
స్ట్రాంగ్ డిస్ ప్లేలు, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్, హెల్త్ మానిటరింగ్ వంటి ముఖ్యమైన ఫీచర్లతో ఇవి రోజువారీ అవసరాలకు అనుగుణంగా తయారయ్యాయి. AMOLED స్క్రీన్ లు, వాటర్ రెసిస్టెన్స్, ఎక్కువ కాలం ఉండే బ్యాటరీ వంటివి కూడా వీటిలో ఉన్నాయి. ముఖ్యంగా మార్కెట్ లో మంచి పేరున్న బ్రాండ్ ల నుంచే ఈ వాచ్ లు లభిస్తున్నాయి.
ఇప్పుడు స్టైల్, ఫంక్షనాలిటీ రెండింటినీ కలిపి, బడ్జెట్ ధరలో ఉండే టాప్ 10 బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ ల గురించి తెలుసుకుందాం. టాప్ 10 బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ లు అది కూడా ₹5000 లోపు ధరలో..
ఈ వాచ్ ప్రత్యేకమైన ఆక్స్-కట్ బిజెల్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. 1.43 అంగుళాల AMOLED స్క్రీన్ మీద వీడియోలు, సమాచారం స్పష్టంగా కనిపిస్తుంది. స్టెయిన్ లెస్ స్టీల్ బాడీ, బ్లూటూత్ కాలింగ్, Noise హెల్త్ ఫీచర్లు, జెస్చర్ కంట్రోల్ లతో ఇది ఒక్క ఛార్జ్ తో 7 రోజులు పనిచేస్తుంది.
వినియోగదారుల స్పందన.. స్టైలిష్ లుక్, డయల్ కంట్రోల్, మంచి కాల్ క్లారిటీ బాగున్నాయి.
ఎందుకు ఎంచుకోవాలి..? డిజైన్, స్క్రీన్ క్లారిటీ, బ్యాటరీ లైఫ్ బాగున్నాయి.
ఫాస్ట్‌ట్రాక్ వివిడ్ ప్రో స్మార్ట్‌వాచ్ ₹5,000 లోపు బ్రాండెడ్ వాచ్ లలో మంచి ఆప్షన్. ఇది 1.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. దీని 466 x 466 పిక్సెల్ రిజల్యూషన్ స్పష్టమైన, స్టైలిష్ విజువల్స్‌ను అందిస్తుంది.
కస్టమర్‌లు దీని ప్రీమియం డిజైన్, క్రౌన్ నావిగేషన్, కాల్ క్లారిటీ, ఆరోగ్య ఫీచర్లను ప్రశంసిస్తున్నారు. రోజువారీ, ప్రొఫెషనల్ అవసరాలకు ఇది సరైనదని చెబుతున్నారు.
ఎందుకు ఎంచుకోవాలి..?
దీని ఆకర్షణీయమైన మెటాలిక్ డిజైన్, క్రౌన్ డయల్ కంట్రోల్, ఆరోగ్య ట్రాకింగ్ ఫీచర్లు బడ్జెట్ ధరలో లభిస్తున్నందున ఈ స్మార్ట్ వాచ్ ను ఎంచుకోవచ్చు.
₹5000 లోపు బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ లలో రెడ్‌మీ వాచ్ 5 యాక్టివ్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది 2-అంగుళాల పెద్ద HD డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే, 3-మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్న బలమైన బ్లూటూత్ కాలింగ్ దీని ప్రత్యేకత. మెటల్ తో తయారు చేసిన రగ్గడ్ సూపర్-గ్లాస్‌తో వచ్చిన ఇది చాలా మన్నికైనది. 470 mAh బ్యాటరీతో 18 రోజుల వరకు స్టాండ్‌బై టైమ్ లభిస్తుంది.
ఈ ధరలో దీని ఎక్కువ బ్యాటరీ లైఫ్, స్పష్టమైన డిస్‌ప్లే, నమ్మదగిన కాల్ క్వాలిటీ, ఫిట్ నెస్ ట్రాకింగ్ ను కస్టమర్‌లు చాలా ఇష్టపడుతున్నారు.
boAt Ultima Ember
బోట్ అల్టిమా ఎంజర్ ₹5000 లోపు లభించే ఒక స్టైలిష్ బ్రాండెడ్ స్మార్ట్ వాచ్. ఇది ఆకట్టుకునే 1.96-అంగుళాల AMOLED డిస్‌ప్లే, ఫంక్షనల్ క్రౌన్ కంట్రోల్, ఇంకా 100కు పైగా స్పోర్ట్స్ మోడ్ లతో వస్తుంది.
కస్టమర్ లు దీని స్పష్టమైన స్క్రీన్, క్రౌన్ కంట్రోల్, వర్కౌట్ ట్రాకింగ్, స్టైలిష్ డిజైన్ ను మెచ్చుకుంటున్నారు. ఇది డబ్బుకు తగ్గ విలువను ఇస్తుందని చెబుతున్నారు.
ఎందుకు ఎంచుకోవాలి..?
దీని పెద్ద AMOLED డిస్‌ప్లే, క్రౌన్ కంట్రోల్, ఫిట్ నెస్ ట్రాకింగ్, స్టైలిష్ లుక్ కోసం ఈ స్మార్ట్ వాచ్ ను ఎంచుకోవచ్చు.
ఫైర్-బోల్ట్ 4G ప్రో పూర్తి ఫీచర్లతో కూడిన బ్రాండెడ్ స్మార్ట్ వాచ్. ఇది 4G VoLTE కాలింగ్, స్టాండలోన్ GPS ఫీచర్లతో వస్తుంది. 2.02-అంగుళాల HD డిస్‌ప్లే స్పష్టమైన విజువల్స్ ను అందిస్తుంది. దీంట్లో హార్ట్ రేట్, SpO2, SOS అలారం వంటి ఫీచర్లు ఉన్నాయి. 400 mAh బ్యాటరీ, రగ్గడ్ డిజైన్, IP67 వాటర్ రెసిస్టెన్స్ దీనిని అవుట్ డోర్ వాడకానికి అనుకూలంగా మారుస్తాయి. ఫోన్ లేకుండానే కాల్స్ చేయాలనుకునే, నావిగేషన్ కావాలనుకునే యాక్టివ్ యూజర్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది.
యూజర్లు దీని నమ్మదగిన 4G కాలింగ్, GPS ట్రాకింగ్, బలమైన ఆరోగ్య ఫీచర్లు, మన్నికను హైలైట్ చేస్తున్నారు. అవుట్ డోర్ వాడకానికి ఇది చాలా బాగుందని చెబుతున్నారు.
ఎందుకు ఎంచుకోవాలి..?
స్వతంత్రంగా 4G కాల్స్ చేసుకోవడానికి, అంతర్నిర్మిత GPS, బలమైన నిర్మాణం, పూర్తి ఆరోగ్య ట్రాకింగ్ కోసం ఈ స్మార్ట్ వాచ్ ను ఎంచుకోవచ్చు.
1.43 అంగుళాల AMOLED డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, AI వాయిస్ అసిస్టెంట్, స్ట్రెస్ ట్రాకింగ్ వంటి ఫీచర్లతో ఇది ప్రొఫెషనల్స్ కు మంచి ఎంపిక. అల్యూమినియం బాడీ, మెష్ స్టైల్ బెల్ట్, 7 రోజుల బ్యాటరీ లైఫ్ దీని ప్రత్యేకతలు.
యూజర్ల అభిప్రాయం.. లుక్, AI ఫీచర్లు, బ్యాటరీ లైఫ్ బాగున్నాయి.
ఎందుకు ఎంచుకోవాలి..?
స్టైలిష్ డిజైన్, రోజువారీ ప్లానింగ్ కు ఇది చక్కటి ఎంపిక.
ఈ వాచ్ సన్నని 36mm AMOLED డిస్‌ప్లే, రోజ్ గోల్డ్ లింక్ బెల్ట్ తో మహిళల ఫ్యాషన్ కు తగిన స్టైల్ ను అందిస్తుంది. బ్లూటూత్ కాలింగ్, హెల్త్ ఫీచర్లు, AI అసిస్టెంట్ తో ఇది స్టైలిష్ స్మార్ట్ వాచ్.
యూజర్ల అభిప్రాయం.. లుక్, Menstrual cycle ట్రాకింగ్ బాగున్నాయి. బ్యాటరీ మరింత బెటర్ అయితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
ఎందుకు ఎంచుకోవాలి..?
స్టైలిష్ లుక్, మహిళల ఆరోగ్య ట్రాకింగ్ కోసం.
1.43 అంగుళాల AMOLED డిస్ ప్లే, SOS అలర్ట్స్, మ్యూజిక్ కంట్రోల్, స్పోర్ట్స్ మోడ్ లు ఇందులో ఉన్నాయి. స్పోర్ట్స్ లవర్స్, ఫిట్ నెస్ ప్రియులకు ఇది సరైన ఎంపిక.
యూజర్ల అభిప్రాయం.. స్క్రీన్ క్లారిటీ, SOS, స్టైలిష్ లుక్ బాగున్నాయి.
ఎందుకు ఎంచుకోవాలి..?
యాక్టివ్ లైఫ్ స్టైల్ కు సరిపోయే వాచ్ కావాలంటే ఇది ఉత్తమం.
ఈ వాచ్ రెట్రో డిజైన్ తో వస్తుంది. 1.43 అంగుళాల AMOLED స్క్రీన్, మెటాలిక్ బాడీ దీనికి ఉన్నాయి. బ్లూటూత్ కాలింగ్, జెస్చర్ కంట్రోల్, 100+ వర్కౌట్ మోడ్ లు ఇందులో ఉన్నాయి.
యూజర్ల అభిప్రాయం.. కాలింగ్, స్టైల్, బ్యాటరీపై మంచి స్పందన ఉంది.
ఎందుకు ఎంచుకోవాలి..?
క్లాసిక్ లుక్, మంచి ఫంక్షనాలిటీ ఉండే వాచ్ కోసం.
HAMMER ఫిట్ ప్రో స్మార్ట్‌వాచ్ 1.43-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే, మెటల్ ఫ్రేమ్ తో బలమైన మన్నికను అందిస్తుంది. బ్లూటూత్ కాలింగ్, SOS అలారం, వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
యూజర్ల అభిప్రాయం.. స్ట్రాంగ్ బిల్డ్, స్పష్టమైన స్క్రీన్, మెరుగైన కాల్ క్లారిటీ బాగున్నాయి.
ఎందుకు ఎంచుకోవాలి..?
అవుట్ డోర్ యూజర్లకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
అవును ఖచ్చితంగా చేస్తాయి. ఈ ధరలో చాలా బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ లలో ఇప్పుడు బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంది. నేరుగా వాచ్ నుంచే మీరు కాల్ చేయవచ్చు అందుకోవచ్చు. కాల్ క్లారిటీ వాచ్ మోడల్ ను బట్టి మారుతుంది. అయితే Noise, boAt లాంటి ప్రముఖ బ్రాండ్లు మంచి మైక్, స్పీకర్ క్వాలిటీని అందిస్తున్నాయి. ఇవి రోజువారీ వాడకానికి సరిపోతాయి.
ఈ విభాగంలో ఎక్కువ బ్రాండెడ్ వాచ్‌లు IP67 లేదా IP68 రేటింగ్ తో వస్తాయి. అంటే అవి నీటి చుక్కలకు, వర్కౌట్ చేసేటప్పుడు వచ్చే చెమటకు నిరోధకంగా ఉంటాయి. చేతులు కడిగేటప్పుడు, మామూలు వర్షంలో వీటిని వాడినా ఇబ్బంది ఉండదు. అయితే ఇవి స్విమ్మింగ్ కు, నీటిలో ఎక్కువసేపు ఉండే పనులకు సరిపోవు. ఉత్పత్తి వివరాల్లో ప్రత్యేకంగా చెప్పినప్పుడు మాత్రమే వీటిని నీటిలో వాడాలి.
వాచ్ మోడల్ ను బట్టి బ్యాటరీ లైఫ్ మారుతుంది. కానీ ₹5000 లోపు బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ లలో చాలా వరకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 5 నుంచి 10 రోజుల వరకు పనిచేస్తాయి. బ్లూటూత్ కాలింగ్ ఎక్కువగా వాడితే బ్యాటరీ త్వరగా అయిపోతుంది. AMOLED డిస్‌ప్లే, పవర్ సేవింగ్ చిప్ లు ఉన్న మోడల్స్ స్టాండ్ బైలో ఎక్కువ కాలం పనిచేస్తాయి.