనుగోలు చేయడం లేదా మ్యూచువల్‌ ఫండ్లు, బ్యాంక్‌ డిపాజిట్లు వంటి ఆప్షన్ల వైపు ఎక్కువగా చూస్తారు. అక్కడే పెట్టుబడికి రక్షణ ఉంటుందని భావిస్తారు. అయితే ఇటీవల బంగారు కొనుగోలు పథకాలు(జీపీఎస్: గోల్డ్ పర్చేస్ స్కీమ్) కూడా ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టాలంటే దానిలో అన్ని అంశాలనూ తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ నేపథ్యంలో ఫిక్స్ డ్ డిపాజిట్లు, జీపీఎస్ పథకాలలో ఏది బెస్ట్? దేనిలో అధిక రాబడి వస్తుంది? దేనిలో అధిక భద్రత ఉంటుంది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఫిక్స్ డ్ డిపాజిట్లు..

వీటిలో ఒక నిర్ధిష్ట కాలానికి మనం డబ్బులను డిపాజిట్‌ చేస్తాం. వాటి నుంచి మనకు స్థిరమైన వడ్డీ అందుతుంది. ఇవి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నిర్వహిస్తాయి. అయితే నమ్మదగిన పెట్టుబడులు. రిస్క్‌ చాలా తక్కువ. మెచ్యురిటీ సమయానికి వడ్డీతో పాటు నిర్థిష్టమైన మొత్తాన్ని పొందవచ్చు. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లకు ఫిక్స్ డ్ డిపాజిట్ల ద్వారా పెట్టుబడిపై ఎక్కువ వడ్డీని అందిస్తున్నారు.

కాలవ్యవధిపై ఆధారం.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కాలవ్యవధిపై ఆధార పడి ఉంటాయి. ఇవి ప్రస్తుతం 5 శాతం నుంచి 7 శాతం వరకూ వడ్డీ ఇస్తున్నాయి. ఇవి పొదుపు ఖాతాలపై ఇచ్చే రేటు కంటే కాస్త ఎక్కువ అని చెప్పవచ్చు. ఎఫ్‌డీలకు సంబంధించి ట్యాక్స్‌లు పన్నుల చట్టానికి లోబడి ఉంటాయి. షెడ్యూల్‌ బ్యాంక్‌తో ఐదేళ్ల కంటే ఎక్కువ కాలవ్యవధి ఉన్న డిపాజిట్లపై కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టం 1961లోని 80 సి ప్రకారం 1,50,000 వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

పన్ను మినహాయింపు.. నాన్‌ రెసిడెంట్‌ ఎక్స్‌టర్నల్‌ (ఎన్‌ఆర్‌ఈ) లేదా ఫారిన్‌ కరెన్సీ నాన్‌ రెసిడెంట్‌ (ఎఫ్‌సీఎన్‌ఆర్‌) ఖాతాలోనికి ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీకి పన్ను మినహాయింపు ఉంది. ఇంకా పాత పన్నుల విధానంలో ఎఫ్‌డీల నుంచి రూ.50 వేల వరకూ సీనియర్‌ సిటిజన్లకు మినహాయింపు ఇస్తారు. అయితే రూ.40,000 (సీనియర్‌ సిటిజన్లకు రూ.50000) కంటే ఎక్కువ వడ్డీపై పది శాతం టీడీఎస్ తీసివేయడం తప్పనిసరి.

బంగారం కొనుగోలు పథకం..

బంగారం కొనుగోలు పథకం (జీపీఎస్‌)లో నెలవారీ డిపాజిట్ చేయాలి. తద్వారా భవిష్యత్తు బంగారం కొనుగోళ్లకు అవకాశం ఉంటుంది. ఈ పథకం ఏ ఆర్థిక సంస్థ నిర్వహించదు. వీటిని ప్రముఖ జ్యూయలరీ సంస్థలు నిర్వహిస్తాయి. ఈ స్కీముల్లోనూ మెచ్యూరిటీ సమయంలో వచ్చే ప్రయోజనాలు బాగుంటాయి.

రిటర్న్‌లు.. ఫ్రారంభం పెట్టుబడి సమయంలో బంగారం ధరను నిర్ణయిస్తారు. అందువల్ల మెచ్యూరిటీపై కొనుగోలు సమయంలో ఉపయోగంగా ఉంటుంది. ఉదాహరణకు జీపీఎస్‌ ప్రారంభం సమయంలో బంగారం ధర గ్రాము రూ.5,500, మెచ్యూరిటీ సమయంలో రూ.6 వేలు అయితే. పెట్టుబడి దారుడు ప్రారంభ ధర రూ.5500కు కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల స్థిరమైన రేటులో ఎక్కువ బంగారాన్ని పొందవచ్చు. ఆభరణాల మేకింగ్‌ చార్జీలు మినహాయింపు ఉంటుంది. లేదా తగ్గింపుతో పెట్టుబడిదారులు అదనపు ప్రయోజనాలను పొందుతారు. ఒక నెల ఇన్‌స్టాల్‌మెంట్‌ను కూడా జ్యూయిలరీ సంస్థ భరిస్తుంది. జీపీఎస్ అనేది ఆస్తి కొనుగోలుకు పెట్టుబడి వంటింది. ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఎవరి రికమండేషన్ అవసరం లేదు. వీటిలో కట్టే డబ్బులకు ఎలాంటి పన్నులనూ వసూలు చేయరు.

బంగారం వినియోగం ఎక్కువే..

బంగారాన్ని ఎక్కువగా వినియోగించే దేశాల్లో మన దేశం ఒకటి. పండుగలు, శుభకార్యాలు, ఇతర ముఖ్యమైన సందర్భాల్లో మనం బంగారం కొనడానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తాం. బంగారు ఆభరణాలను ధరించడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తాం. ఈ కారణంగానే బంగారం ధర ఎంత పెరిగినా, డిమాండ్ కూడా దానికంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బంగారం కొనుగోలు పథకాల్లో పెట్టుబడి పెట్టడం కూడా ఎంతో లాభదాయకమని చెప్పవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..