FD Interest Rates Hike: సీనియర్ సిటిజన్లకు ఆ బ్యాంకు శుభవార్త.. ఎఫ్‌డీలపై భారీగా వడ్డీ రేట్ల పెంపు

|

May 26, 2023 | 4:15 PM

గతేడాది నుంచి ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా అన్ని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. అయితే ఏప్రిల్‌లో రెపో రేట్ యథాతథంగా ఉంచడంతో ఈ పెంపునకు కాస్త బ్రేక్ పడింది. అయినా కొన్ని బ్యాంకులు మాత్రం కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఇతర బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నారు.

FD Interest Rates Hike: సీనియర్ సిటిజన్లకు ఆ బ్యాంకు శుభవార్త.. ఎఫ్‌డీలపై భారీగా వడ్డీ రేట్ల పెంపు
Fixed Deposit
Follow us on

జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును అధిక రాబడి కోసం వివిధ పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటాం. ముఖ్యంగా చాలా మంది మంచి వడ్డీ రాబడి వచ్చే ఫిక్స్డ్ డిపాజిట్స్‌లో పెట్టుబడి పెట్టడానికి మక్కువ చూపుతూ ఉంటారు. దీని గురించి ఏయే బ్యాంకులు ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తున్నాయో? అని వెతుకుతూ ఉంటాం. బ్యాంకులు కూడా సీనియర్ సిటిజన్లను ఆకట్టుకోవడానికి అధిక వడ్డీ ఆఫర్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా గతేడాది నుంచి ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా అన్ని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. అయితే ఏప్రిల్‌లో రెపో రేట్ యథాతథంగా ఉంచడంతో ఈ పెంపునకు కాస్త బ్రేక్ పడింది. అయినా కొన్ని బ్యాంకులు మాత్రం కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఇతర బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నారు. తాజాగా ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రెండు కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది . సవరణ తర్వాత బ్యాంక్ సాధారణ ప్రజలకు 4.00 శాతం నుంచి 7 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 4.60 శాతం నుంచి 7.60 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ పెంచిన వడ్డీ రేట్లు మే 22 నుంచి అందుబాటులోకి వస్తాయి. ఈ బ్యాంకు అందించే తాజా వడ్డీ రేట్లపై ఓ లుక్కేద్దాం. 

సాధారణ ప్రజలు 1000 నుంచి 1500 రోజుల వ్యవధిలో డిపాజిట్లపై గరిష్టంగా 8.25% రాబడిని పొందవచ్చు. సీనియర్ వ్యక్తులు గరిష్టంగా 8.85 శాతం రాబడిని పొందవచ్చు. తదుపరి 7 రోజుల నుండి 45 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ ఇప్పుడు 4.00 శాతం వడ్డీ రేటును ఇస్తోంది. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రస్తుతం 46 రోజుల నుంచి 90 వరకు మెచ్యూర్ అయ్యే వాటిపై 4.75% వడ్డీ రేటును అందిస్తుంది. 91 రోజుల నుంచి 180 రోజుల వరకు ఉన్న డిపాజిట్లపై 5.50 శాతం, 181 రోజుల నుంచి 364 రోజుల వ్యవధి ఉన్న డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీ రేటు వస్తుంది. అలాగే 365-699 రోజుల మధ్య మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై ఇప్పుడు 7.75% వడ్డీ లభిస్తుంది.

700-999 రోజుల మధ్య మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై ఇప్పుడు 8 శాతం వడ్డీ రేటు వస్తుంది. అలాగే 1000- 1500 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 1501 రోజుల నుంచి 5 సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 7.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ మరియు పదేళ్ల వరకు ఉన్న డిపాజిట్లపై, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇప్పుడు 7.00 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ అన్ని వడ్డీ రేట్లపై సీనియర్ సిటిజన్లకు 0.60 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. అంటే 1000-1500 రోజుల డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు అధికంగా 8.85 శాతం వడ్డీ వస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..