Uber Buses: ఉబెర్‌ నుంచి ట్యాక్సీలే కాదు ఇక బస్సులు కూడా.. సర్వీస్ ప్రొవైడర్ కీలక నిర్ణయం

టాక్సీ సర్వీస్ ప్రొవైడర్ దిగ్గజం ఉబెర్ కూడా బస్సులను నడిపేందుకు లైసెన్స్ పొందింది. త్వరలో ఉబెర్‌ యాప్‌లో టాక్సీ-ఆటోతో పాటు బస్సును బుక్ చేసుకోవచ్చు. ఉబెర్ ఢిల్లీ రవాణా శాఖ నుండి ఈ అగ్రిగేటర్ లైసెన్స్‌ని పొందింది. ఉబెర్ ఢిల్లీ ప్రీమియం బస్ స్కీమ్ కింద దేశ రాజధానిలో తన సేవలను ప్రారంభించనుంది. ఉబర్ షటిల్ ఇండియా అధినేత..

Uber Buses: ఉబెర్‌ నుంచి ట్యాక్సీలే కాదు ఇక బస్సులు కూడా.. సర్వీస్ ప్రొవైడర్ కీలక నిర్ణయం
Uber Buses

Updated on: May 20, 2024 | 8:22 PM

టాక్సీ సర్వీస్ ప్రొవైడర్ దిగ్గజం ఉబెర్ కూడా బస్సులను నడిపేందుకు లైసెన్స్ పొందింది. త్వరలో ఉబెర్‌ యాప్‌లో టాక్సీ-ఆటోతో పాటు బస్సును బుక్ చేసుకోవచ్చు. ఉబెర్ ఢిల్లీ రవాణా శాఖ నుండి ఈ అగ్రిగేటర్ లైసెన్స్‌ని పొందింది. ఉబెర్ ఢిల్లీ ప్రీమియం బస్ స్కీమ్ కింద దేశ రాజధానిలో తన సేవలను ప్రారంభించనుంది. ఉబర్ షటిల్ ఇండియా అధినేత అమిత్ దేశ్‌పాండే మాట్లాడుతూ.. ఈ లైసెన్స్‌ను పొందిన తొలి కంపెనీగా తాము నిలిచామని, త్వరలో ఉబెర్ తన బస్ సర్వీస్ ఉబర్ షటిల్‌ను ఢిల్లీలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఇటీవల ప్రయోగాత్మక కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. విజయవంతమైన తర్వాత ఉబర్ షటిల్ కింద అధికారికంగా బస్సు సర్వీస్‌ను ప్రారంభించబోతున్నామని అన్నారు. Uber యాప్‌లో అందుబాటులో ఉన్న Uber షటిల్ ఎంపికను ఎంచుకోవడం ద్వారా వినియోగదారులు ఈ బస్సుల్లో తమకు ఇష్టమైన సీట్లను బుక్ చేసుకోవచ్చన్నారు.

రోజువారీ ప్రయాణికుల సౌకర్యార్థం ఉబెర్ ఈ బస్సు సర్వీసును సిద్ధం చేసింది. ఆఫీసుకు వెళ్లేవారు ఈ తరహా బస్సు సర్వీసులను చాలా ఇష్టపడతారు. దీని ప్రయోగాత్మక పరీక్ష ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో జరిగింది. దీనిని ప్రజలు చాలా ఇష్టపడ్డారు. కోల్‌కతాలో ఉబెర్ షటిల్ సర్వీస్ గతేడాది నుంచి అందుబాటులోకి వచ్చింది. ఉబెర్-పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఈ సేవ ప్రారంభించింది. ఈ సేవలు విజయవంతమైన దేశ వ్యాప్తంగా అమల్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు కొనసాగుతాయని ఉబెర్‌ సంస్థ తెలిపింది.

ఉబర్ బస్సుల్లో ఈ ఫీచర్లు:

ప్రజలు ఒక వారం ముందుగానే ఉబర్ షటిల్ బస్సులలో తమ సీట్లను బుక్ చేసుకోవచ్చు. ఇందులో బస్సుల లైవ్ లొకేషన్, రూట్ సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది. గమ్యం చేరే సమయం కూడా కనిపిస్తుంది. ఒక్కో బస్సులో 19 నుంచి 50 మంది వరకు ప్రయాణించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి