Maruti Suzuki Offers: ఆ మారుతీ సుజుకీ కార్లపై ఆఫర్ల జాతర.. నమ్మలేని విధంగా భారీ తగ్గింపులు

|

Mar 19, 2024 | 7:30 PM

మధ్యతరగతి ప్రజల మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్‌గా మారుతీ సుజుకీ మారింది. తాజాగా మారుతీ సుజుకీ కంపెనీ అరేనా శ్రేణిలో మార్చిలో అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తుంది. నగదు తగ్గింపులతో పాటు ఎక్స్యేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్‌లను అందిస్తుంది. నిర్దిష్ట మోడల్, వేరియంట్, డీలర్‌షిప్ ఆధారంగా మీరు పొందే ఖచ్చితమైన తగ్గింపు మారుతూ ఉంటుంది.

Maruti Suzuki Offers: ఆ మారుతీ సుజుకీ కార్లపై ఆఫర్ల జాతర.. నమ్మలేని విధంగా భారీ తగ్గింపులు
Maruti Suzuki
Follow us on

సొంత కారు అనేది ప్రతి మధ్య తరగతి ఉద్యోగుల కల. ఈ కలను నెరవేర్చుకోవడానికి పొదుపు చేసిన సొమ్ముతో పాటు నెలవారీ చెల్లింపు పద్ధతిన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. భారతదేశంలో మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా మారుతీ సుజుకీ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. మధ్యతరగతి ప్రజల మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్‌గా మారుతీ సుజుకీ మారింది. తాజాగా మారుతీ సుజుకీ కంపెనీ అరేనా శ్రేణిలో మార్చిలో అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తుంది. నగదు తగ్గింపులతో పాటు ఎక్స్యేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్‌లను అందిస్తుంది. నిర్దిష్ట మోడల్, వేరియంట్, డీలర్‌షిప్ ఆధారంగా మీరు పొందే ఖచ్చితమైన తగ్గింపు మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ ఏయే కార్లపై తగ్గింపులను అందిస్తుందో? ఓ సారి తెలుసుకుందాం. 

ఆల్టో కే10

ఈ కారు 67 హెచ్‌పీ, 1.0-లీటర్ ఇంజిన్‌తో 5 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఏఎంటీ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంది. ముఖ్యంగా మారుతి ఆల్టో కే10కు సంబంధించిన ఏఎంటీ వేరియంట్‌లపై ప్రత్యేకంగా రూ. 45,000 వరకు గణనీయమైన ముందస్తు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. అలాగే మాన్యువల్ వేరియంట్‌లపై రూ. 40,000 నగదు తగ్గింపును అందిస్తుంది. అయితే రూ.7,000 కార్పొరేట్ తగ్గింపుతో పాటు రూ. 15,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ వంటి ఇతర ఆఫర్‌లు రెండు వేరియంట్‌లకు ఒకే విధంగా ఉంటాయి. ఆల్టో కే 10 సీఎన్‌జీ వేరియంట్‌ను ఎంచుకునే వారికి ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్‌లతో పాటుగా రూ. 25,000 నగదు తగ్గింపు ఆఫర్‌లో ఉంది.

ఎస్-ప్రెస్సో

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో గరిష్టంగా రూ. 66,000 వరకు తగ్గింపుతో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇందులో రూ. 45,000 నగదు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 6,000 కార్పొరేట్ తగ్గింపులు ఉన్నాయి. ఎంటీ వేరియంట్‌లు రూ. 40,000 తగ్గింపు నగదు తగ్గింపును అందిస్తాయి. ఎస్ ప్రెస్సో సీఎన్‌జీ వేరియంట్‌లు రూ. 25,000 నగదు తగ్గింపును పొందుతాయి.

ఇవి కూడా చదవండి

సెలెరియో

మారుతి సుజుకి సెలెరియో రూ. 61,000 వరకు గణనీయమైన తగ్గింపులను అందిస్తుంది. ఇందులో రూ. 40,000 ముందస్తు తగ్గింపుతో పాటు పాటు రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తుంది. ఈ పొదుపులు మారుతి సెలెరియోకు సంబంధించిన ఏఎంటీ వేరియంట్‌లకు వర్తిస్తాయి. సెలెరియోకు సంబంధించిన ఎంటీ వేరియంట్‌ను ఎంచుకుంటే రూ. 35,000 నగదు తగ్గింపును అందిస్తోంది అలాగే సెలెరియో సీఎన్‌జీ మోడల్ రూ. 25,000 నగదు తగ్గింపుతో పాటు స్థిరమైన ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్‌లను అందిస్తున్నారు. 

వ్యాగన్ ఆర్ 

మారుతి వ్యాగన్ ఆర్ కారుపై రూ. 66,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ. 40,000 నగదు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ , రూ. 5,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ పాటు రూ.6 వేలు కార్పొరేట్ తగ్గింపులు ఉన్నాయి. ఈ తగ్గింపులు వ్యాగన్ ఆర్‌కు సంబంధించిన ఏఎంటీ వేరియంట్‌లకు మాత్రమే వర్తిస్తాయి. మారుతి ట్రేడ్ చేసే కారు ఏడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉంటే మాత్రమే అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తుంది. మాన్యువల్ వేరియంట్‌ల కోసం రూ. 35,000 నగదు తగ్గింపు అందుబాటులో ఉంది అయితే సీఎన్‌జీ వేరియంట్‌పై రూ. 30,000 తగ్గింపులను అందిస్తన్నారు. 

స్విఫ్ట్

మారుతి స్విఫ్ట్ ఏఎంటీ వేరియంట్‌లు రూ. 20,000 నగదు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 7,000 కార్పొరేట్ తగ్గింపుతో వస్తాయి. ఈ కారు మాన్యువల్ వేరియంట్‌లపై రూ. 15,000 నగదు తగ్గింపు అందిస్తుంది. స్విఫ్ట్ సీఎన్‌జీ వేరియంట్‌పై ఎటువంటి నగదు తగ్గింపు లేకుండా రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 7,000 కార్పొరేట్ తగ్గింపుతో అందిస్తున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..