
ప్రస్తుతం మార్కెట్ లో ఏదైనా కొత్తగా వాహనం లాంచ్ అయ్యింది అంటే ఎక్కువ శాతం ఎలక్ట్రిక్ దే అయి ఉంటుంది. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ అదే కనుక అన్ని కంపెనీలు తమ తమ ఉత్పత్తులను ఎలక్ట్రిక్ వేరియంట్లలోనే విడుదల చేస్తున్నాయి. కార్లు, బైక్ లు ఈ జాబితాలో అధికంగా ఉంటున్నాయి. ఇదే క్రమంలో టోర్క్ మోటార్స్ తన కొత్త టోర్క్ క్రటోస్ ఎక్స్(Tork Kratos X ) అనే ఎలక్ట్రిక్ మోటార్‌బైక్‌ని ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించింది. ఈ బైక్ వివరాలు తెలుసుకుందాం..
ఈ క్రటోస్ ఎక్స్ బైక్ Kratos R డిజైన్ ను ఆధారంగా చేసుకొని రూపొందించారు. దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్, FF మోడ్, కొత్త అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో కస్టమర్ టెస్ట్ రైడ్‌లు ప్రారంభం కానున్నాయి. జూన్ నుంచి డెలివరీలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
కొత్త Tork Kratos X సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్, నావిగేషన్ సదుపాయం కలిగి ఉంది. డిస్‌ప్లే ఇన్‌స్ట్రుమెంటేషన్ తో పాటు ఈ బైక్‌లో అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
టోర్క్ మోటార్స్ గత సంవత్సరం భారతదేశంలో టోర్క్ క్రటోస్ పేరుతో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను పరిచయం చేసింది. రెండు మోడళ్లను విడుదల చేసింది. స్టాండర్డ్ మోడల్ టోర్క్ క్రటోస్ రూ. 1.08 లక్షలు, క్రటోస్ ఆర్ రూ. 1.23 లక్షలకు (ఎక్స్-షోరూమ్, పూణే) విక్రయిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..