AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI payments: యూపీఐ లావాదేవీలతో క్రెడిట్ కార్డులకు బైబై.. అసలు విషయం తెలిస్తే షాక్..!

ప్రస్తుత కాలంలో డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగిపోయాయి. రోడ్డు పక్కన ఉండే చిన్న బడ్డీ కొట్టు నుంచి ఫైవ్ స్టార్ హోటళ్ల వరకూ అన్నిచోట్లా ఇవి పనిచేస్తున్నాయి. చిల్లర సమస్య లేకపోవడం, చాలా ఈజీగా చెల్లింపులు జరగడంతో ప్రతి ఒక్కరూ ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ద్వారా స్మార్ట్ ఫోన్ ఉపయోగించి చాలా సులువుగా వీటిని జరపొచ్చు. ఈ నేపథ్యంలో యూపీఐ ద్వారా చెల్లింపులు జరిపే వారికి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. క్రెడిట్ కార్డు ద్వారా జరిపే చెల్లింపుల కంటే చౌకగా మార్చాలని ప్రయత్నిస్తోంది.

UPI payments: యూపీఐ లావాదేవీలతో క్రెడిట్ కార్డులకు బైబై.. అసలు విషయం తెలిస్తే షాక్..!
Credit Card Upi
Nikhil
|

Updated on: May 23, 2025 | 6:45 PM

Share

మన దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా ఎక్కువగా ఉంటుంది. నిర్ణీత ఆదాయం పొందే వారందరికీ వివిధ బ్యాంకులు వీటిని మంజూరు చేస్తున్నాయి. క్రెడిట్ కార్డులపై అనేక రాయితీలు కూడా ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది క్రెడిట్ కార్డుల ద్వారా షాపింగ్ చేస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరిపితే ఆ వ్యాపారుల నుంచి 2 నుంచి 3 శాతం మేర మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)ను వసూలు చేస్తారు. ఉదాహరణకు మీరు క్రెడిట్ కార్డు ఉపయోగించి వంద రూపాయల వస్తువు కొన్నారు. ఆ మేరకు వ్యాపారస్తుడికి డబ్బులు చెల్లించారు. ఆ లావాదేవీ కారణంగా వ్యాపారులు 2 నుంచి 3 రూపాయాలను ఎండీాఆర్ గా చెల్లించాలి. చాలా సందర్భాల్లో వ్యాపారులే ఆ ఖర్చును భరిస్తారు. కొందరైతే కొనుగోలుదారుడి నుంచే వసూలు చేస్తారు. కానీ యూపీఐ చెల్లింపుల ద్వారా అలాంటి చార్జీలు ఉండవు.

యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను నేరుగా కొనుగోలుదారుడికే అందించడానికి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక యంత్రాగాన్ని అన్వేషిస్తోంది. అది సక్రమంగా అమలైతే యూపీఐ యూజర్లకు మరింత ప్రయోజనం కలుగుతుంది. తద్వారా క్రెడిట్ కార్డుతో వంద రూపాయలతో కొనుగోలు చేసే వస్తువును యూపీఐ ద్వారా రూ.98కే పొందవచ్చు. దీని కారణంగా యూపీఐ లావాదేవీలు మరింత పెరిగే అవకాశం కలుగుతుంది. ఈ-కామర్స్ సంస్థలు, పేమెంట్ సేవా ప్రొవైడర్లు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ), ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్), వినియోగదారుల సంఘాలతో వినియోగదారుల మంత్రిత్వ శాఖ చర్యలు జరపనుంది. జూన్ లో జరిగే స్టేక్ హోల్డర్ల సమావేశం అనంతరం అమలయ్యే అవకాశం ఉంది.

కాాగా.. యూపీఐ లావాదేవీలు మరింత వేగంగా జరగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది జూన్ 16 నుంచి ఈ విధానం అమలవుతుంది. ప్రస్తుతం ఒక ట్రాన్సాక్షన్ పూర్తవ్వడానికి 30 సెకన్ల సమయం పడుతోంది. దాన్ని 15 సెకన్లలో జరిగేలా మార్పు చేయనున్నారు. మన దేశంలో యూపీఐ డిజిటల్ చెల్లింపులు శరవేగంగా పెరుగుతూ పోతున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో 185.85 బిలియన్ లావాదేవీలు జరిగాయి. గతేడాదిలో పోల్చితే దాదాపు 30 శాతం పెరగడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి