Today Silver Price: బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్న వేళ వెండి ధరల్లోనూ తగ్గుదల కనిపిస్తూ వస్తోంది. గురువారం దేశవ్యాప్తంగా తగ్గిన వెండి ధరలు నేడు (శుక్రవారం) మాత్రం ఉత్తర భారతదేశానికే పరిమితమైంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వెండి ధరలు పెరిగాయి. మరి ఈరోజు దేశ వ్యాప్తంగా కిలో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర గురువారంతో పోలిస్తే రూ.600 తగ్గి, ఈరోజు రూ.69,000గా నమోదైంది. ఇక దేశ ఆర్థిక రాజధానిలోనూ వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. ఇక్కడ కేజీ వెండి రూ.69,000గా ఉంది. ఉత్తర భారతదేశంతో పోలిస్తే సౌత్‌లో మాత్రం వెండి ధరలు పెరిగాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో శుక్రవారం కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.700 పెరిగి, రూ.74,300 వద్ద ఉంది. విజయవాడలో కూడా పెరిగిన వెండి ధర రూ.74,300గా ఉంది. ఇక చెన్నైలోనూ ఇదే ట్రెండ్ కొనసాగింది ఇక్కడ కేజీ సిల్వర్ రూ.74,300 వద్ద కొనసాగుతోంది.