
ప్రపంచ వ్యాప్తంగా ఈవీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో భారతదేశంలో కూడా ఈవీ వాహనాలను ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ ఈవీ వాహనాల్లో కార్లు, బైక్‌లతో పోల్చుకుంటే ఈవీ స్కూటర్లు ప్రజలు భారతదేశంలో ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఫీచర్లతో రైడింగ్ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో రావడంతో వీటి కొనుగోలుకు ఆసక్టి చూపుతున్నారు. అయితే ఈవీ స్కూటర్స్ రెండు మోడల్స్ మాత్రం ఈవీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల కాలంలో ఓలా ఎలక్ట్రిక్ అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటి. ప్రస్తుతం ఋ బ్రాండ్ విక్రయిస్తున్న ఫ్లాగ్లిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్ 1 ప్రో. ఎస్1 ప్రోకి ప్రధాన ప్రత్యర్థి ఏథర్ 450 ఎక్స్ నిలిచింది. ఇది భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. కాబట్టి ఇక్కడ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల మధ్య ఉన్న ఫీచర్లు, వ్యత్యాసాల గురించి ఓ సారి తెలుసుకుందాం.
లుక్స్ పరంగా రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు వాటి డిజైన్ కారణంగా వెంటనే గుర్తించవచ్చు. ఓలా ఎస్ 1 ప్రో చూడడానికి పెద్దదిగా కనిపిస్తుంది. అలాగే వృత్తాకార హెర్ల్యాంప్ డిజైన్‌తో వస్తుంది. ఇతర బ్రాండ్స్ నుంచి వేరు చేసేలా ఈ స్కూటర్ ఉంటుంది. ఏథర్ చూడడానికి చిన్నదిగా ఉంటుంది. అయితే స్టైలిష్ డిజైన్ కారణంగా ఓలా కంటే ఏథర్ 450 ఎక్స్ స్పోర్టివ్‌గా
ఓలా ఎస్1 ప్రోలో 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది ఎకో, నార్మల్ మోడ్‌లో ట్రూ రేంజ్ ని అందించగలదు. ఏథర్ 450 ఎక్స్ 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులో ఉంటుంది.
ఓలా ఎస్1 తో పాటు ఏథర్ 450 ఎక్స్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 110 కిమీ వరకు పరిధిని అందిస్తాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు అధునాతన ఫీచర్లతో లోడ్ చేశారు. రెండూ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు మొబైల్ అప్లికేషన్స్, బ్లూటూత్ కనెక్టివిటీ అందిస్తాయి. ఏథర్ ఏథర్ స్టాక్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుండగా, ఓలా మూవ్ ఎస్ ఆధారంగా పని చేస్తుంది. ఏథర్ 450 ఎక్స్ యూజర్ ఇంటర్ ఫేస్ చుట్టూ నావిగేట్ చేయడానికి ఉపయోగించే జాయ్ స్టిక్ కూడా వస్తుంది.
ఓలా ఎస్ 1 ప్రో గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. అలాగే 0-40 కిలో మీటర్లను కేవలం 2.6 సెకన్లలో అందుకుంటుంది. అయితే ఏథర్ 450 ఎక్స్ గంటకు 90 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్తుంది. అలాగే 3.3 సెకన్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే ధర విషయానికి వస్తే ఓలా ఎస్1 ప్రో ధర రూ.1.30 లక్షలుగా ఉంటే ఏథర్ 450 ఎక్స్ ధర రూ.1.29 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి