Nirmala Sitharaman Budget 2024 LIVE: ఎన్నో ఆశలు.. భారీ అంచనాలు.. మోదీ 3.0 తొలి బడ్జెట్‌ లైవ్‌ అప్‌డేట్స్‌..

|

Jul 23, 2024 | 10:40 AM

Nirmala Sitharaman Speech Union Budget 2024 Live Updates: ఎన్నో ఆశలు, భారీ అంచనాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. లోక్‌సభలో 11.04 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభంకానుంది. వికసిత్‌ భారత్‌ లక్ష్యమంటున్న NDA సర్కార్‌.. ఇవాళ్టి యూనియన్‌ బడ్జెట్‌లో ఎలాంటి కీలక నిర్ణయాలు ప్రకటించబోతోంది. ఆర్థికరంగానికి ఊతమిచ్చేలా ఎలాంటి చర్యలుంటాయ్‌..? ట్యాక్స్‌ పేయర్స్‌కి వచ్చేదేంటి..? ధరల నియంత్రణకు ఏం చేస్తారు..! యువత, రైతులు, మహిళలకు కొత్తగా ఏం చేయబోతున్నారు..! అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.

Nirmala Sitharaman Budget 2024 LIVE: ఎన్నో ఆశలు.. భారీ అంచనాలు.. మోదీ 3.0 తొలి బడ్జెట్‌ లైవ్‌ అప్‌డేట్స్‌..
Budget 2024

LIVE NEWS & UPDATES

  • 23 Jul 2024 10:24 AM (IST)

    MSMEలకు చేయూత ఇచ్చేలా నిర్ణయాలకు ఛాన్స్

    • MSMEలకు చేయూత ఇచ్చేలా నిర్ణయాలకు ఛాన్స్
    • ట్యాక్స్‌పేయర్లు, మహిళలు, యువతకు ప్రాధాన్యత ఇస్తారని అంచనాలు
    • ఏటా 80 లక్షల కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రణాళిక
    • ట్యాక్స్‌ స్లాబ్స్‌లో మార్పులు ఉండొచ్చని సంకేతాలు
    • రూ.12-15 లక్షలు ఆదాయం ఉంటే ప్రస్తుతం 20 శాతం పన్ను… ఈ స్లాబ్‌లో పన్ను 10 శాతానికి తగ్గిస్తారా..?
    • బడ్జెట్‌పై పాజిటివ్‌గానే స్పందిస్తున్న స్టాక్‌మార్కెట్లు
  • 23 Jul 2024 10:12 AM (IST)

    ‘బాహీ ఖాటా’ బ్యాగ్‌ బదులు.. ఎర్రటి కవర్‌తో ఉన్న ట్యాబ్‌తో బడ్జెట్‌

    1. 11:04 నిమిషాలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్‌
    2. బడ్జెట్ ప్రవేశపెట్టే ట్యాబ్‌తో పార్లమెంట్‌కు చేరుకున్న ఆర్థికమంత్రి
    3. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం తర్వాత పార్లమెంట్‌కు నిర్మల సీతారామన్..
    4. కాసేపట్లో బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేంద్ర కేబినెట్‌
    5. ఈసారి కూడా పేపర్‌లెస్ బడ్జెట్‌.. ట్యాబ్‌తో వచ్చిన నిర్మలాసీతారామన్‌
    6. సంప్రదాయంగా వచ్చే ‘బాహీ ఖాటా’ బ్యాగ్‌ బదులు.. ఎర్రటి కవర్‌తో ఉన్న ట్యాబ్‌తో నిర్మల సీతారామన్ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

  • 23 Jul 2024 09:58 AM (IST)

    వరుసగా ఏడోసారి బడ్జెట్‌ సమర్పించనున్న నిర్మలా సీతారామన్

    • వరుసగా ఏడోసారి బడ్జెట్‌ సమర్పించనున్న నిర్మలా సీతారామన్
    • ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన కేంద్రం
    • మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌
  • 23 Jul 2024 09:41 AM (IST)

    రాష్ట్రపతిని కలవనున్న కేంద్ర మంత్రి

    • నార్త్‌ బ్లాక్ ఆర్ధిక శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
    • కాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్న కేంద్ర మంత్రి
    • బడ్జెట్ ప్రతులు అందించి అనుమతి తీసుకోనున్న నిర్మలా సీతారామన్
    • అనంతరం కేబినెట్ భేటీ, బడ్జెట్‌కి ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
    • లోక్‌సభలో 11.04 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం
    • ఏపీ, బీహార్, ఒడిశాకి బడ్జెట్ కేటాయింపులపై ఉత్కంఠ
    • ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న బిహార్, ఒడిశా
    • రాష్ట్రాభివృద్ధికి సహకారం అందించాలని కోరుతున్న ఏపీ
  • 23 Jul 2024 08:33 AM (IST)

    ఎలక్ట్రిక్‌ వాహనాలపై సబ్సిడీ..

    2030 నాటికి దేశంలో అమ్ముడయ్యే వాహనాల్లో 30 వాతం ఎలక్ట్రిక్‌వే ఉండాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ వాహనాలకు డిస్కౌంట్లు, వెసులుబాట్లూ కల్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈరోజు ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లో ఈవీల విస్తరణకు కేంద్రం సబ్సిడీల స్కీములు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


  • 23 Jul 2024 07:19 AM (IST)

    సరికొత్త రికార్డు..

    కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సరికొత్త రికార్డు నెలకొల్పనున్నారు. ఈరోజు ప్రవేశపెట్టనున్న బడ్జట్‌తో కలిపి మొత్తం వరుసగా ఏడు ఫుల్ టైమ్ బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఏకైక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ అరుదైన రికార్డును క్రియేట్ చేయనున్నారు.

  • 23 Jul 2024 06:54 AM (IST)

    3 గంటల పాటు ప్రసంగం..

    ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. మంత్రి ప్రసంగం ఏకంగా 2 నుంచి 3 గంటల పాటు సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మధ్యంతర బడ్జెట్‌ సమయంలో ఆమె తన ప్రసంగాన్ని కేవలం 87 నిమిషాలు మాత్రమే చేసింది. తాజాగా బడ్జెట్‌కు సంబంధించి సమగ్ర వివరాలు తెలియజేయనున్న నేపథ్‌యంలోనే బడ్జెట్‌ ప్రసంగం ఎక్కువ సేపు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

  • 23 Jul 2024 06:48 AM (IST)

    ఆ రాష్ట్రాలకు ప్రాధాన్యత ఉంటుందా.?

    ఎన్టీఏ కూటమి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ సారి బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదనే విషయం తెలిసిందే. దీంతో కూటమిలోని కొన్ని పార్టీలపై ఆధారపడాల్సి వచ్చింది. మరి ఇలాంటి తరుణంలో ప్రవేశ పెడుతోన్న బడ్జెట్‌లో కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఏమైనా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారా.? ఆయా రాష్ట్రాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేస్తారా.? అన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

Budget Session 2024 Parliament LIVE: నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. మరి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్‌ కావడతో సర్వత్రా ఉత్కంఠ నెలకొది. తమను మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలపై ఎలాంటి వరాలు కురిపించనున్నారన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

ఈ బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం ఎక్కువగా మౌలిక సదుపాయాలు, వ్యవసాయంపై దృష్టిసారించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం కిసాన్ యోజనకు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అలాగే పన్నుల శ్లాబుల విషయంలో కూడా ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ చూడండి..

బడ్జెట్ లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు టీవీ9లో చూడండి..

Follow us on