Liquor Shop: కొత్త మద్యం పాలసీ.. పెరగనున్న లిక్కర్ షాపుల లైసెన్స్‌ ఫీజు.. తగ్గనున్న మద్యం ధరలు..!

|

Jan 02, 2022 | 4:48 PM

Liquor Shop: ప్రభుత్వాలకు అధికంగా ఆదాయం వచ్చేది అంటే మద్యం షాపుల నుంచే. ఇప్పుడు ఆ రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్‌ పాలసీ అమలు కానుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం..

Liquor Shop: కొత్త మద్యం పాలసీ.. పెరగనున్న లిక్కర్ షాపుల లైసెన్స్‌ ఫీజు.. తగ్గనున్న మద్యం ధరలు..!
Liquor Shops
Follow us on

Liquor Shop: ప్రభుత్వాలకు అధికంగా ఆదాయం వచ్చేది అంటే మద్యం షాపుల నుంచే. ఇప్పుడు ఆ రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్‌ పాలసీ అమలు కానుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. ఏప్రిల్ 1, 2022 నుండి యూపీలో కొత్త మద్యం దుకాణం కోసం లైసెన్స్ పొందాలంటే అధికంగా వెచ్చించాల్సి వస్తుంది. అదే సమయంలో రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గే అవకాశం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని కేటగిరీల మద్యం దుకాణాలకు లైసెన్స్ ఫీజును 7.5 శాతం పెంచాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా రూ.41,000 కోట్ల వార్షిక ఆదాయం సమకూరనుంది.

కొత్త ఎక్సైజ్‌ పాలసీ ఫీజు..
కొత్త ఎక్సైజ్ పాలసీ 2022-23 కూడా లైసెన్స్ ఫీజు మరింత పెరగనుంది. ఆ ఫీజులో లైసెన్స్‌ పునరుద్దరణ, లైసెన్స్‌ రుసుము, ఇతర భద్రతలకు సంబంధించిన ఉన్నాయి. మాస్టర్ వేర్‌హౌస్ రిజిస్ట్రేషన్ ఫీజు మరియు రెన్యూవల్ ఫీజులో కూడా పెరుగుదల ఉంది. అయితే బార్ లైసెన్స్ ఫీజులో ఎటువంటి మార్పు చేయలేదు.

దేశీ మద్యం చౌకగా..
దేశీ మద్యంపై కోవిడ్ సెస్‌ను తొలగించాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ సెస్‌ను తొలగించడంతో దేశీ మద్యం ధర తగ్గనుంది. మార్చి తర్వాత మళ్లీ రాష్ట్రంలో కోవిడ్ నోటిఫై చేయబడితే, నోటిఫికేషన్ తేదీ నుండి సెస్ స్వయంచాలకంగా అమలు చేయబడుతుంది. మిగతా అన్ని రకాల మద్యం ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. దీంతో పాటు ప్రజలకు నాణ్యమైన దేశీ మద్యం అందుతుంది. ఇది గాజు సీసాలలో విక్రయించబడుతుంది. యూపీలో మద్యం దుకాణాలు తెరిచే, మూసివేసే సమయాల్లో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. సమయ వేళలు అలాగే ఉంచింది.

మద్యం ఇంట్లో ఉంచుకోవడానికి లైసెన్స్ ఫీజు కూడా తగ్గింది
ఉత్తరప్రదేశ్‌లో ఒక వ్యక్తి తన ఇంటి వద్ద 26.5 లీటర్ల వరకు నిల్వ చేయడానికి అనుమతించబడుతుంది. అయితే దీనికి లైసెన్స్ అవసరం. వ్యక్తిగత ఇంటి లైసెన్స్ ఫీజును ప్రభుత్వం తగ్గించింది. రూ.12,000 నుంచి రూ.11,000కు తగ్గించింది. దీంతోపాటు సెక్యూరిటీ ఫీజును కూడా రూ.51,000 నుంచి రూ.25,000కు తగ్గించారు. యూపీ ప్రభుత్వం బార్ లైసెన్స్ ఫీజును పెంచలేదు.

వరి, మొక్కజొన్న, బంగాళదుంపలతో మద్యం తయారు:
లక్నోకు చెందిన దసరి మామిడి వంటి ఉత్తరప్రదేశ్‌లో పండే పండ్ల నుంచి మద్యం తయారు చేయనున్నారు. దీంతోపాటు బీరు తయారీలో ఉపయోగించే గోధుమలు, బార్లీలను రాష్ట్రంలోనే కొనుగోలు చేయనున్నారు. బారాబంకి, మీర్జాపూర్‌తో సహా మూడు ప్రదేశాలలో బీర్ ఉత్పత్తి చేయబడుతుంది. వరి, మొక్కజొన్న, బంగాళదుంపల నుంచి మద్యం తయారు చేసేందుకు కూడా చర్యలు చేపట్టనుంది ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి:

Credit Card: మీరు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా..? ఈ విషయాలను గుర్తించుకోండి.. లేకపోతే కష్టాల్లో ఇరుక్కున్నట్లే..!

BSNL Plan: కొత్త ఏడాదిలో బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే ఆఫర్‌.. ఆ ప్లాన్‌లో అదనంగా 60 రోజుల వ్యాలిడిటీ