SBI Customer Alert: దేశంలో అనేకమైన ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్నాయి. మోసాలు జరుగకుండా ఉండేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా.. మోసాలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యాలు గణనీయంగా మెరుగుడినప్పటికీ, కొత్త రకంగా మోసాలకు పాల్పడుతున్నారు కొందరు సైబర్ నేరగాళ్లు. అమాయకులను ఆసరా చేసుకుని నిలువునా మోసగిస్తున్నారు. ప్రజలు తమ మొబైల్ నుంచి వేర్వేరు యాప్‌ల ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా అనేక బ్యాంకులు తమ ఖాతాదారులకు ఎప్పటికప్పుడు డిజిటల్ మోసాలపై హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాయి. తాజాగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లను మరోసారి అప్రమత్తం చేసింది.
ఖాతాదారులు మోగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఆన్‌లైన్‌లో ఎటువంటి సున్నితమైన వివరాలను ఎవ్వరితోను పంచుకోవద్దని హెచ్చరించింది. నెట్‌బ్యాంకింగ్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌లు, డేటాప్‌బర్త్ వివరాలు, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ గానీ, పాస్‌వర్డ్, ఏటీఎం నెంబర్, బ్యాంకు అకౌంట్, ఏటీఎం కార్డు పిన్ నెంబర్, సీవీవీ, ఓటీపీలు ఇతరులకు చెప్పవద్దని, లేకపోతే నిలువునా మోసపోవాల్సి ఉంటుందని ఎస్‌బీఐ హెచ్చరికలు జారీ చేస్తూ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేసింది. అలాగే ఎవరైనా ఎస్‌బీఐ నుంచి ఫోన్‌లు చేస్తూ మీ బ్యాంకు వివరాలు, డెబిట్ కార్డు వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవదని తెలిపింది.
ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్న దృష్ట్యా కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది ఎస్‌బీఐ. అయితే చాలా మంది బ్యాంక్ లావాదేవీలు, బ్యాంకులకు సంబంధించి ఇతర పనులు ఎక్కువ మంది మొబైల్‌లో ఆన్‌లైన్ ద్వారానే చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని ఆసరా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు నిలువునా దోచేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలనే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులు కూడా గట్టి నిఘానే పెట్టారు.
అయితే ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు చాలా పెరిగిపోతున్నాయి. ఎందరో కస్టమర్లు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి లక్షలు పోగొట్టుకున్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. రోజురోజుకు పెరిగిపోతున్న మోసాలను దృష్టిలో ఉంచుకుని ఎస్‌బీఐ తన కస్టమర్లను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ వినియోగదారులను అప్రమత్తం చేస్తోంది. సైబర్ నేరగాళ్లు ఎస్‌బీఐ నుంచి అంటూ కస్టమర్లకు ఫోన్‌లు చేస్తూ నిలువు దోపిడి చేస్తున్నారు. మీ ఏటీఎం బ్లాక్ అయ్యిందని, అది అన్‌బ్లాక్ కావాలంటే ఓటీపీలు, లేదా ఖాతానెంబర్ ఇలా రకరకాలుగా అడుగుతూ కస్టమర్ ఖాతా నుంచి డబ్బులు లాగేసుకుంటున్నారు. ఇలా చాలా మంది మోసపోయారు. లేకపోతే కస్టమర్ల ఫోన్ నెంబర్‌కు లింక్ పంపించి అది ఓపెన్ చేయగానే బ్యాంకు వివరాలు సదరు కస్టమర్ బ్యాంకు వివరాలు నేరగాళ్లుకు తెలిసిపోతుంది. ఇలా కూడా మోసాలు జరుగుతున్నాయి.
We advise our customers to be alert of fraudsters and not to share any sensitive details online or download any app from an unknown source.#StaySafe #StaySecure #BeAlert #CyberSecurity #CyberSafety #SBIAapkeSaath pic.twitter.com/swhJjjlIcY
— State Bank of India (@TheOfficialSBI) June 13, 2021