
కేంద్ర ప్రభుత్వం నవంబర్ 21వ తేదీ నుంచి కొత్త కార్మిక లేబర్ కోడ్‌లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. గతంలో ఉన్న పాత నిబంధనలను మార్చి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పాత సంస్కరణల్లో పలు కీలక మార్పులు చేశారు. ఉద్యోగులకు భద్రత, సోషల్ సెక్యూరిటీ కల్పించడం కోసం కొత్త రూల్స్‌ను తీసుకొచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయాలపై దేశవ్యాప్తంగా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. పాత రూల్స్‌తో పోలిస్తే ఈ కొత్తగ సంస్కరణల్లో ఏం ఉన్నాయి.. ? ఎలాంటి మార్పులు జరిగాయి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
పాత సిస్టమ్ ప్రకారం ఉద్యోగులకు అపాయింట్‌లెటర్ తప్పనసరి కాదు.కానీ ఇప్పుడు దానికి కేంద్రం తప్పనిసరి చేసింది. ఉద్యోగులందరికీ రాతపూర్వకంగా అపాయింట్‌మెంట్ లెటర్ ఖచ్చితంగా ఇవ్వాలి. దీని వల్ల ఉద్యోగులకు అధికారిక గుర్తింపు అనేది ఉంటుంది. ఇక గతంలో షెడ్యూల్డ్ కంపెనీలకు మాత్రమే మినిమిం కనీస శాలరీ నిబంధన ఉంది. కానీ ఇప్పుడు అన్నీ కంపెనీలకు మినిమం కనీస శాలరీ నిబంధన వర్తిస్తుంది. ఇక గతంలో 5 సంవత్సరాలుగా ఉన్న గ్రాట్యూటీ పిరీయడ్‌ను తాజాగా ఒక సంవత్సరానికి మార్చారు.
గతంలో ఉద్యోగులకు శాలరీ టైమ్‌కు వేయాలని నిబంధన ఖచ్చితంగా లేదు. కానీ ఉద్యోగులకు జీతం ఆన్ టైమ్ ఇవ్వాలనే నిబంధనను ఇప్పుడు కేంద్రం తెచ్చింది. దీని వల్ల సకాలంలో ఉద్యోగులు జీతాలు పొందుతారు. కొత్త రూల్స్ ప్రకారం ఐటీ ఉద్యోగలుకు 7వ తేదీలోపే జీతాలు ఇవ్వాలి.
గతంలో ప్రతీ కంపెనీ ఉద్యోగులకు సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ ఉచితంగా చేయించాలనే రూల్ లేదు. కానీ ఇప్పుడు ఏడాదికి ఒకసారి ఫ్రీ హెల్త్ చెకప్ సౌకర్యం కల్పించాలి. ఇక గతంలో ESIC కవరేజ్‌కు సంబంధించి 10 మంది కంటే తక్కువ మంది ఉద్యోగులకు ఉన్న సంస్థలకు మినహాయింపు ఉండేది.కానీ ఇప్పుడు అంతకంటే తక్కువమంది ఉన్న సంస్థలకు కూడా ESIC కవరేజ్ ప్రయోజనాలు అందుతాయి.
గతంలో నైట్ షిఫ్ట్‌లలో కొన్ని వృత్తులకు మాత్రమే మహిళలను పరిమితం చేశారు. కానీ ఇప్పుడు అన్ని పనుల్లో మహిళలు నైట్ షిఫ్ట్ చేయడానికి అనుమతి ఇచ్చారు. అలాగే పురుషులతో సమానంగా మహిళలకు ఇవ్వాలనే నిబంధన తెచ్చారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..