సొంతిల్లు కొనుక్కోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ దానికి డబ్బు కావాలి.. మరి అందరి దగ్గర డబ్బు ఉంటుందా.. అంటే ఉండదు. కొంత డబ్బు ఉంటే మిగతా డబ్బు హోం లోన్ తీసుకోవాలి. అసలు బ్యాంకులు ఎలా లోన్ ఇస్తాయో చూద్దాం… RBI రికార్డుల ప్రకారం బ్యాంకులు, ఆర్థిక సంస్థల మొత్తం బకాయిల్లో హోమ్ లోన్స్ 14 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. IIFL హోమ్ ఫైనాన్స్ రిపోర్ట్ రాబోయే 2-3 సంవత్సరాలలో ఇది ఏటా 15 నుండి 18% వరకు పెరుగుతుందని అంచనా. మీరు ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. దానికి సరైన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోండి. అయితే మీకు నచ్చిన ఇంటిని ఎంచుకోవడానికి సమయం పడుతుంది.
మీరు హోమ్ లోన్ కోసం అప్లై చేసినప్పుడు.. బ్యాంక్ మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తుంది. ఈ క్రెడిట్ స్కోర్ ఆధారంగా మాత్రమే.. లోన్ ఇచ్చేవారు మీ లోన్ సాంక్షన్ చేయాలా వద్దా అని నిర్ణయిస్తారు. మీరు ఇల్లు కొనాలని నిర్ణయించుకునే ముందు.. మీ క్రెడిట్ స్కోర్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనకు తెలియకుండానే జరిగే కొన్ని ట్రాన్సాక్షన్స్ వల్ల కూడా క్రెడిట్ స్కోర్ పడిపోవచ్చు. అయితే ఈ లోపాన్ని కరక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీకు లోన్ దొరుకుతుంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టవచ్చు. అందుకే ఏదైనా లోన్ తీసుకోవాలని అనుకున్నపుడు ముందుగానే CIBIL స్కోర్ తెలుసుకోవడం అవసరం. మీరు ఇంటిని కొనాలని డిసైడ్ అయితే.. ముందే మీరు గృహ రుణం కోసం అంటే ప్రీ అప్రూవ్ద్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. మీ క్రెడిట్ బాగుందని మీకు నమ్మకం కుదిరిన తర్వాతే హోమ్ లోన్‌కు అప్లై చేసుకోండి.
మీరు ఇప్పటికే ప్రీ-అప్రూవ్డ్ లోన్‌ని కలిగి ఉంటే, అది మీకు ఇల్లు అమ్మేవారి పనిని ఈజీ చేస్తుంది. మీ వద్ద అవసరమైన ఎమౌంట్ అందుబాటులో ఉందని అతను ఖచ్చితంగా నమ్ముతాడు. ప్రీ-అప్రూవ్డ్ హోమ్ లోన్ లిమిటెడ్ పిరియడ్ మాత్రమే ఫోర్స్ లో ఉంటుందని గుర్తుంచుకోండి. ఇది బ్యాంక్ లేదా కంపెనీ నుంచి ఎలా లోన్ తీసుకోవాలి అనే విషయంపై మీకు అవగాహన కల్పిస్తుంది. చేతిలో అమౌంట్ సిద్దంగా ఉంటే డీల్ మరింత చౌకగా ఉంటుంది. మీరు ఇంటిని కొనుగోలు చేయడానికి బడ్జెట్‌ను సిద్ధం చేసినప్పుడు.. మీకు హోం లోన్ ఎంత వస్తుందో తెలుసుకుని.. లోన్ కంటే ఎక్కువగా కావలసిన ఎమౌంట్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. సరళంగా చెప్పాలంటే, దీనిని మార్జిన్ మనీ అంటారు. బ్యాంకులు సాధారణంగా ఆస్తి విలువలో 80% వరకు రుణాన్ని అందిస్తాయి. అలాగే, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను వసూలు చేస్తాయి.
మీరు ఇల్లు కొనడం కోసం నిర్ణయం తీసుకుని.. బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నించే టైమ్ కల్లా మీ మార్జిన్ మనీ సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇల్లు కొనడం కోసం మీరు కొంత డబ్బు దాచి ఉండవచ్చు. అదేవిధంగా వివిధ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసి ఉండవచ్చు. ఇలా మీరు దాచిన..పెట్టుబడి పెట్టిన ఎమౌంట్స్ మొత్తం ఒకే బ్యాంకు ఖాతాలో జమ చేసి సిద్ధంగా ఉండండి. మీరు స్టాక్‌లు లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బును ఇన్వెస్ట్ చేసి ఉంటే, రైట్ టైమ్ లో దాన్ని రీడీమ్ చేసుకోండి.