Triton Electric Car: భారత్‌లో భారీ ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్ధమైన ట్రైటాన్‌.. అమెరికా తర్వాత ఇండియాలోనే..

|

Mar 12, 2021 | 5:18 PM

Triton Electric Car: అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ ట్రైటాన్‌ భారత్‌లో భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కంపెనీ తన అనుబంధ సంస్థను భారత్‌లో రిజిస్టర్‌ చేయించింది. దీంతో భారత్‌లో భారీ ఎత్తున ఉద్యోగాలు రానున్నాయని సంస్థ చెబుతోంది...

Triton Electric Car: భారత్‌లో భారీ ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్ధమైన ట్రైటాన్‌.. అమెరికా తర్వాత ఇండియాలోనే..
Triton Register Unit In Ind
Follow us on

Triton Electric Car: అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ ట్రైటాన్‌ భారత్‌లో భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కంపెనీ తన అనుబంధ సంస్థను భారత్‌లో రిజిస్టర్‌ చేయించింది. దీంతో భారత్‌లో భారీ ఎత్తున ఉద్యోగాలు రానున్నాయని సంస్థ చెబుతోంది.
అమెరికాలోకి న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న ట్రైటాన్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ కంపెనీ భారత్‌లో.. ట్రైటాన్‌ వెహికల్స్‌ ఇండియా ప్రై.లి సంస్థ ద్వారా కార్యకలపాలు చేపట్టడానికి సిద్ధమవుతోంది. అమెరికా తర్వాత ‘ట్రైటాన్‌ ఈవీ’ కార్ల తయారీ హబ్‌గా భారత్‌ను మార్చాలనే లక్ష్యంతోనే ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు సంస్థ తెలిపింది. భారత్‌లో ఏర్పాటు చేయనున్న తయారీ ప్లాంట్‌ ద్వారా బంగ్లాదేశ్‌, శ్రీలంక, నేపాల్‌, మధ్య ప్రాచ్చదేశాలు, ఆఫ్రికా వంటి దేశాలకు కార్లను ఎగుమతి చేయడానికి కంపెనీ సిద్ధమవుతోంది. అయితే ఈ భారీ ప్రాజెక్టు కోసం ట్రైటాన్‌ ఎంత ఖర్చు పెట్టనుంది.? ఎక్కడ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది? లాంటి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే భారత్‌లో ఏర్పాటు చేయనున్న ఈ భారీ ప్లాంట్‌ ద్వారా రానున్న మూడేళ్లలో సుమారు 20 వేలకి పైగా ఉద్యోగాలు లభిస్తాయని ట్రైటాన్‌ ఈవీ వ్యవస్థాపకులు, సీఈఓ హిమాన్షు బి.పాటిల్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భారత మార్కెట్‌ మాకు ఎంతో ముఖ్యమైంది. ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తోంది. దేశీయ రహదారులతో పాటు ప్రపంచంలోని చాలా ప్రాంతాలకు ఈవీలు అనువుగా ఉంటాయి’ అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విద్యుత్‌తో నడిచే వాహనాలకు బాగా డిమాండ్‌ పెరుగుతోంది. ప్రభుత్వాలు కూడా ఈ కార్ల తయారీకి రాయితీలు ప్రకటిస్తుండడంతో బడా కంపెనీలూ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీకి మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ కార్ల కంపెనీ ‘టెస్లా’ కూడా విద్యుత్‌ ఆధారంగా నడిచే కార్లను తయారు చేస్తోన్న విషయం తెలిసిందే.

Triton Electric Car

Also Read: Second Hand Bikes: సెకండ్ హ్యాండ్ బైక్‌లు కొనాలని చూస్తున్నారా? అలాంటి వారికోసమే ఈ సరికొత్త సమాచారం..

Petrol Price Today: స్వల్ప హెచ్చు, తగ్గులతో కొనసాగుతోన్న పెట్రోల్‌, డీజీల్‌ ధరలు.. ఇదే ట్రెండ్ ఎంతకాలం..?

Honda CB350 RS: భారత్‌లో మొదలైన హోండా కొత్త బైక్‌ డెలివరీలు.. రూ.2 లక్షల బైక్‌ ఫీచర్స్‌ తెలిస్తే..