Banks Privatization: ఆ బ్యాంకుల ప్రైవేటీకరణ తప్పదా.. కేంద్రం ఏమంటోందంటే..

|

Mar 19, 2022 | 10:23 AM

Banks Privatization: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం(Central Government) భావిస్తోంది. కానీ దీనికి అడ్డంకిగా ఉన్న 1949 నాటి బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టంలో కేంద్రం మార్పులు తెస్తోంది.

Banks Privatization: ఆ బ్యాంకుల ప్రైవేటీకరణ తప్పదా.. కేంద్రం ఏమంటోందంటే..
Banks Privatization
Follow us on

Banks Privatization: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం(Central Government) భావిస్తోంది. కానీ దీనికి అడ్డంకిగా ఉన్న 1949 నాటి బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టానికి ప్రస్తుతం కేంద్రం సవరణ చేయబోదోంది. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(Foreign Direct Investments) 20 శాతం మించి ఉండకూడదు. దీనికి సంబంధించి కేబినెట్ ముందుగా సవరణ ఆమోదానికి రానుంది. ఈ ఆర్థిక సంవత్సరం వాస్తవానికి రెండు పీఎస్‌బీల ప్రైవేటీకరణ ఈ ఆర్థిక సంవత్సరమే పూర్తి కావాల్సి ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, మార్కెట్‌ ఒడిదొడుకులు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల అనిశ్చితి కొనసాగుతున్నందున ఈ ప్రక్రియ ఆలస్యం అవుతోంది.

ఏ బ్యాంకులను కేంద్రం ప్రైవేటీకరిస్తుందన్న విషయాన్ని అధికారికంగా ప్రభుత్వం వెల్లడించలేదు. నీతి ఆయోగ్‌ సిఫారసు వివరాల ప్రకారం సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ లు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ రెండు బ్యాంకుల సిబ్బందికి త్వరలోనే వీఆర్‌ఎస్‌ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉద్యోగ సంఘాలు మాత్రం దీనిపై నేరుగా ప్రభుత్వంతోనే తెల్చుకుంటామంటున్నాయి. విషయం సమ్మెదాకా వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇవీ చదవండి..

Credit score: బ్యాడ్ క్రెడిట్ స్కోర్ వల్ల ఇన్ని నష్టాలా..! తప్పక తెలుసుకోండి..

Russian Crude Oil: ప్రపంచంలో ఎవరు తక్కువ ధరకు చమురు అమ్మినా కొంటాం: భారత్