Budget 2022: ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ కేటాయింపులపై లోకల్ సర్కిల్స్ తాజాగా సర్వే నిర్వహించింది. బడ్జెట్‌పై ప్రజలు ఎలా స్పందించారనే దానిపై సర్వే చేపట్టింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుందని కొందరు భావిస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది బడ్జెట్‌లో ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ వ్యక్తిగత ఆదాయపు పన్నులో కొన్ని మార్పులు మాత్రమే జరిగాయని, పెద్దగా ఉపశమనం కలగలేదని పేర్కొన్నారు.
తాజాగా నిర్వహించిన సర్వేలో.. భారతదేశంలోని 342 జిల్లాలలో నివసిస్తున్న ప్రజల నుంచి స్పందన వచ్చింది. 40వేల కంటే ఎక్కువ ప్రతిస్పందనలను అందుకున్న ఈ సర్వే.. 24 శాతం మంది బడ్జెట్‌పై సానుకూలంగా స్పందించారు. మౌలిక సదుపాయాల పెరుగుదల నుంచి ఖర్చులను పెంచడం, ఉపాధి సృష్టించడం వరకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలుపగా, 42 శాతం మంది బడ్జెట్‌తో పురోగతి ఉంటుందని తెలిపారు.
అయితే బడ్జెట్‌పై రేటింగ్ విషయంలో 42 శాతం మంది యూనియన్ బడ్జెట్ 2022 అంచనాలకు మించి ఉందని సర్వే ద్వారా తేలింది. ఇక 56 శాతం మంది వ్యక్తగత పన్ను మినహాయింపులు పెద్దగా లేనట్లుగా చెప్పుకొచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి రూ.86,200.65 కోట్లు కేటాయించారు. 58 శాతం మంది ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ తీసుకురావడానికి మద్దతు ఇస్తుండగా, 54 శాతం మంది డిజిటల్ ఆస్తులపై 30 శాతం పన్ను విధించడాన్ని సమర్థిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: