Union Govt. Expands Emergency Credit Line Guarantee Scheme: కరోనా మహమ్మారి కారణంగా వ్యాపారాలు దెబ్బతిని బ్యాంకులకు రుణాలు చెల్లించలేని చిన్న వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురందించింది. వారికి ది ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీం (ఈసీఎల్‌జీఎఎస్) అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకాన్ని ఆక్సిజన్ ఫ్లాంట్లను నెలకొల్పే ఆసుపత్రులకు విస్తరిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దాదాపు రూ.3 లక్షల కోట్ల రూపాయలతో ఈ స్కీమ్ ప్రవేశపెడుతున్నట్లు పేర్కొంది.
ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి నాలుగుసార్లు కేంద్రం విస్తరించింది. కనుక దీన్ని ఈసీఎల్జీఎస్ 4.0గా ఆర్థిక శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు ఈ పథకంలో ఉన్న రూ.500 కోట్ల రుణ పరిమితిని కూడా తొలగించింది. వ్యాపారులు తాము బ్యాంకుల్లో తీసుకున్న రుణాల్లో 40 శాతం గానీ, రూ.200 కోట్లు అదనంగా గానీ తీసుకోవచ్చు. ఈసీఎల్జీఎస్ 1.0 అర్హులైన వారు మరో 10 శాతం రుణం తీసుకునే వెసులుబాటు కేంద్రం కల్పించింది.
తాజాగా కేంద్రం తీసుకొచ్చిన మార్పుల్లో భాగంగా ఆసుపత్రులు, నర్సింగ్ హోంల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి, ఎంఎస్ఎంఈ రుణాల పునర్వ్యవస్థీకరణ, పౌర విమానయాన శాఖలకు ఈ పథకాన్ని విస్తరించింది. అంతే కాదు.. ఈ స్కీం గడువు సెప్టెంబర్ నెలాఖరు నుంచి డిసెంబర్ వరకు పొడిగించింది. ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఆసుపత్రులు తీసుకునే రూ.2 కోట్ల రుణాల వరకు ఇది వర్తిస్తుంది. ఈ రుణాలపై వడ్డీ 7.5 శాతం లోపే ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది.
Read Also… కరోనా చికిత్సకు రూ. 5 లక్షల పర్సనల్ లోన్.. ఏయే బ్యాంకులు ఇస్తున్నాయి.? ఎలా పొందాలంటే.!