కొన్ని సార్లు పొరపాటున బ్యాంక్ ఖాతాకు డబ్బును బదిలీ చేసినప్పుడు, కొన్నిసార్లు తప్పు ఖాతా నంబర్‌కు డబ్బు పంపే అవకాశం ఉంటుంది (మనీ ట్రాన్స్‌ఫర్డ్ టు రాంగ్ అకౌంట్) . ఇలాంటి ఉదంతాలు గతంలో చాలానే ఉన్నాయి. తద్వారా ప్రజలు తప్పుగా పంపిన డబ్బును తిరిగి పొందేందుకు ఇబ్బందులు పడుతున్నారు . అయినా డబ్బులు తిరిగి రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. బ్యాంకును సంప్రదించడం లేదా ఖాతాదారుని సంప్రదించినా కొన్నిసార్లు డబ్బు తిరిగి రాదు. ఎస్‌బీఐకి చెందిన ఓ కస్టమర్ ఈ విషయంపై సోషల్ మీడియాలో తన వాదన వినిపించారు. ‘నేను పొరపాటున మరొక ఖాతాకు డబ్బు పంపాను. నేను బ్యాంకుకు అన్ని వివరాలు ఇచ్చాను. అయితే వాపసు గురించి నాకు ఎలాంటి సమాచారం అందలేదు. దయచేసి సహాయం చేయండి’ అంటూ రవి అగర్వాల్ అనే వ్యక్తి వరుస ట్వీట్లు చేశారు . దీనికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోషల్ మీడియాలో ఫీడ్‌బ్యాక్ రూపంలో ఈ విషయంలో కొన్ని సూచనలను అందించింది. పొరపాటున మరొక ఖాతాకు డబ్బు బదిలీ అయినప్పుడు ఏమి చేయాలో వివరాలు ఇక్కడ ఉన్నాయి.
మీరు పొరపాటున మరొక బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపినట్లయితే మీరు మీ ఖాతా ఉన్న బ్రాంచ్ కార్యాలయాన్ని సంప్రదించాలి. అప్పుడు అది డబ్బు పంపిన వ్యక్తి ఖాతా బ్యాంకును సంప్రదించి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.
మీరు పొరపాటున మరొక ఖాతాకు నగదు బదిలీ చేస్తే బ్యాంకు బాధ్యత వహించదు. మీరు ఖాతా ఉన్న బ్యాంక్ బ్రాంచ్ ఆఫీస్‌ను సంప్రదిస్తే, వారు డబ్బును తిరిగి తీసుకురావడానికి ప్రయత్నించవచ్చు. మీరు డబ్బు పంపిన వ్యక్తిని సంప్రదించి వారికి విజ్ఞప్తి చేయడం ద్వారా డబ్బును తిరిగి పొందే మార్గం ఉంది.
Please note that if wrong account number of the beneficiary is mentioned by the customer, Home Branch of the customer will initiate follow up processes with other Bank(s) without any pecuniary liabilities. If you are facing any issue in this regard at the branch, then (1/2)
— State Bank of India (@TheOfficialSBI) June 22, 2023
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి