FDs interest rate: ఎఫ్‌డీలపై అధిక వడ్డీ కావాలా..? బెస్ట్ బ్యాంకులు ఇవే..!

|

Nov 30, 2024 | 2:15 PM

నమ్మక మైన, సురక్షితమైన పెట్టుబడి మార్గాలలో ఫిక్స్ డ్ డిపాజిట్లు (ఎఫ్ డీలు) ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాయి. మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం లేకుండా నిర్ణీత కాలవ్యవధికి వడ్డీతో సహా అసలును తీసుకునే అవకాశం ఉండడం దీనికి ప్రధాన కారణం. అందుకునే డబ్బులను దాచుకోవడానికి ప్రజలు ఎఫ్ డీలపై వైపు చూస్తారు. ఎలాంటి రిస్కు లేకుండా రాబడి కోరుకునే వారందరూ వీటిలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తారు.

FDs interest rate: ఎఫ్‌డీలపై అధిక వడ్డీ కావాలా..? బెస్ట్ బ్యాంకులు ఇవే..!
Follow us on

ఇటీవల స్టాక్ మార్కెట్ పై ప్రజలకు ఆసక్తి పెరిగింది. దానిలో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువయ్యారు. అయితే ఆ మార్కెట్ ఒడిదొడుకులకు గురికావడంతో మళ్లీ ఎఫ్ డీల వైపు ఆసక్తి చూపుతున్నారు. ప్రముఖ బ్యాంకులైన ఎస్బీఐ, హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకులలో ఎఫ్ డీలపై అందిస్తున్న వడ్డీరేట్ల వివరాలు ఇలా ఉన్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల బ్యాంకులలో ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలు అమలవుతున్నాయి. కానీ వాటిలో ఎఫ్ డీలకు ఇచ్చే వడ్డీరేటు మాత్రం మారుతూ ఉంటుంది. బ్యాంకులు తమ నిబంధనలకు అనుగుణంగా ఈ రేట్లను అమలు చేస్తాయి. ఎఫ్ డీలలో డబ్బులను డిపాాజిట్ చేసేముందు వడ్డీరేటు వివరాలను తెలుసుకోవాలి. ఇవి కూడా సాధారణ ఖాతాదారులు, సీనియర్లు, సీనియర్ సిటిజన్లకు వేర్వేరుగా ఉంటాయి. ఫిక్స్ డ్ డిపాజిట్లలో జమ చేసిన డబ్బులు, కాల వ్యవధికి అనుగుణంగా వడ్డీరేట్లను అమలు చేస్తారు. మూడు కోట్ల రూపాయల లోపు డిపాజిట్లపై కింద తెలిపిన విధంగా వడ్డీ అందిస్తున్నారు.

ఎఫ్‌డీలపై వడ్డీ ఇలా

  • హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 7.90 శాతం వడ్డీ అందిస్తున్నారు. సాధారణ ఖాతాదారులకు 3 నుంచి 7.40 శాతం వరకూ అమలు చేస్తున్నారు.
  • స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో సాధారణ ఖాతాదారులకు 3.50 నుంచి 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 4 నుంచి 7.50 శాతం వడ్డీ రేట్లు అమలవుతున్నాయి.
  • ఐసీఐసీఐ బ్యాంకులో సాధారణ ఖాతాదారులకు 3 నుంచి 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 నుంచి 7.80 శాతం వడ్డీ ఇస్తున్నారు.
  • పంజాబ్ నేషనల్ బ్యాంకులో సాధారణ ఖాతాదారులకు 3.50 నుంచి 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 4 నుంచి 7.75 శాతం అమలు చేస్తున్నారు.

బ్యాంకులు ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించి ఫిక్స్ డ్ డిపాజిట్లను సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. దీంతో ఖాతాాదారులను ఆకట్టుకునేందుకు బ్యాంకులు ఎఫ్ డీలపై ఆకర్షణీయమైన వడ్డీరేట్లను అమలు చేస్తున్నాయి. అలాగే ఖాతాదారులతో మెరుగైన సంబంధాలను కొనసాగించడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.21 శాతం నమోదైంది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా డిసెంబర్ 4 నుంచి 6వ తేదీలలో ద్రవ్య విధాన కమిటీ సమావేశం నిర్వహించనుంది. దీనిలో కీలకమైన రెపోరేటును యథాతథంగా ఉంచాలని భావిస్తున్నట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి