Vivad se Vishwas Scheme: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆ గడువు సెప్టెంబర్‌ 30 వరకు పొడిగింపు

|

Aug 29, 2021 | 7:52 PM

Vivad se Vishwas Scheme: పన్ను చెల్లింపుదారులకు ఎన్నో శుభవార్తలు అందుతున్నాయి. తాజాగా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ పన్ను చెల్లింపుదారులకు..

Vivad se Vishwas Scheme: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆ గడువు సెప్టెంబర్‌ 30 వరకు పొడిగింపు
Follow us on

Vivad se Vishwas Scheme: పన్ను చెల్లింపుదారులకు ఎన్నో శుభవార్తలు అందుతున్నాయి. తాజాగా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ పన్ను చెల్లింపుదారులకు ఆదివారం శుభవార్త ప్రకటించింది.  వివాద్‌ సే విశ్వాస్‌ పథకం కింద ఎటువంటి వంటి అదనపు రుసుముల లేకుండా పన్ను చెల్లించేందుకు సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ ప్రకటించింది. అయితే ఈ గడువు ఆగస్టు 31 వరకు ఉండేది. దీనిని సెప్టెంబర్‌ 30 వరకు పొడిగించింది. వివాద్‌ సే విశ్వాస్‌ ద్వారా పన్ను చెల్లింపులో భాగంగా ఫారమ్‌-3 వల్ల ఇబ్బందులు ఎదురైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీబీడీటీ వెల్లడించింది.

అదనపు ఛార్జీలతో..

కాగా, అదనపు ఛార్జీలతో పన్నులు చెల్లించేందుకు అక్టోబరు 31కే చివరి తేది అని తెలిపింది. ఇకపై గడువు పొడిగింపులు ఉండవని సీబీడీటీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగస్టు 29న సీబీడీటీ ప్రకటన జారీ చేసింది.

వివాద్ సే విశ్వాస్ పథకం అంటే ఏమిటి?

వివాద్ సే విశ్వాస్ పథకం పెండింగ్‌లో ఉన్న పన్నులను చెల్లించే పన్ను చెల్లింపుదారులకు వడ్డీ, జరిమానాపై పూర్తి మాఫీని అందిస్తుంది. బహుళ ఫోరమ్‌లలో వివాదంలో పన్ను డిమాండ్లు లాక్ చేయబడిన వారికి ప్రయోజనం చేకూర్చడం ఈ పథకం లక్ష్యం.

వివాద్‌ సేవ విశ్వాస్‌ పథకం నియమం:

పన్ను చెల్లింపుదారులు డిక్లరేషన్‌ చేయడానికి చివరి తేదీ మార్చి 31, 2021 కాగా, ప్రభుత్వం చెల్లింపులు చేయడానికి ఆగస్టు 31 చివరి తేదీగా నిర్ణయించింది. ఇప్పుడు తాజాగా ఆ గడువును పెంచింది. కావాలంటే కొంత వడ్డీ చెల్లించి అక్టోబర్‌ 31లోపు పన్ను చెల్లించవచ్చు. వివాద్‌ సే విశ్వాస్‌ పథకంలో పన్ను చెల్లింపుదారుడు ఆదాయపు పన్ను చట్టం కింద ఏదైనా నేరానికి వడ్డీ, జరిమానా, ప్రాసిక్యూషన్‌ కోసం ఏవైనా విచారణల నుంచి మినహాయించబడతాడు. కాగా, పెండింగ్‌లో ఉన్న పన్ను విషయాలను పరిష్కరించడానికి ప్రభుత్వం మార్చి 17, 2020న వివాద్‌ సే పథకాన్ని ప్రారంభించింది.

వివాదస్పద పన్నులు మాత్రమే..

ఈ పథకం కింద, పన్ను చెల్లింపుదారు వివాదాస్పద పన్నులను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. పన్ను శాఖ ద్వారా ఈ మొత్తానికి వడ్డీ లేదా పెనాల్టీ విధించబడదు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్న పన్ను చెల్లింపుదారుడు.. ఈ పథకం వ్యవధి ఎప్పటికప్పుడు పొడిగించబడుతుంది. తద్వారా మరిన్ని కేసులు పరిష్కరించబడతాయి. పథకం కింద నిర్ణయించిన మొత్తానికి, పన్ను చెల్లింపుదారుడు డబ్బు చెల్లించాల్సిన నిర్దిష్ట తేదీని ఎంపిక చేస్తారు.

 

ఇవీ కూడా చదవండి:

Farmers: కేంద్ర సర్కార్‌ స్కీమ్‌.. రైతులు ఇలా చేయండి.. నెలకు రూ.3000 పొందవచ్చు.. పూర్తి వివరాలు..!

Nominee: బ్యాంకు ఖాతా.. వివిధ పథకాల్లో నామినీ పేరు ఎందుకు చేర్చాలి..? నమోదు చేయకపోతే ఏమవుతుంది..?