Gold Price Today(10-01-2021): పసిడి ప్రియులకు శుభవార్త .. డాలర్ బలపడటంతో దిగివస్తున్న బంగారం ధర

|

Jan 10, 2021 | 10:39 AM

పసిడి ప్రియులకు శుభవార్త .. ఆల్ టైం రికార్డ్ స్థాయిలో పెరిగిన బంగారం ధర మెల్లగా దిగివస్తుంది. గోల్డ్ కాస్ట్ లో శనివారం భారీ తగ్గుదల కనబరిచింది. దీంతో ఆదివారం మార్కెట్లు తగ్గుదలతో

Gold Price Today(10-01-2021): పసిడి ప్రియులకు శుభవార్త .. డాలర్ బలపడటంతో దిగివస్తున్న బంగారం ధర
Follow us on

Gold Price Today(10-01-2021): పసిడి ప్రియులకు శుభవార్త .. ఆల్ టైం రికార్డ్ స్థాయిలో పెరిగిన బంగారం ధర మెల్లగా దిగివస్తుంది. గోల్డ్ కాస్ట్ లో శనివారం భారీ తగ్గుదల కనబరిచింది. దీంతో ఆదివారం మార్కెట్లు తగ్గుదలతో ప్రారంభం అయ్యాయి. బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతొ పోలిస్తే భారీగా తగ్గాయి. బంగారం ధరలు ఆదివారం తగ్గుదల కనబరిచాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర పడిపోవడంతో .. మన దేశంలో కూడా బంగారం ధర దిగివస్తుంది. బంగారం ధర తన కీలక మార్క్ రూ.48 వేల నుంచి కిందకు జారింది. సురక్షితమైన కమోడిటీస్‌‌లో మళ్లీ డాలర్ పుంజుకోవడంతో గోల్డ్ దిగొస్తోంది. మల్టి కమోడిటీ ఎక్స్చేంజ్‌‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ఫిబ్రవరి నెలవి రూ.2,086 మేర తగ్గి 10 గ్రాముల ధర రూ.48,818గా నమోదైంది. విదేశాల్లో కూడా స్పాట్ గోల్డ్ సుమారు 4 శాతం తగ్గి ఒక ఔన్స్‌‌కు 1,833.83 డాలర్లకు పడిపోయింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 4.1 శాతం డౌన్ అయి 1,835.40 వద్ద సెటిలయ్యింది.కాగా రిటైల్ మార్కెట్‌‌లో కూడా బులియన్ ధరలు నేల చూపులే చూస్తున్నాయి.

కరోనాతో పెట్టుబడిదారులందరూ బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించడంతో.. గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్‌‌ టైమ్ హై రూ.56,191కు చేరాయి. ఈ ఏడాది సుమారు 43 శాతం మేర ధరలు పెరిగాయి. అయితే కరోనా వ్యాక్సిన్ వస్తుందనే అంచనాలతో గోల్డ్ ధరలు మళ్లీ దిగొస్తున్నాయి. 2020 ఆగస్ట్‌‌లో నమోదైన రికార్డు లెవెల్స్ నుంచి 13 శాతం మేర ధరలు తగ్గాయి. డాలర్ బలపడటం, తాజాగా మరోమారు స్టిమ్యులస్ ప్యాకేజీలు వస్తాయనే అంచనాలతో బంగారం ధర మరింత తగ్గనున్నదని తెలుస్తోంది. ఎన్నో ఏళ్ల కనిష్ట స్థాయిల నుంచి డాలర్ ఇండెక్స్ కోలుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారం ధర తగ్గింది. హైదరాబాద్ లో బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఆదివారం బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలకంటె భారీస్థాయిలో తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఏకంగా రూ. 1200 తగ్గుదల నమోదు చేసింది. దీంతో రూ. 46,300 నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ. 50 ,000 మార్క్ వద్దకు దిగొచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1300 భారీ తగ్గుదల నమోదు చేసి రూ. 50,500 లుగా నిలిచింది.
విజయవాడ, విశాఖపట్నంలలో.. ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.తాజాగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1200 తగ్గుదల నమోదు చేసింది. దీంతో రూ. 46,300 నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ. 50, 000 లకు దిగివచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1300 భారీ తగ్గుదల నమోదు చేసి రూ. 50,500 గా స్థిరపడింది.

మరోవైపు దేశరాజధాని ఢిల్లీలో మాత్రం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం నాటి ప్రారంభ ధర కంటె 10 రూపాయలు పెరిగి రూ. 48,460 వద్ద నిలిచాయి. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగింది. దీంతో రూ. 52,860 వద్దకు చేరుకుంది.

Also Read: రజనీ మక్కల్ మండ్రమ్ ఆదేశాలు బుట్టదాఖలు, చెన్నైలో రోడ్లపైకి వచ్చిన అభిమానులు