పసిడి ప్రియులకు ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా భగ్గుమంటోన్న బంగారం ధరలు శనివారం (జనవరి 7) కాస్త దిగొచ్చాయి. 10 గ్రాముల బంగారంపై రూ.400 నుంచి రూ.430 వరకు తగ్గింది. మారిన ధరలతో ప్రస్తుతం దేశీయ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.50,900కు లభిస్తోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,530గా ఉంది. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. కిలో వెండిపై రూ.1000 తగ్గడం గమనార్హం. మారిన ధరలతో ప్రస్తుతం దేశీయ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 71,000 పలుకుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం ముఖ్యం.
కొత్త ధరలతో ప్రస్తుతం కిలో వెండి హైదరాబాద్‌లో రూ.73,500 పలుకుతోంది. విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, కేరళ, బెంగళూరు తదితర నగరాల్లోనూ ఇదే రేట్‌కు లభిస్తోంది. ఇక ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో కిలో వెండి రూ.71,000కు లభిస్తోంది.
గమనిక: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..